Asianet News TeluguAsianet News Telugu

అనుకున్న‌దే చేసింది.. స్టార్ ప్లేయ‌ర్లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ..వారి కెరీర్ ఖ‌త‌మేనా !

Ishan Kishan and Shreyas Iyer: ఇషాన్ కిష‌న్, శ్రేయాస్ అయ్య‌ర్ ల‌ను ఇదివ‌ర‌కు బీసీసీఐ దేశ‌వాళీ క్రికెట్ ఆడాల్సిందేన‌ని హెచ్చ‌రించింది. అయితే, వీటిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దీంతో మ‌రోసారి దేశాళీ క్రికెట్ ఆడాల్సిందేనంటూ వార్నింగ్ ఇచ్చింది. లేదంటే తోక కట్ చేస్తామని చెప్పింది.

BCCI gave a big shock to star players Ishan Kishan and Shreyas Iyer, terminates contracts, Is their career doomed? RMA
Author
First Published Feb 28, 2024, 7:46 PM IST | Last Updated Feb 28, 2024, 7:46 PM IST

BCCI Annual Contract List: త‌మ ఆదేశాలు పాటించ‌కుండా.. లేక్క‌చేయ‌కుండా ఉంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ హెచ్చ‌రించిన భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండలి  (బీసీసీఐ) ఇప్పుడు దానిని చేత‌ల్లో చూపించింది. స్టార్ ప్లేయ‌ర్ల‌కు షాకిచ్చింది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి వారిని డౌన్ గ్రేడ్ చేసింది. వారే ఇటీవ‌ల త‌మ ప్ర‌వ‌ర్త‌న‌తో వ‌రుస వార్నింగ్ లు అందుకున్న ఇషాన్ కిష‌న్, శ్రేయాస్ అయ్యర్. తాజాగా బీసీసీఐ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ప్రకటించింది. ఇందులో ఇషాన్‌ కిషన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లకు పెద్ద దెబ్బ తగిలింది.

శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌లకు భారీ షాక్ ఇస్తూ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి త‌ప్పించింది. ఇటీవ‌ల ఇద్ద‌రు ప్లేయ‌ర్లు బీసీసీఐతో పాటు టీమిండియా ప్ర‌ధాన కోచ్ సూచ‌న‌ల‌ను ప‌ట్టించుకోలేదు. దేశ‌వాళీ క్రికెట్ లో ఆడాల‌ని ప‌లుమార్లు చెప్పిన పెడ‌చెవిన పెట్టారు. ఈ క్ర‌మంలో బీసీసీఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ జైషా సైతం డైరెక్టుగానే వారికి హెచ్చ‌రిక‌లు పంపారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు వారి త‌మ బీసీసీఐ సెంట్ర‌ల్ కాంట్రాక్టును కోల్పోయారు. వీరితో భార‌త జ‌ట్టులోని సీనియ‌ర్ ప్లేయ‌ర్లు అజింక్యా రహానే, ఛతేశ్వర్‌ పుజారాలు కూడా తమ కాంట్రాక్టుల‌ను కోల్పోయారు.  అంతకుముందు ఒప్పందంలో శ్రేయాస్‌ను బీ కేటగిరీలో, ఇషాన్‌ను సీ కేటగిరీలో ఉన్నారు. దీని ద్వారా వాళ్ల‌కు కోట్ల రూపాయ‌లు అందేవి.

స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీరే.. !

బీసీసీఐ 2023-24 వార్షిక ఆటగాళ్ల రిటైనర్‌షిప్ లోని ప్లేయ‌ర్లు వీరే.. 

గ్రేడ్ ఏ+ (4 అథ్లెట్లు)

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.

గ్రేడ్ ఏ (6 అథ్లెట్లు)

ర‌విచంద్ర‌న్ అశ్విన్, మ‌హ్మ‌ద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా. 

గ్రేడ్ బీ (5 అథ్లెట్లు)

సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.

గ్రేడ్ సీ (15 అథ్లెట్లు)

రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కెఎస్ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పటీదార్.

IPL 2024: చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఇదే చివ‌రి ఐపీఎల్ అవుతుందా?

దీంతో పాటు నిర్దేశిత వ్యవధిలో కనీసం 3 టెస్టులు లేదా 8 వ‌న్డేలు లేదా 10 టీ20లు ఆడాలనే ప్రమాణాలకు అనుగుణంగా ఉండే అథ్లెట్లు స్వయంచాలకంగా ప్రో-రేటా ఆధారంగా గ్రేడ్ సీ లో చేర్చబడతారు. ఉదాహరణకు, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటివరకు 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. వారు ధర్మశాల టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొంటే గ్రేడ్ సీలో చేర్చబడతారు. సెలక్షన్ కమిటీ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్‌లను సిఫార్సు చేసిన వారిలో ఆకాష్ దీప్, విజయ్‌కుమార్ వైషాక్, ఉమ్రాన్ మాలిక్, యశ్ దయాల్, విద్వాత్ కావేరప్పలు ఉన్నారు. ఇదే క్ర‌మంలో మ‌రోసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని సమయాల్లో ప్లేయ‌ర్లందూ దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని బీసీసీఐ స్ప‌ష్టం చేసింది. 

సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు ఎంత డ‌బ్బు అందుకుంటారు..?

గ్రేడ్ ఏ+ - సంవత్సరానికి రూ. 7 కోట్లు

గ్రేడ్ ఏ - సంవత్సరానికి రూ. 5 కోట్లు

గ్రేడ్ బీ - సంవత్సరానికి రూ. 3 కోట్లు

గ్రేడ్ సీ - సంవత్సరానికి రూ. 1 కోటి

ఆశిష్ నెహ్రా నుండి రికీ పాంటింగ్ వరకు.. ఐపీఎల్ కోచ్‌లుగా మారిన టాప్-10 క్రికెట్ దిగ్గజాలు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios