హైదరాబాద్ టీం రంజీ మ్యాచుల్లో ఈ మధ్య పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇచ్చి చాలా కాలం అయ్యింది. గెలవడం మాటటుంచితే...డ్రా చేసుకుంటే చాలు అనే స్థితికి వచ్చారు అభిమానులు.

కాకపోతే కేరళతో జరుగుతున్న మ్యాచులో హైదరాబాద్ ప్రత్యర్థి కేరళను తొలి ఇన్నింగ్స్ లో 164 పరుగులకే అల్ అవుట్ చేసారు. తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన హైదరాబాద్... వికెట్ కీపర్ సుమంత్ అజేయ సెంచరీతో 228 పరుగులు చేయగలిగింది. 

Also read: ఇండియా వర్సెస్ శ్రీలంక: టి20 ప్రపంచ కప్ బెర్తులే లక్ష్యం...గెలిపించే ఆటతీరే మార్గం

రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కేరళను చాలా తక్కువ స్కోరుకే కట్టడి చేసే విధంగా కనబడుతున్నారు. టీ విరామ సమయానికే కేరళ 5 వికెట్లను కోల్పోయింది. ఆ తరువాత కొద్దిసేపటికే డేంజరస్ గా కనపడుతున్న విష్ణు వినోద్ ను మెహిది హాసన్ అవుట్ చేసాడు. 

కేవలం 100 పైచిలుకు పరుగుల లీడ్ తో మాత్రమే కొనసాగుతుంది కేరళ జట్టు. పిచ్ బౌలింగ్ కి అనుకూలంగా మారుతున్న తరుణంలో హైదెరాబాదీ పేసర్లు గనుక విజృంభించి కేరళ మిగిలిన నాలుగు వికెట్లను ఎంతత్వరగా పడగొడితే...అంత లాభం చేకూరుతుంది హైదరాబాద్ జట్టుకి. 

వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ కొల్ల సుమంత్‌ నిన్న ఓవర్ నైట్ స్కోర్ 91 నాటౌట్‌ వద్ద తన ఇన్నింగ్స్ ను ఆరంభించి, ఈ రోజు హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసేవరకు 111 నాట్ అవుట్ గా నిలిచాడు.

హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ లో కేరళ కన్నా ఎక్కువ పరుగులు సాధించిందంటే అది సుమంత్ చలువే. టీంలో మిగిలిన ఆటగాళ్లంతా ఫెయిల్ అయినా వేళ సుమంత్ ఒక్కడే ధృడంగా నిలబడి జట్టుకు ఒక గౌరవప్రదమైన పోరాడగలిగే స్కోర్ సాధించిపెట్టాడు. 

బ్యాట్‌తో తడబడి, టాప్‌ ఆర్డర్‌ వైఫల్యంతో 90/6తో కష్టాల్లో కూరుకుంది. కెప్టెన్‌ తన్మయ్ అగర్వాల్‌ (2), అక్షిత్‌ రెడ్డి (0), మల్లికార్జున్‌ (12), హిమాలయ అగర్వాల్‌ (4), జావెద్‌ అలీ (6) పేలవ ప్రదర్శన చేశారు.

Also read: రిషబ్ పంత్ ఆఫ్టర్ వర్కౌట్ వీడియో చూసారా...ఒక లుక్కేయండి పొట్టచెక్కలవడం ఖాయం

ఈ తరుణంలో వికెట్‌ కీపర్‌ సుమంత్‌ అజేయ సెంచరీతో ఆదుకున్నాడు. టెయిలెండర్‌ రవితేజ (32), సాయిరామ్‌ (27)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేశాడు. హైదరాబాద్‌కు కీలక తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం అందించాడు.