తొలిసారి బ్యాటింగ్ చేసిన జట్టుతో పోలిస్తే ఛేజింగ్‌కు దిగిన జట్టుపై ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లక్ష్యఛేదనల్లో తన ప్రత్యేకతను చూపిస్తూ దూసుకెళ్తున్నాడు.

గతంలో 300 అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయాల్సి వచ్చినప్పుడు కోహ్లీ కసిగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చిన సందర్భాలు అనేకం. తాజాగా వెస్టిండీస్‌తో కటక్‌లో జరిగిన చివరి వన్డేలోనూ కోహ్లీ మరోసారి సత్తా చాటాడు.

Also Read:విరాట్ కోహ్లీ రికార్డుల మోత: బౌలర్లలో షమీ టాపర్

రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. లోకేశ్ రాహుల్‌, రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్సును చక్కదిద్దాడు. వందకు పైగా స్ట్రైక్ రేటుతో 85 పరుగుల చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఈ క్రమంలో లక్ష్యఛేదనల్లో కోహ్లీ 107.13 స్ట్రైక్ రేటుతో ఇప్పటి వరకు 9 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో అత్యధిక వ్యక్తిగత స్కోరు 183. కాగా వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ 43 సెంచరీలతో రెండో స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Also Read:విరాట్ కు ప్రేమతో... ఖర్చు, నొప్పి ఊహించగలరా?

ఆదివారం కటక్‌లో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన 316 లక్ష్యాన్ని 48.4 ఓవర్లలోనే ఛేదించింది. విరాట్ కోహ్లీ 85, కేఎల్ రాహుల్ 89, రోహిత్ శర్మ 63 పరుగులు చేశారు.