IPL 2024 - CSK : ధోని తో జోడీ కట్టిన కత్రినా కైఫ్.. !
MS Dhoni- Katrina Kaif: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) రాబోయే సీజన్ లో ఎంఎస్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మరోసారి సత్తా చాటాలని చూస్తోంది. ఎలాగైనా ఈసారి కూడా కప్పు కొట్టాలనుకుంటోంది.
Katrina Kaif, MS Dhoni
Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) కొత్త సీజన్ కు సర్వం సిద్ధమవుతోంది. మరో నెల రోజుల్లో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్లేయర్లతో ఆయా టీమ్ లు ప్రాక్టిస్ ను మొదలుపెట్టాయి. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని సైతం ఐపీఎల్ కోసం బ్యాట్ పట్టి ప్రాక్టిస్ ను మొదలుపెట్టాడు. చెన్నై ఫ్రాంచైజీ ఐపీఎల్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ను టీమ్ లోకి తీసుకువచ్చింది. కత్రినా చేరికతో చెన్నై సూపర్ కింగ్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌లు మరింత బ్రాండ్ విలువను పెంచుకున్నారు.
Katrina Kaif
కత్రినా కైఫ్ ధోని టీమ్ తో జోడీ కట్టింది. బాలీవుడ్ సెలబ్రిటీని బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకున్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో ఈ సారి ఐపీఎల్ లో చెన్నై టీమ్-ధోని-కత్రినా కైఫ్ జోడీతో మరింత ఆసక్తిని పెంచింది. మీడియా నివేదికల ప్రకారం.. కత్రినా కైఫ్ ను చేర్చుకోవడం ద్వారా ఐదుసార్లు ఛాంపియన్‌లు తమ బ్రాండ్ విలువను పెంచుకుంటారు. అంతేకాకుండా, ఫ్రాంచైజీ రాబోయే ఎడిషన్‌కు ముందు వారి లోగోలో కొన్ని మార్పులు చేస్తుందని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, దీనిపై చెన్నై ఫ్రాంఛైజీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఎంఎస్ ధోని నేతృత్వంలోని సీఎస్కే 2024 ఎడిషన్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ప్రవేశిస్తుంది. అలాగే, ధోనీకి ఇది చివరి ఐపీఎల్ అయ్యే అవకాశముంది. దీంతో చెన్నై ఎలాగైన టైటిల్ గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని చూస్తోంది. ప్రస్తుతం ఎంఎస్ ధోనీతో పాటు రవీంద్ర జడేజా, అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ వంటి దిగ్గజాలు జట్టులో ఉన్నారు. అలాగే, యంగ్ ప్లేయర్ రచిన్ రవీంద్రతో పాటు డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, మతీషా పతిరానాలతో చెన్నై టీమ్ బలంగా కనిపిస్తోంది.
ఐపీఎల్ 2024 కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు:
ఎంఎస్ ధోని (కెప్టెన్ & వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, షేక్ రషీద్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ, శివమ్ దూబే, నిషాంత్ సింధు, అజయ్ మండల్, రాజవర్ధన్ హంగర్గేకర్, దీపక్ చాహర్, ముకేష్ తీక్షణ, మహేశ్ తీక్షణా, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరానా, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, అవినాష్ రావు అరవెల్లి.
Chennai Super Kings, MS Dhoni
కాగా, ఐపీఎల్ 2024 ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రాంచైజీ లీగ్ గా కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి 22 లేదా 23న కొత్త సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, టోర్నమెంట్ షెడ్యూల్ త్వరలో వెలువడుతుందని భావిస్తున్నారు, WPL 2024 ముగిసిన ఒక వారం తర్వాత ప్రారంభమవుతుంది. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఐపీఎల్ షెడ్యూల్ ను ప్రకటించే అవకాశముంది.