గౌహతి: ఇటీవల కాలంలో తన ఆటతీరుతో, నిలకడలేమితో, కీపింగ్ లో వరుస వైఫల్యాలు ఇవన్నీ వెరసి భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై అనేక విమర్శలకు దారి తీసింది. తన నైపుణ్యాలను పెంచుకునే పనిలో ఉన్న రిషబ్ పంత్ ఫిట్నెస్ ట్రైనింగ్ లో భాగంగా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్ తో ప్రాక్టీస్ చేస్తున్న ఒక వీడియోను పోస్టు చేసాడు. అది ఒక చిన్న సైజు కామిక్ వీడియో గా ఉంది.

Also read: ఇండియా వర్సెస్ శ్రీలంక: టి20 ప్రపంచ కప్ బెర్తులే లక్ష్యం...గెలిపించే ఆటతీరే మార్గం 

ప్రస్తుతానికి శ్రీలంక తో జరగనున్న తొలి టి 20లో పాల్గొనేందుకు గౌహతిలో ఉన్న రిషబ్ పంత్ అక్కడ జిమ్ లో కోచ్ తో ట్రైనింగ్ చేస్తుండగా తీసిన వీడియోను పోస్టు చేసాడు. ఈ వీడియోకు డ్యూరింగ్ వర్కవుట్ వర్సెస్ ఆఫ్టర్ వర్కవుట్ అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. 

51 సెకండ్ల వీడియోలో దాదాపుగా 30 సెకండ్లపాటు కోచ్ తో పంత్ పంచులు ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఒక్కసారిగా 30 సెకండ్లవడంతోనే నెక్స్ట్ హాఫ్ ప్లే అవుతుంది. భారత స్పిన్నర్ ఏదో కమెడియన్ పంచింగ్ బ్యాగ్ ని కొట్టినట్టు కోచ్ తో పంచులు ప్రాక్టీస్ చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా పంత్, సంజు శాంసన్ లు అక్కడకు వచ్చి కొలచునుకి పట్టుకొని ఫున్నీగా చాహల్ ని కొట్టమని మార్ మార్ అంటూ ఉండడం మనం వీడియోలో స్పష్టంగా వినొచ్చు. 

ఇక ఏ చిన్న అవకాశం దక్కినా ట్రోలింగ్ కి వెనకాడని క్రికెట్ అభిమానులు ఈ వీడియో పోస్టు చేయగానే పంత్ ని ఒక ఆట ఆడేసుకున్నారు. కొందరేమో ఈ ప్రదర్శన ఏదో గ్రౌండ్ లో చేయొచ్చుగా అంటే...మరి కొందరేమో ఇంత వర్కవుట్ చేసేవాడివి గ్రౌండ్ లో కొన్ని పరుగులు చేయొచ్చు కదా అని సెటైర్లు వేశారు.