Asianet News TeluguAsianet News Telugu

భార్య న‌టాషాతో హార్దిక్ పాండ్యా విడాకులు... ​ భరణం కింద తన ఆస్తుల్లో 70 శాతం వాటా.. !

Hardik Pandya - Natasa Stankovic : త‌న భార్య‌ నటాషా స్టాంకోవిచ్‌తో హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకుంటున్నార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇప్పటివ‌ర‌కు ఈ విష‌యంలో అధికారికంగా ఈ జంట స్పందించ‌క‌పోయినా భారీ మొత్తంలో న‌టాషాకు భరణం ఇవ్వ‌నున్నాడ‌ని ప‌లు మీడియా నివేదిక‌లు పేర్కొంటున్నాయి. 
 

Hardik Pandya's divorce with wife Natasa Stankovic, 70 percent share of his assets under alimony RMA
Author
First Published May 25, 2024, 4:17 PM IST

Hardik Pandya Divorce : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దారుణ‌మైన ఫామ్, కెప్టెన్సీ మ‌ధ్య త‌న ఐపీఎల్ 2024ను ముగించాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ముంబై జ‌ట్టు ఈ సీజ‌న్ లో వైదొలిగిన తొలి జ‌ట్టుగా చెత్త రికార్డును న‌మోదుచేసింది. 14 మ్యాచ్‌లలో కేవలం 4 గెలిచి పాయింట్ల పట్టికలో అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. ముంబై మ్యాచ్‌ల సమయంలో పాండ్యాను వ‌రుస‌గా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ముంబై ఫ్రాంఛైజీ తీరుపై అభిమానులు ఘాటు వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ఎందుకంటే రోహిత్ శర్మ నుండి కెప్టెన్సీని తీసుకోవడంతో అభిమానులు ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోయారు.

అయితే, ఐపీఎల్ 2024 లో ముంబై పోరు ముగియ‌డంతో హార్దిక్ పాండ్యా గురించి కాస్త సైలెంట్ కాగానే, మ‌రో అంశంలో సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. ఇవి పాండ్యా వైవాహిక జీవితం గురించి కావ‌డంతో చ‌ర్చ తీవ్రంగా ఉంది. హార్దిక్ పాండ్యా, త‌న భార్య నటాసా స్టాంకోవిచ్ ఇప్పటికే విడిపోయారనీ, త్వరలో విడాకులు తీసుకోవచ్చని సోషల్ మీడియాలో జోరు చ‌ర్చ సాగుతోంది. కొన్ని మీడియా క‌థ‌నాలు కూడా ఉన్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం సెర్బియా మోడల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి పాండ్యా అనే ఇంటిపేరును తీసివేసి, దానిని నటాసా స్టాంకోవిచ్ గా మార్చుకున్నారు. ఇదే స‌మ‌యంలో ఇటీవ‌ల వీరిద్ద‌రూ తమ చిత్రాల‌ను పంచుకోవ‌డం లేదు, మార్చి 4న తన భార్య పుట్టినరోజు సందర్భంగా పాండ్యా తన భార్యకు స్టేటస్‌ను కూడా పోస్ట్ చేయలేదని అంశాను ఎత్తిచూపుతున్నారు. ఇక ఐపీఎల్ ముంబై మ్యాచ్ ల సంద‌ర్భంగా కూడా స్టాంకోవిక్ క‌నిపించ‌క‌పోవ‌డంలో హాట్ టాపిక్ అవుతోంది.

ఐపీఎల్ హిస్ట‌రీలో యుజ్వేంద్ర చాహల్ చెత్త రికార్డు

ఇప్పుడు, పాండ్యా తన భార్య నుండి విడాకులు తీసుకుంటే భరణం కారణంగా అతని ఆస్తులలో 70% కోల్పోవచ్చని సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే, వీరి విడాకుల గురించి ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న‌లు లేవు. కాగా, హార్దిక్ పాండ్య తన స్నేహితురాలైన‌ నటాసా స్టాంకోవిక్ 2018 నుంచి డేటింట్ లో ఉన్నారు. 2020 మేలో ఎంగేజ్‌మెంట్, 2023 లో వివాహం చేసుకున్నారు. తాజాగా వైర‌ల్ అవుతున్న హార్దిక్ పాండ్యా వివాహ బంధం అంశం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

 

 

IPL 2024: రాజస్థాన్ రాయ‌ల్స్ ఓటమికి ఈ ఐదుగురే కార‌ణం.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios