MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒక్కడు, పోకిరి, దూకుడు ఇవేమీ కాదు..కృష్ణకి అత్యంత ఇష్టమైన మహేష్ మూవీ అదే, ఎందుకో తెలుసా

ఒక్కడు, పోకిరి, దూకుడు ఇవేమీ కాదు..కృష్ణకి అత్యంత ఇష్టమైన మహేష్ మూవీ అదే, ఎందుకో తెలుసా

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం కసరత్తు చేస్తున్నారు. రాజ కుమారుడుతో కెరీర్ ప్రారంభించిన మహేష్.. ప్రతి చిత్రంతో ఒక్కో మెట్టు ఎదుగుతూ తన తండ్రి గర్వపడేలా చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Feb 17 2024, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం కసరత్తు చేస్తున్నారు. రాజ కుమారుడుతో కెరీర్ ప్రారంభించిన మహేష్.. ప్రతి చిత్రంతో ఒక్కో మెట్టు ఎదుగుతూ తన తండ్రి గర్వపడేలా చేశారు. మహేష్ బాబు ఒక్కడు చిత్రంతో తొలి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పోకిరి చిత్రంతో సౌత్ లో తిరుగులేని స్టార్ హీరోగా మారిపోయారు. బాక్సాఫీస్ కి బిజినెస్ మాన్ అయిపోయాడు. అప్పటి నుంచి మహేష్ నటించే ప్రతి చిత్రానికి ఆకాశాన్ని తాకే అంచనాలు ఉంటున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళ చిత్రంతో గ్లోబల్ మార్కెట్ పైనే కన్నేశాడు. అయితే మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్ని కమర్షియల్ హిట్ అందుకున్నప్పటికీ తన తండ్రిని మెప్పించిన చిత్రం అంటేనే ఎంతో ప్రత్యేకం. 

36

ఒక చిత్రంలో మహేష్ నటన చూసి సూపర్ స్టార్ కృష్ణ సైతం ఆశ్చర్యపోయారు. ఆ చిత్రం మరేదో కాదు.. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మురారి. మురారి మహేష్ కెరీర్ లో ఎప్పటికి ఒక స్పెషల్ అనే చెప్పాలి. జాతకాలు,  కుటుంబానికి తగిలిన శాపం, ఫ్యామిలీ ఎమోషన్స్ లాంటి ఎలిమెంట్స్ తో తెరకెక్కిన మురారి చిత్రంలో మహేష్ బాబు అల్రౌండ్ పెర్ఫామెన్స్ చూడొచ్చు. 

46

ఈ చిత్రం విడుదలై నేటికి 23 ఏళ్ళు పూర్తయింది. దర్శకుడు కృష్ణ వంశీ ఎంతో అందంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సోనాలి బింద్రేతో కెమిస్ట్రీ కూడా బాగా పండింది. నటి లక్ష్మి, సత్య నారాయణ, శివాజీ రాజా, మారుతీ రావు ఇలా చాలా మంది నటీనటులు ఉన్నారు. ఈ చిత్రానికి అనేక నంది అవార్డులు కూడా దక్కాయి. మహేష్ నటనకు స్పెషల్ జ్యురి అవార్డు లభించింది. 

56

ఒక సందర్భంలో మహేష్ బాబు ఈ చిత్రం గురించి గుర్తు చేసుకున్నారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణకి అంత్యంత ఇష్టమైన చిత్రం మురారినే అట. ఈ చిత్రం రిలీజ్ అయినప్పుడు మహేష్, కృష్ణ ఇద్దరూ ఒక థియేటర్ లో చూశారట. షో అయిపోగానే కృష్ణ ఒక్క మాట కూడా మాట్లాడలేదట. మహేష్ నటనకి ఎంతో భావోద్వేగానికి గురవుతూ భుజం పై చేయి వేసి తట్టారట. 

66

ఆయన కంటి వెంట ఆనంద భాష్పాలు వచ్చాయట. మిగిలిన సినిమాలకు ఏదో ఒక కాంప్లిమెంట్ ఇస్తుంటారు. కానీ మురారి చిత్రానికి ఒక్క మాట కూడానా మాట్లాడకుండా తన సంతోషం మొత్తాన్ని కళ్ళల్లో చూపించారని మహేష్ గుర్తు చేసుకున్నారు. అప్పుడే ఈ చిత్రం విడుదలై 23 ఏళ్ళు గడచిపోయింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix: ఓటీటీలో చిరంజీవి సంచలన పాడ్ కాస్ట్, ఇది కూతురి ప్లాన్.. సినిమాలు, రాజకీయాల్లో తెరవెనుక ఏం జరిగింది
Recommended image2
Bigg Boss Telugu 10: ఆడపిల్ల ఉంటే ఆడంగి వేషాలు వేసేది నువ్వే.. రోహిత్ పై రెచ్చిపోయిన త్రిగుణ్
Recommended image3
Taapsee Marriage: 13 ఏళ్ల సీక్రెట్ రిలేషన్‌షిప్‌పై నోరువిప్పిన తాప్సీ..నా పార్ట్నర్ ని నేనే ఎంచుకున్నా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved