వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను గెలుచుకున్న భారత్... శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో సమరానికి సిద్ధమైంది. ఈ రెండు జట్లతో సిరీస్‌కు టీమిండియా సెలక్టర్లు సోమవారం వేరు వేరుగా జట్లను ప్రకటించారు.

Also read:లక్ష్యసాధనలో జూలు విదిల్చే కోహ్లీ: సెంటిమెంట్‌ను నిలబెట్టుకున్న కెప్టెన్

ప్రపంచకప్‌ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన భారత్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వస్తుండగా.. ఓపెనర్ రోహిత్ శర్మకు శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించారు. దీంతో గాయం కారణంగా జట్టుకు దూరమైన గబ్బర్ శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి వస్తున్నాడు.

Also Read:విరాట్ కు ప్రేమతో... ఖర్చు, నొప్పి ఊహించగలరా?

దీపక్ చాహర్‌ గాయంతో నవదీప్ షైనీకి సెలక్టర్లు మరో ఛాన్సిచ్చారు. రిషభ్ పంత్‌కు తోడుగా మరో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్‌కు మళ్లీ అవకాశం కల్పించారు. జనవరి 5 నుంచి శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, జనవరి 14 నుంచి ఆస్ట్రేలియాతో మాడు వన్డేల సిరీస్‌‌ ఆరంభం కానుంది. 

శ్రీలంకతో సిరీస్ కోసం టీమిండియా: 
విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, శివం దూబే, మనీష్ పాండే, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్.

ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం భారత జట్టు: 
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్, కేదార్ జాదవ్, శివం దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్.