Suryakumar Yadav: ప్ర‌పంచ క‌ప్ ఫైనల్లో ఇలా ఆడివుంటే క‌ప్పు కొట్టేవాళ్లం క‌దా బాసు.. !

India vs Australia T20I Series: ఐసీసీ క్రికెట్ వ‌రల్డ్ క‌ప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టును ఓడించింది. అయితే ఇప్పుడు 5 రోజుల్లోనే సూర్యకుమార్ యాద‌వ్ కెప్టెన్సీలో భార‌త్ ఆస్ట్రేలియాను ఓడించి  ప్రతీకారం తీర్చుకుంది.. !
 

India Vs Australia T20 Series: Suryakumar Yadav Dhanadhan innings:, india vs australia 1st t20i cricket match,icc world cup final 2023 RMA

Suryakumar Yadav Dhanadhan innings: 2023 ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. టోర్నీలో రోహిత్ శర్మ సేన వ‌రుస‌ 10 మ్యాచుల్లో 10 విజయాలు సాధించిన తర్వాత అహ్మదాబాద్ లో జరిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సాధారణంగా స్లోగా ర‌న్ అవుతున్న పిచ్ పై ఆసీస్ మొదట బ్యాటింగ్ చేయమని భారత్ ను ఆహ్వానించ‌డం చివరికి ఫలితంలో కీలక పాత్ర పోషించింది.

అయితే, ఐసీసీ క్రికెట్ వ‌రల్డ్ క‌ప్ 2023 లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టును ఓడించిన 5 రోజుల్లోనే సూర్యకుమార్ యాద‌వ్ కెప్టెన్సీలో భార‌త్ ఆస్ట్రేలియాను ఓడించి  ప్రతీకారం తీర్చుకుంది.. ! సూర్య కుమార్ యాదవ్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ భార‌త్ గెలుపులో కీల‌క పాత్ర పోషించింది. చివ‌రివ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగిన మ్యాచ్ లో భార‌త ఆట‌గాళ్ల పోరాటం ప్ర‌శంస‌నీయం. 

సూర్య‌కుమార్ యాద‌వ్ ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన టీ20 మ్యాచ్ లో ఆడిన‌ట్టుగా ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 ఫైన‌ల్ లో ఆడివుంటే ఐసీసీ మెగా టోర్న‌మెంట్ ట్రోఫీని గెటుచుకునేవాళ్ల‌మ‌ని చెప్ప‌డంతో సందేహం లేదు. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో భార‌త్ వ‌రుస వికెట్లు కోల్పోయిన త‌రుణంలో బ్యాటింగ్ కు వ‌చ్చిన సూర్య‌కుమార్ యాద‌వ్ నుంచి మంచి ఇన్నింగ్స్ ఆశించారు. కానీ, పెద్ద‌గా స్కోర్ చేయ‌కుండానే ఔట్ అయ్యాడు. 28 బంతులు ఎదుర్కొని 18 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. స్ట్రైక్ రేటు 64.29 కాగా, త‌న ఇన్నింగ్స్ ఒకే ఒక్క ఫోర్ కొట్టాడు. దీంతో సూర్య‌కుమార్ ఆట‌తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. 

ఆస్ట్రేలియాతో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టీ20 సిరీస్ కు భార‌త్ జ‌ట్టు కెప్టెన్ గా సూర్య‌కుమార్ యాద‌వ్ ను నియ‌మించ‌డంపై కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మ్యాచ్ కు ముందు సూర్య మీడియా చిట్ చాట్ కు కేవ‌లం ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టులు రావ‌డం ఒక్కింత మీడియా దృష్టిని కూడా తెలియ‌జేస్తుంది. కానీ కెప్టెన్ గా త‌న‌ను నియ‌మించ‌డం, టీ20ల్లో త‌న స్థానం ఎలాంటితో మ‌రోసారి త‌న ఇన్నింగ్స్ సూర్య నిరూపించాడు. 42 బంతుల్లో 80 పరుగులతో టీమిండియా గెలుపు కీల‌క పాత్ర పోషించాడు. 

ఈ మ్యాచ్ కు ముందు సూర్య కుమార్ యాద‌వ్ టీ20 రికార్డులు, అత‌ని కెరీర్ రికార్డులు గ‌మ‌నిస్తే.. 53 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 46.02 సగటు, 172.70 స్ట్రైక్ రేట్‌తో 1841 పరుగులు చేశాడు. టీ20 టీమ్‌కి కెప్టెన్సీ రావడానికి ఇదే కారణమ‌ని చెప్ప‌వ‌చ్చు. సూర్య వ‌న్డే రికార్డులు అంత గొప్ప‌గా లేవ‌ని చెప్పాలి. 37 మ్యాచ్‌లలో 25.76 సగటుతో 773 పరుగులు చేయగలిగాడు. ఆడిన‌ ఒకే ఒక్క టెస్టులో 8 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న టీ20 సిరీస్ ను అందిస్తే  ఫ్యూచ‌ర్ భార‌త్ జ‌ట్టు రెగ్యులర్ టీ20 కెప్టెన్సీ లిస్టులో సూర్య‌కుమార్ ఉంటాడ‌ని చెప్ప‌వ‌చ్చు.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios