MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs AUS: హార్దిక్ పాండ్యా సూప‌ర్ సిక్స‌ర్ల‌తో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రికార్డు

IND vs AUS: హార్దిక్ పాండ్యా సూప‌ర్ సిక్స‌ర్ల‌తో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రికార్డు

India vs Australia: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాను అద‌రిపోయే దెబ్బ‌కొట్టింది భార‌త్. 2023 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 04 2025, 11:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

IND vs AUS Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి భారత జ‌ట్టు ఫైనల్‌కు చేరుకుంది. దుబాయ్‌లో జరిగిన సెమీఫైనల్లో టీం ఇండియా నాలుగు వికెట్ల తేడాతో కంగారూలను ఓడించింది. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ.

84 పరుగుల ఇన్నింగ్స్ తో టీమిండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించినందుకు విరాట్ కోహ్లీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ విజయంతో ఇండియా ఫైనల్స్‌కు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మొద‌ల‌య్యాయి. కాగా, ఈ మ్యాచ్ లో భార‌త స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బాదిన మూడు సిక్స‌ర్ల‌తో ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో సిక్స‌ర్ల మోత  

మంగళవారం దుబాయ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భార‌త్ విక్ట‌రీలో హార్దిక్ పాండ్యా బాదిన సిక్స‌ర్లు కీల‌కంగా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇప్ప‌టివ‌ర‌కు 115 సిక్సర్లు నమోదయ్యాయి. ఇది ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఒక ఎడిష‌న‌ల్ లో న‌మోదైన అత్య‌ధిక సిక్స‌ర్లు.

ప్రస్తుత ఐసీసీ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు 115 సిక్సర్లు నమోదయ్యాయి. 2017లో నమోదైన 113 సిక్సర్ల సంఖ్యను ప్ర‌స్తుత ఎడిష‌న్ అధిగమించింది.

34
Image Credit: Getty Images

Image Credit: Getty Images

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన జ‌ట్టు ఏది? 

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్ తర్వాత ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో 23 సిక్సర్లతో ఆఫ్ఘనిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. భార‌త్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకు 19 సిక్సర్లు కొట్టి రెండవ స్థానంలో ఉన్నాయి.

న్యూజిలాండ్ 14 సిక్సర్లతో మూడవ స్థానంలో ఉండగా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ 11 సిక్సర్లతో సమానంగా ఉన్నాయి. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా తొమ్మిది సిక్సర్లతో జాబితాలో చివరి స్థానంలో ఉన్నాయి.

44
Image Credit: Getty Images

Image Credit: Getty Images

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు

11 మ్యాచ్‌ల్లో 115 సిక్సర్లు - (2025)
15 మ్యాచ్‌ల్లో 113 సిక్సర్లు - (2017)
15 మ్యాచ్‌ల్లో 92 సిక్సర్లు - (2010)
15 మ్యాచ్‌ల్లో 68 సిక్సర్లు - (2013)
10 మ్యాచ్‌ల్లో 58 సిక్సర్లు - (2001)
15 మ్యాచ్‌ల్లో 57 సిక్సర్లు - (2004)
21 మ్యాచ్‌ల్లో 54 సిక్సర్లు - (2006-07)
16 మ్యాచ్‌ల్లో 48 సిక్సర్లు - (2002-03)
8 మ్యాచ్‌ల్లో 42 సిక్సర్లు - (1998-99)

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
Recommended image2
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?
Recommended image3
RRR vs HEC : ఏంటిది రెడ్డిగారు.. రంగారెడ్డితో అలా చెడుగుడు ఆడేసుకున్నారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved