ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు జాగ్రత్తలు చెబుతున్నారు.

ఈ క్రమంలో ఓ బుడ్డొడు తన బుజ్జి బుజ్జి మాటలతో కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు చెప్పాడు. దీనికి ఫిదా అయిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చిన్నారి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Aslo Read:2011 వరల్డ్ కప్ ఫైనల్‌ ఘటన.. అది మాస్టర్ స్కెచ్: సెహ్వాగ్

అంతేకాకుండా ఆ బుడతడు చెప్పే మాటల్ని అంతా శ్రద్ధగా వినాలని విజ్ఞప్తి చేశాడు. ఇది మనందరికీ ఎంతో ముఖ్యమైనదని.. ఆ పిల్లాలు ఎంతో అందంగా కోవిడ్ 19 నియంత్రణ గురించి చెప్పాడని సెహ్వాగ్ వివరించాడు.

కాగా మూడు రోజుల క్రితం 49 మంది క్రీడా ప్రముఖులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా దేశ ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత క్రీడాకారులకు కూడా ఉందని మోడీ సూచించారు.

Aslo Read:మోదీ పిలుపు... వరల్డ్ కప్ కి ఇంకా సమయం ఉందన్న రోహిత్, ట్వీట్ వైరల్

కాగా అంతకుముందు మోడీ పిలుపు మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా వ్యాప్తి నివారణలో భాగమయ్యానని సెహ్వాగ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.