Asianet News TeluguAsianet News Telugu

IND vs ENG: సెంచ‌రీకి అడుగు దూరంలో శుభ్‌మ‌న్ గిల్ హార్ట్ బ్రేకింగ్ రనౌట్ !

India vs England : రాజ్ కోట్ లో  శుభ్‌మ‌న్ గిల్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టు 4వ రోజు టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మ‌న్ గిల్ కూడా సెంచ‌రీకి 9 ప‌రుగుల దూరంలో ఔట్ అయ్యాడు.

IND vs ENG: Shubman Gill, who lost the chance to score the second century in consecutive Tests.. ran out 9 runs away from the century RMA
Author
First Published Feb 18, 2024, 10:59 AM IST | Last Updated Feb 18, 2024, 11:04 AM IST

India vs England : రాజ్ కోట్ లో ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న మూడో టెస్టులో భార‌త్ భారీ అధిక్యం దిశ‌గా ముందుకు సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శ‌ర్మ‌, ర‌వీంద్ర జ‌డేజాలు సెంచ‌రీలు సాధించ‌డంతో భార‌త్ కు 126 ప‌రుగుల అధిక్యం ల‌భించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ మూడో రోజు సెంచ‌రీలో చెల‌రేగాడు. భార‌త్-ఇంగ్లాండ్ 4వ రోజు టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ చేసేలా క‌నిపించాడు కానీ, అనూహ్యంగా ర‌నౌట్ కావ‌డంతో 9 ప‌రుగుల దూరంలో ఆగిపోయాడు. 91 ప‌రుగుల వ‌ద్ద ర‌నౌట్ అయ్యాడు. 

అంత‌కుముందు, రాజ్ కోట్ లో జ‌రుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ పై భార‌త బ్యాట‌ర్స్ మంచి ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ కొట్టాడు. 131 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు,  3 సిక్స‌ర్లు బాదాడు. ఆ త‌ర్వాత భార‌త్ స్టార్ ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా సైతం సెంచ‌రీ కొట్టాడు. 112 ప‌రుగుల జ‌డేజా త‌న ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ తుఫాన్ ఇన్నింగ్స్ తో సెంచ‌రీ కొట్టాడు. 104 ప‌రుగులు చేసిన త‌ర్వాత రిటైర్డ్ హర్ట్ వెనుదిరిగాడు. త‌న సెంచ‌రీ ఇన్నింగ్స్ లో జైస్వాల్ 9 ఫోర్లు, 5 సిక్స‌ర్లు బాదాడు. 

IPL 2024 - CSK : ధోని తో జోడీ క‌ట్టిన కత్రినా కైఫ్.. !

శుభ్ మ‌న్ గిల్ కూడా సెంచ‌రీ ద‌గ్గ‌ర‌కు చేరుకున్నాడు. కానీ, 9 ప‌రుగుల దూరంలో ర‌నౌట్ కావ‌డంతో వ‌రుస‌గా టెస్టుల్లో రెండు సెంచ‌రీలు కొట్టే ఛాన్స్ ను కోల్పోయాడు.  ఈ మ్యాచ్ లో భారత్ తరఫున రెండో రనౌట్. ఈ టెస్టుతో అరంగేట్రం చేసిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్ లో ధ‌నాధ‌న్ బ్యాటింగ్ చేసి అద‌ర‌గొట్టాడు. అయితే, దుర‌దృష్ట‌వ‌శాత్తు 62 ప‌రుగుల వ‌ద్ద ర‌నౌట్ అయ్యాడు. మ‌రో ప్లేయ‌ర్ ధృవ్ జురెల్ 46 ప‌రుగులు కొట్టాడు.

 

ఒక్కడు, పోకిరి, దూకుడు ఇవేమీ కాదు..కృష్ణకి అత్యంత ఇష్టమైన మహేష్ మూవీ అదే, ఎందుకో తెలుసా 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios