IND vs ENG: నిజంగా అది నా త‌ప్పే.. సర్ఫరాజ్ ఖాన్ కు సారీ చెప్పిన జ‌డేజా.. చేసిందంతా చేసి.. !

India vs England 3rd Test: అరంగేట్రం మ్యాచ్ లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ అద్భుత‌మైన ఆట‌తో అద‌ర‌గొట్టాడు. అయితే, రవీంద్ర జడేజా తీరు కారణంగా అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. 
 

IND vs ENG: That's really my fault.. Ravindra Jadeja apologises to Sarfaraz Khan; Do everything you've done and now it's like this.. RMA

Ravindra Jadeja-Sarfaraz Khan: ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టులో సెంచరీ చేసిన రవీంద్ర జడేజాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరంగేట్రంలోనే బాగా ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ కావడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. సర్ఫరాజ్ రనౌట్ కు జడేజానే కారణమని విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. 66 బంతుల్లో 62 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ ఇన్నింగ్స్ లో ఒక సిక్స్, 9 ఫోర్లు కొట్టాడు. అత‌ని ఆట దూకుడు చూస్తుంటే సెంచ‌రీ కొట్టేలా క‌నిపించాడు.

ఆత్మవిశ్వాసంతో తొలి మ్యాచ్ అనే భ‌యం లేకుండా ధ‌నాధ‌న్ బ్యాటింగ్ చేస్తున్న సర్ఫరాజ్ సెంచరీ చేస్తాడని అభిమానులు ఆశించారు. కానీ దురదృష్టం రనౌట్ రూపంలో వచ్చింది. సెంచ‌రీకి ద‌గ్గ‌రైన త‌ర్వాత జ‌డ్డూ భాయ్ మ‌రీ నెమ్మ‌దించాడు. కొంచెం ఒత్తిడికి గురైన‌ట్టుగా కూడా క‌నిపించాడు. ఇక‌ జడేజా 99 పరుగులతో ఉన్న‌ప్పుడు సింగిల్ తీసి సెంచ‌రీ చేయాల‌నుకున్నాడు. జేమ్స్ అండర్సన్ వేసిన బంతిని జడేజా మిడిలార్డర్ వైపు కొట్టాడు. ప‌రుగు కోసం స‌ర్ఫ‌రాజ్ ఖాన్ కు కాల్ ఇచ్చాడు. దీంతో స‌ర్ఫ‌రాజ్ ప‌రుగు కోసం వెళ్లాడు.. కానీ, మార్క్ వుడ్ బంతిని తన చేతుల్లో పట్టుకుకోవ‌డంతో జ‌డేజా  ప‌రుగు కోసం వ‌చ్చిన మ‌ళ్లీ వెన‌క్కి వెళ్లాడు. ఇంతలోనే మార్క్ వుడ్ సర్ఫరాజ్ తిరిగి క్రీజులోకి రావ‌డానికి ముందే నేరుగా వికెట్ల‌ను బాల్ తో కొట్టాడు. దీంతో ర‌నౌట్ గా సర్ఫరాజ్ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.

IND VS ENG: సెంచ‌రీ కోసం సర్ఫరాజ్ ఖాన్ ను బ‌లి చేశావా జ‌డ్డూ భాయ్.. ! రోహిత్ శ‌ర్మ కోపం చూశారా..?

ఆ త‌ర్వాత జ‌డేజా కుల్దీప్ యాద‌వ్ తో క‌లిసి ఒక్క ప‌రుగు తీసి సెంచ‌రీని పూర్తి చేశాడు. అయితే, త‌న సెంచ‌రీ కోసం స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ర‌నౌట్ కావ‌డంతో పెద్ద‌గా సంబ‌రాలు కూడా చేసుకోలేదు జ‌డేజా. జడేజా నుంచి వచ్చిన తప్పుడు పిలుపుతో సర్ఫరాజ్ వికెట్ వృథా అయింది. దూకుడుగా అడుతున్న స‌ర్ప‌రాజ్ త‌న వ‌ల్ల‌ ఔట్ కావ‌డంపై జ‌డేజా స్పందించాడు. ఈ క్ర‌మంలోనే క్షమాపణలు చెప్పాడు. జడేజా ఇన్స్టాగ్రామ్ వేదిక‌గా,  స‌ర్ఫ‌రాజ్ కు క్షమాపణలు చెప్పాడు. తనది తప్పుడు కాల్ అని జడేజా అంగీకరించాడు.

నెట్టింట ర‌వీంద్ర జ‌డేజా పై విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. జడేజా స్వార్థమే సర్ఫరాజ్ శతకాన్ని చేజార్చుకునేలా చేసిందని అభిప్రాయపడుతున్నారు.  జడేజా 84 పరుగులు చేయగా సర్ఫరాజ్ క్రీజులోకి వచ్చాడు. జడ్డూ 99 పరుగుల వద్ద ఉండగా అతను రనౌట్ అయ్యాడు. 99 ప‌రుగుల్లో జ‌డేజా చేరుకోగా, స‌ర్ఫ‌రాజ్ ఏకంగా అప్ప‌టికే 62 ప‌రుగులు చేశాడు. ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో అద‌ర‌గొడుతూ సెంచ‌రీ కొట్టేలా క‌నిపించాడు.  వీరిద్దరూ రెండో వికెట్ కు 77 పరుగులు జోడించారు. సెంచరీ సాధించే ప్రయత్నంలో స‌ర్ఫ‌రాజ్ ఇలా ఔట్ అయ్యాడు.

India vs England: సంవ‌త్స‌రాల నిరీక్ష‌ణ‌కు తెర‌.. కన్నీళ్లు పెట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios