IND vs ENG 3rd Test Day 1 highlights: రోహిత్, జడేజా సెంచరీలు.. సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్

India vs England 3rd Test Day 1 highlights: భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టు తొలిరోజు భారత బ్యాటర్స్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు సెంచరీలు కొట్టడంతో భారత్ పై చేయి సాధించింది. సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్ తో తొలి రోజు  326/5 (86) పరుగులతో ఆటను ముగించింది. 
 

India vs England 3rd Test Day 1 highlights:  Rohit Sharma, Ravindra Jadeja centuries, Sarfaraz Khan's explosive innings RMA

India vs England 3rd Test Day 1 highlights: రాజ్ కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో టీమిండియా బ్యాట‌ర్స్ రాణించడంతో తొలిరోజు భారత్ పైచేయి సాధించింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు సెంచరీలతో చెలరేగారు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. తొలి రోజు భార‌త్  326/5 (86) పరుగులతో ఆటను ముగించింది.

భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టు తొలి రోజు హైలెట్స్: 

తొలి సెషన్ లో భార‌త్ కు షాక్.. ! 

రాజ్ కోట్ టెస్టులో భార‌త్ టాస్ గెలిచింది. దీంతో రోహిత్ శ‌ర్మ మొద‌ట బ్యాటింగ్ చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన భారత్ కు మ్యాచ్ ప్రారంభమైన ఆర‌గంట‌లోనే బిగ్ షాక్ త‌గిలేలా మూడు వికెట్లు కోల్పోయింది. ఈ సిరీస్ లో డబుల్ సెంచ‌రీ కొట్టిన యంగ్ ప్లేయ‌ర్, ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ 10 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. 4వ ఓవ‌ర్ లో భార‌త్ తొలి వికెట్ ను కోల్పోయింది. ఈ త‌ర్వాత గ్రౌండ్ లోకి వ‌చ్చిన శుభ్ మ‌న్ గిల్ మ‌రోసారి డకౌట్ గా వెనుదిరిగాడు. ర‌జత్ ప‌టిదారు 5 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. 9 ఓవ‌ర్ల‌రే భార‌త్ 3 వికెట్లు కోల్పోయింది. 

రోహిత్ శ‌ర్మ, ర‌వీంద్ర జ‌డేజా సెంచ‌రీలు.. 

తొలి సెషన్ లో 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డ స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ నిల‌క‌డ‌గా ఆడుతూ.. భార‌త ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దాడు. ఈ క్ర‌మంలోనే సెంచ‌రీ చేసిన త‌ర్వాత భారీ షాట్ కొట్ట‌బోయి షాట్ బాల్ కు ఔట్ అయ్యాడు. 131 ప‌రుగుల ఇన్నింగ్స్ లో రోహిత్ శ‌ర్మ 14 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాదాడు. త‌ర్వాతి సెష‌న్ల‌లో వికెట్లు ప‌డ‌కుండా రోహిత్ శ‌ర్మ‌, ర‌వీంద్ర జ‌డేజాలు భార‌త్ స్కోర్ ను 200 లు దాటించారు. ఈ క్ర‌మంలోనే రోహిత్ ఔట్ అయిన త‌ర్వాత స‌ర్ఫ‌రాజ్ ఖాన్ తో క‌లిసి ర‌వీంద్ర జ‌డేజా సెంచ‌రీ కొట్టి భార‌త్ స్కోర్ ను 300 మార్క్ దాటించాడు. 110* ప‌రుగుల‌తో ర‌వీంద్ర జ‌డేజా క్రీజులో ఉన్నాడు. త‌న సెంచ‌రీ ఇన్నింగ్స్ లో జ‌డేజా 9 ఫోర్లు, 2  సిక్స‌ర్లు బాదాడు.

అరంగేట్రంలోనే అద‌ర‌గొట్టిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్.. 

రోహిత్ శ‌ర్మ ఔట్ అయిన త‌ర్వాత ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన స‌ర్ఫార‌జ్ ఖాన్ బ్యాటింగ్ కు వ‌చ్చాడు. తాను ఉన్నంత సేపు ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఈ క్ర‌మంలోనే స‌ర్ఫ‌రాజ్ ఖాన్ హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. అరంగేట్రంలోనే అత్యంత వేగంగా అర్థ సెంచ‌రీ కొట్టిన ప్లేయ‌ర్ గా నిలిచాడు. అయితే, జ‌డేజా ఇచ్చిన ర‌న్ కాల్ కార‌ణంగా దుర‌దృష్టవ‌శాత్తు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 62 ప‌రుగుల వ‌ద్ద ర‌నౌట్ అయ్యాడు. అత‌ను 9 ఫోర్లు, ఒక సిక్స‌ర్ కొట్టాడు. మంచి జోష్ మీదున్న స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ర‌నౌట్ కావ‌డంతో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సైతం నిరాశ‌తో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. 

మెరిసిన మార్క్ వుడ్.. మొత్తంగా భార‌త్ దే పై చేయి.. 

భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టు తొలి రోజు మొద‌టి సెష‌న్ లో ఇంగ్లాండ్ బౌల‌ర్ మార్క్ వుడ్ టీమిండియాను దెబ్బ‌కొట్టాడు. కీల‌క‌మైన మూడు వికెట్లు తీసుకున్నాడు. య‌శ‌స్వి జైస్వాల్, శుభ్ మ‌న్ గిల్ ల‌ను ఔట్ చేశాడు. సెంచ‌రీ కొట్టిన రోహిత్ శ‌ర్మ కూడా మార్క్ వుడ్ బౌలింగ్ లోనే ఔట్ అయ్యాడు. దూకుడుగా ఆడుతున్న స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ను ర‌నౌట్ చేసింది కూడా మార్క్ వుడ్. టామ్ హార్ట్లీ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు.

తొలి రోజు భార‌త్ స్కోర్: 326/5 (86)

రోహిత్ శ‌ర్మ - 131
ర‌వీంద్ర జ‌డేజా* - 110
స‌ర్ఫ‌రాజ్ ఖాన్ - 62

మార్క్ వుడ్ - 3 వికెట్లు, ఒక ర‌నౌట్.

హార్దిక్ పాండ్యాకు ఝ‌ల‌క్.. టీ20 ప్రపంచకప్‍-2024 లో భార‌త కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios