సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో కొందరు వ్యక్తులు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌ను లాగారు. అతని ప్రమేయం లేకుండానే ఆయనపై నకిలీ వీడియోను తయారు చేసి వదిలారు.

Also Read:సీఏఏని వ్యతిరేకిస్తూ నిరసనలు... స్కూటీపై వచ్చి కాల్పులు

వివరాల్లోకి వెళితే.. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఢిల్లీలోని షహీన్ బాగ్‌కు మరో సింహం వచ్చింది.. దాని పేరు ఇర్ఫాన్ పఠాన్’’ అంటూ ఓ 13 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 78 వేల వ్యూస్, 3,100 షేర్లు, 666 లైకులు వచ్చాయి.

అయితే ఇందులో ఇర్ఫాన్ పఠాన్ పక్కన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు మదన్ మిశ్రా కూర్చొన్నారు. దీనిపై అనుమానం వచ్చిన పలువురు పఠాన్ ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాను తనిఖీ చేయగా.. జనవరి 14వ తేదీన ఇర్ఫాన్ ఇదే వీడియోను పోస్ట్ చేయగా.. అదే రోజున మదన్ మిశ్రా ఇందుకు సంబంధించిన ఫోటోను ట్వీట్టర్‌లో షేర్ చేశారు.

Also Read:జామియా షూటింగ్: గన్ ఎక్కడిదంటే, విస్తుపోయే విషయాలు వెల్లడి

ఇర్ఫాన్ వీడియో, మదన్ ఫోటోను జాగ్రత్తగా పరిశీలిస్తే... జనవరి 14న పశ్చిమ బెంగాల్‌లోని కమర్‌హటి డెవలప్‌మెంట్ సోసైటీ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్‌కు పఠాన్ ముఖ్య అతిథిగా హాజరైనప్పటి వీడియో అది. కాగా.. ఢిల్లీ ఎన్నికల్లో ఎలాగైనా కేజ్రీవాల్‌ను ఓడించాలని ప్రయత్నిస్తున్న కొన్ని రాజకీయ శక్తులు ఈ వీడియోను వక్రీకరించినట్లుగా తెలుస్తోంది.