11:30 PM (IST) Mar 04

IND vs AUS: హార్దిక్ పాండ్యా సూప‌ర్ సిక్స‌ర్ల‌తో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రికార్డు

India vs Australia: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాను అద‌రిపోయే దెబ్బ‌కొట్టింది భార‌త్. 2023 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 

పూర్తి కథనం చదవండి
10:45 PM (IST) Mar 04

IND vs AUS: దెబ్బ అదిరింది.. ఆస్ట్రేలియాపై ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్

India vs Australia: ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 లో భారత్ దెబ్బ‌కు ఆస్ట్రేలియా అదిరింది. దుబాయ్ లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై విజ‌యంతో టీమిండియా 2023 ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి ప్ర‌తీకారం తీర్చుకుంది. 

పూర్తి కథనం చదవండి
09:42 PM (IST) Mar 04

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: ఆసీస్ చిత్తు.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లోకి భారత్

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ కు భారత్ చేరుకుంది. మంగళవారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ టోర్నమెంట్‌లో టీం ఇండియా వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది.

09:32 PM (IST) Mar 04

IND vs AUS: క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శ‌ర్మ

India vs Australia: భార‌త్-ఆస్ట్రేలియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ యూనివ‌ర్స‌ల్ బాస్, వెస్టిండీస్ మాజీ స్టార్ ప్లేయ‌ర్ క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. 

పూర్తి కథనం చదవండి

09:19 PM (IST) Mar 04

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: 84 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔట్

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: భారత జట్టు 35 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత సూపర్‌స్టార్ విరాట్ కోహ్లీ 43వ ఓవర్ మూడో బంతికి సిక్స్ కొట్టే ప్రయత్నంలో ఔటయ్యాడు. విరాట్ 98 బంతుల్లో 84 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 

08:34 PM (IST) Mar 04

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: 4వ వికెట్ కోల్పోయిన భారత్ 35 ఓవర్లలో 178/4 పరుగులు

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: భారత జట్టు 35 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ 68 పరుగులతో ఉన్నాడు. 35 ఓవర్ చివరి బంతికి అక్షర్ పటేల్ (27 పరుగులు) ను ఎలిస్ బౌల్డ్ చేశాడు.

08:06 PM (IST) Mar 04

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: మూడో వికెట్ కోల్పోయిన భారత్

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: భారత జట్టు మూడో వికెట్ ను కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ 45 పరుగుల వద్ద ఆడమ్ పంజా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. భారత్ 134/3 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 

08:04 PM (IST) Mar 04

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: హాఫ్ సెంచరీ కొట్టిన కోహ్లీ

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: భారత జట్టు టార్గెట్ ను అందుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లీ 54 బంతుల్లో 50* పరుగులతో క్రీజులో ున్నాడు. భారత్ జట్టు 26 ఓవర్లు ముగిసే సరికి భారత్ 134/2 పరుగులతో ఆటను కొనసాగుతోంది. శ్రేయాస్ అయ్యర్ 45 పరుగులతో ఆడుతున్నాడు. 

07:50 PM (IST) Mar 04

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: 20 ఓవర్లలో భారత్ 103/2 పరుగులు

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: భారత జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 31 పరుగులు, విరాట్ కోహ్లీ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Scroll to load tweet…
07:21 PM (IST) Mar 04

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: 10 ఓవర్లలో భారత్ 55/2 పరుగులు

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: భారత జట్టు 10 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 7 పరుగులు, విరాట్ కోహ్లీ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

07:19 PM (IST) Mar 04

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: రోహిత్ శర్మ కూడా ఔట్

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: భారత జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో రెండో దెబ్బ తగిలింది. ఎనిమిదో ఓవర్ ఐదవ బంతికి హిట్ మ్యాన్ ఔటయ్యాడు. కూపర్ కొన్నోలీ LBWగా ఔట్ చేశాడు. రోహిత్ 29 బంతుల్లో 28 పరుగులు చేశాడు. కూపర్ వేసిన బంతిని స్కూప్ షాట్‌తో వెనక్కి కొట్టాలని రోహిత్ అనుకున్నాడు, కానీ బంతి అతని ప్యాడ్‌కు తగిలింది. బౌలర్ అప్పీల్ తో అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. 9 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్లకు 47 పరుగులు చేసింది.

06:58 PM (IST) Mar 04

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: తొలి వికెట్ కోల్పోయిన భారత్

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: 265 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు మొదటి షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ 8 పరుగులు చేసి డ్వార్షిస్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. 5 ఓవర్లలో భారత్ 30-1 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. క్రీజులో రోహిత్, కోహ్లీలు ఉన్నారు. 
06:04 PM (IST) Mar 04

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్ అయింది. 

ఆసీస్ బ్యాటింగ్:

ట్రావిస్ హెడ్ - 39 పరుగులు

స్టీవ్ స్మిత్ - 71

అలెక్స్ క్యారీ - 61

భారత బౌలింగ్: 

మహ్మద్ షమీ - 3 వికెట్లు

వరుణ్ చక్రవర్తి - 2 వికెట్లు

రవీంద్ర జడేజా - 2 వికెట్లు 

05:59 PM (IST) Mar 04

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: మూడో వికెట్ తో తన 10 ఓవర్లను పూర్తి చేసిన షమీ

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: ఆస్ట్రేలియా 9వ వికెట్ కోల్పోయింది. మహ్మద్ షమీ బౌలింగ్ లో నాథన్ ఎల్లిస్ క్యాచ్ రూపంలో విరాట్ కోహ్లీ దొరికిపోయాడు. దీంతో 49 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ 262 పరుగులు చేసింది. షమీ 3 వికెట్లతో తన 10 ఓవర్లను పూర్తి చేశాడు.
05:50 PM (IST) Mar 04

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: 8వ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో 1వ సెమీ ఫైన‌ల్ భార‌త్-ఆస్ట్రేలియా మ్యాచ్ లో కంగారు టీమ్ 8వ వికెట్ కోల్పోయింది. పాండ్యా బౌలింగ్ లో అలెక్స్ క్యారీ (61 పరుగులు) రనౌట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ సూపర్ త్రో తో వికెట్లను హిట్ చేశాడు. ఆసీస్ 48 ఓవర్లలో 252 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

05:39 PM (IST) Mar 04

Champions Trophy 2025 India Vs Australia, 1st Semi-Final : వరుణ్ చక్రవర్తి ఖాతాలో రెండో వికెట్

Champions Trophy 2025 India Vs Australia, 1st Semi-Final : ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. బీజే డ్యార్షిస్ 19 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. ఆస్ట్రేలియా 46 ఓవర్లలో 242 పరుగులతో ఆడుతోంది.

05:28 PM (IST) Mar 04

Champions trophy 2025 India vs Australia, 1st Semi-Final : హాఫ్ సెంచరీ కొట్టిన అలెక్స్ క్యారీ

Champions trophy 2025 India vs Australia, 1st Semi-Final : హాఫ్ సెంచరీ కొట్టిన అలెక్స్ క్యారీ 

అలెక్స్ క్యారీ 48 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. తన వన్డే కెరీర్లో 12వ అర్థ సెంచరీ. అతని ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్లు కోల్పోయి 227 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 

05:17 PM (IST) Mar 04

India vs Australia, 1st Semi-Final: ఆస్ట్రేలియా 40 ఓవర్లలో 213/6 పరుగులు

India vs Australia, 1st Semi-Final: ఆస్ట్రేలియా 40 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 213 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. క్రీజులో క్యారీ 44 పరుగులు, డ్యార్షిస్ 3 పరుగులతో ఆడుతున్నారు.

05:11 PM (IST) Mar 04

India vs Australia, 1st Semi-Final: ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

India vs Australia, 1st Semi-Final: ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

గ్లెన్ మాక్స్ వెల్ 7 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

04:43 PM (IST) Mar 04

IND vs AUS: భార‌త్ vs ఆస్ట్రేలియా.. దూకుడుగా ఆడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో 1వ సెమీ ఫైన‌ల్ లో భార‌త్-ఆస్ట్రేలియాలు త‌ల‌ప‌డుతున్నాయి. 30 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులతో ఆటను కొనసాగిస్తుంది. అలెక్స్ క్యారీ 11, స్టీవ్ స్మిత్ 62 పరుగులతో ఆడుతున్నారు.