బీసీసీఐ కాంట్రాక్టుతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఎంత‌ డ‌బ్బును అందుకుంటారు?

BCCI Annual Contract money: బీసీసీఐ వార్షిక సెంట్ర‌ల్ కాంట్రాక్టుల నుండి ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లను ప‌క్క‌నపెట్టింది. టీమిండియా స్టార్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జ‌స్ప్రీత్ బుమ్రా, ర‌వీంద్ర‌ జడేజాలు ఏ+ కేటగిరీలో కొనసాగ‌నున్నారు. 
 

How much money will the players receive with the BCCI Annual Contract?  Team India ViratKohli Rohit RMA

BCCI Annual Contract List: భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండలి  (బీసీసీఐ) రాబోయే సీజ‌న్ల కోసం సెంట్రల్ కాంట్రాక్టుల వివ‌రాలు వెల్ల‌డించింది. 2023-24 సీజన్ అంటే అక్టోబర్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు టీమిండియా (సీనియర్ మెన్) వార్షిక ప్లేయర్ కాంట్రాక్ట్‌లను బీసీసీఐ ప్రకటించింది. ఇందులో ప‌లువురు సినీయ‌ర్ ప్లేయ‌ర్ల‌కు షాక్ ఇచ్చింది. ఇషాన్ కిష‌న్, శ్రేయాస్ అయ్య‌ర్ ల‌తో పాటు అజింక్యా రహానే, ఛతేశ్వర్‌ పుజారా, శిఖ‌ర్ ధావ‌న్, చాహ‌ల్ వంటి ప్లేయ‌ర్ల కాంట్రాక్టుల‌ను ర‌ద్దు చేసింది.

బీసీసీఐ 2023-24 వార్షిక ఆటగాళ్ల రిటైనర్‌షిప్ లోని జాబితాలో గ్రేడ్ ఏ+ లో న‌లుగురు ఆట‌గాళ్లు ఉన్నారు. వారిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా. అలాగే, గ్రేడ్ ఏ (6 అథ్లెట్లు) ర‌విచంద్ర‌న్ అశ్విన్, మ‌హ్మ‌ద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాలు ఉన్నారు. గ్రేడ్ బీ (5 అథ్లెట్లు)లో సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ లు ఉన్నారు. ఇక గ్రేడ్ సీ (15 అథ్లెట్లు) లో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కెఎస్ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పటీదార్ ఉన్నారు.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుతో ఆటగాళ్లు ఎంత డ‌బ్బు అందుకుంటారు..?

గ్రేడ్ ఏ+ లో ఉన్న ఆట‌గాళ్లు సంవత్సరానికి రూ. 7 కోట్లు అందుకుంటారు. అంటే ఈ కేట‌గిరిలో ఉన్న  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఏడాదికి రూ.7 కోట్ల‌ను బీసీసీఐ అందించ‌నుంది. గ్రేడ్ ఏ లో ఉన్న ప్లేయ‌ర్లు  సంవత్సరానికి రూ. 5 కోట్లు అందుకుంటారు. ఈ లిస్టులో ర‌విచంద్ర‌న్ అశ్విన్, మ‌హ్మ‌ద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాలు ఉన్నారు. ఇక గ్రేడ్ బీ ప్లేయ‌ర్లు సంవత్సరానికి రూ. 3 కోట్లు, గ్రేడ్ సీ ఆట‌గాళ్లు  సంవత్సరానికి  ఒక కోటి రూపాయాలు అందుకుంటారు.

అనుకున్న‌దే చేసింది.. స్టార్ ప్లేయ‌ర్లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ..వారి కెరీర్ ఖ‌త‌మేనా !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios