IND vs ENG 1st Test Live Day 1: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

భారత్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్  ఇవాళ  హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైంది.  

England win toss, ask India to bowl first:England win toss, ask India to bowl first lns

హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య  ఐదు టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి టెస్ట్ మ్యాచ్ కు హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియం  వేదికగా మారింది. ఇంగ్లాండ్  కెప్టెన్  బెన్ స్టోక్స్  టాస్ గెలిచారు.  బ్యాటింగ్ ఎంచుకున్నారు. 

భారత కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు అత్యుత్తమంగా ఆడాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. తాను  అండర్  -19 ప్రారంభించినప్పుడు అంతకు ముందు కూడ తాను చాలా టెస్ట్ మ్యాచ్ లు చూసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.  

also read:భారత్, ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్: హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ ట్రాక్ రికార్డు ఇదీ..

హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇప్పటికి ఐదు టెస్ట్ మ్యాచ్ లు జరిగాయి.ఈ టెస్ట్ మ్యాచ్ ల్లో  ఒకటి డ్రా అయింది. నాలుగు మ్యాచ్ ల్లో  భారత జట్టు విజయం సాధించింది. ఇవాళ్టి నుండి  ఈ నెల  29వ తేదీ వరకు  భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య  టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది.

also read:ఇండియా- ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్: స్కూల్ విద్యార్థులకు ఉచిత ప్రవేశం,లంచ్

ఈ మ్యాచ్ కోసం  రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు  1500 మంది పోలీసులు  బందోబస్తు నిర్వహిస్తున్నారు. 306 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.ఉప్పల్ స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేస్తున్నారు. ఈ మ్యాచ్ ను తిలకించేందుకు  పాఠశాల విద్యార్థులకు హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్  ఉచిత ప్రవేశం కల్పించింది. స్కూల్ విద్యార్థులకు  ఉచితంగా లంచ్ ను కూడ అందించనుంది హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్.

ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ను 60 శాతం ప్రభుత్వ, 40 శాతం ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు ఉచితంగా తిలకించేందుకు హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేసింది. హైద్రాబాద్ లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ను తిలకించేందుకు  అభిమానులు ఉదయం నుండే బారులు తీరారు.


భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ ఆశ్విన్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా

ఇంగ్లాండ్ జట్టు
బెన్ స్టోక్స్( కెప్టెన్), జాక్ క్రాలీ,  బెన్ డకెట్, ఒల్లీ పోస్, జో రూట్,  జానీ బెయిర్ స్టో, బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మాద్, టామ్ హార్టీ, మార్క్ వుడ్, జాక్ లీచ్

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios