Asianet News TeluguAsianet News Telugu

భార్య న‌టాషాతో విడాకుల వార్తల మధ్య హార్దిక్ పాండ్యా వీడియో వైర‌ల్.. మస్తు ఖతర్నాక్..

Hardik Pandya - Natasa Stankovic : నటాషా స్టాంకోవిచ్‌తో హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకుంటున్నార‌నే వార్త‌లు హాట్ టాపిక్ గా మారాయి. భారీ మొత్తంలో న‌టాషాకు భరణం ఇవ్వ‌నున్నాడ‌ని వార్త‌ల మ‌ధ్య హార్దిక్ పాండ్యా వీడియో ఒకటి వైర‌ల్ గా మారింది.
 

Hardik Pandya's video goes viral amid news of divorce with wife Natasa Stankovic RMA
Author
First Published May 25, 2024, 4:43 PM IST

Hardik Pandya Divorce : ముంబై ఇండియన్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా మ‌రోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. ఇటీవ‌ల ఐపీఎల్ లో ముంబై దారుణ ప్ర‌ద‌ర్శ‌న క్ర‌మంలో కెప్టెన్ గా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న పాండ్యా.. ఇప్పుడు తాను విడాకులు తీసుకుంటున్నార‌నే వార్త‌ల‌తో సోష‌ల్ మీడియాలో మ‌రో ర‌చ్చ‌కు కార‌ణమ‌య్యారు. హార్దిక్ పాండ్యా, త‌న భార్య నటాసా స్టాంకోవిచ్ ఇప్పటికే విడిపోయారనీ, త్వరలో విడాకులు తీసుకోవచ్చని సోషల్ మీడియాలో జోరు చ‌ర్చ సాగుతోంది.

హార్దిక్ 2020లో సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్‌ను వివాహం చేసుకున్నాడు. కొన్ని వార్త సంస్థ‌లు ప్ర‌చురించిన నివేదిక‌లు, సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం... ఇప్ప‌టికే హార్దిక్-న‌టాషాలు దూరం అయ్యార‌నీ, విడాకులు కూడా తీసుకుంటున్నార‌ని పేర్కొంటున్నాయి. విడాకుల తర్వాత హార్దిక్ త‌న ఆస్తిలో  70 శాతం వాటాను న‌టాషాకు భ‌ర‌ణం కింద కోల్పోనున్నాడ‌ని ఆ క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. ఈ వార్త‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

IPL 2024: రాజస్థాన్ రాయ‌ల్స్ ఓటమికి ఈ ఐదుగురే కార‌ణం..

విడాకుల వార్తల మధ్య హార్దిక్ పాండ్యా పాత వీడియో ఒక‌టి వైరల్ అవుతోంది. ఇందులో గౌరవ్ కపూర్‌తో మాట్లాడుతున్న హార్దిక్.. తన తల్లి పేరుతోనే అన్నీ ఆస్తులు చేశానని హార్దిక్ ఈ వీడియోలో చెబుతున్నాడు. హార్దిక్ వీడియోలో.. ''అంతా అమ్మ పేరులోనే ఉంది. కారు నుండి ఇంటి వరకు ప్రతిదీ. నేను దానిని నమ్మను. నా పేరు మీద తీసుకోను. నేను ముందుకు వెళ్లేవారికి 50 శాతం ఇవ్వాలని కోరుకోవడం లేదు. అది నన్ను చాలా బాధపెడుతుందని'' చెప్పాడు. హార్దిక్ త‌న ఆస్తిలో 70 వాటాను భ‌ర‌ణం కింద ఇవ్వ‌నున్నాడ‌నే వార్త‌ల మ‌ధ్య ఈ వీడియో వైర‌ల్ కావ‌డం గ‌మ‌నార్హం. 

 

 

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పేరును తొల‌గించిన నటాషా

నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ నుండి హార్దిక్ పాండ్యా పేరును తొలగించింది. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే దూరంగా ఉన్నార‌నీ, విడాకులు తీసుకుంటున్నార‌ని చ‌ర్చ సాగుతోంది. దీనికి ఇటీవ‌ల వారిద్ద‌రూ ఎలాంటి ఫోటోల‌ను పంచుకోకపోవ‌డంతో పాటు ఐపీఎల్ 2024 సమయంలో నటాషా ఏ మ్యాచ్‌లోనూ హార్దిక్‌కు మద్దతుగా స్టేడియంకు రాలేద‌ని కామెంట్స్ వ‌స్తున్నాయి. ప్రేమికుల రోజు నుండి హార్దిక్ పాండ్యా ఫోటోను నటాషా తన సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. నటాసా పుట్టినరోజు సందర్భంగా కూడా హార్దిక్ ఆమెకు శుభాకాంక్షలు చెప్పలేదు. ఈ కార‌ణాల‌ను చూపుతూ విడాకులు తీసుకుంటున్నార‌ని సోష‌ల్ మీడియాలో ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో హార్దిక్ మ‌ద్ద‌తుగా.. ఇందులో వాస్త‌వం లేద‌నీ, ఇవి కేవ‌లం పుకార్లు మాత్ర‌మేన‌ని మ‌రికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. 

భార్య న‌టాషాతో హార్దిక్ పాండ్యా విడాకులు... ​ భరణం కింద తన ఆస్తుల్లో 70 శాతం వాటా.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios