Asianet News TeluguAsianet News Telugu

2011 వరల్డ్ కప్ ఫైనల్‌ ఘటన.. అది మాస్టర్ స్కెచ్: సెహ్వాగ్

 శ్రీలంకతో వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ధోనీ ఫినిషింగ్ షాట్‌గా కొట్టిన సిక్సర్ ఇంకా క్రికెట్ అభిమానుల మనసులో నిలిచిపోయింది. ఆ మ్యాచ్‌కు సంబంధించిన కొన్ని విషయాలను అప్పటి టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిమానులతో పంచుకున్నాడు

Sachin Tendulkar was behind MS Dhoni's batting promotion in 2011 World Cup: virender sehwag
Author
Mumbai, First Published Apr 6, 2020, 5:04 PM IST

983లో తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా రెండోసారి ఈ మెగా ట్రోఫీని ముద్దాడటానికి 28 ఏళ్లు పట్టింది. 2011లో ఎంఎస్ ధోనీ నేతృత్వంలో భారత జట్టు విశ్వవిజేతగా నిలిచింది.

శ్రీలంకతో వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ధోనీ ఫినిషింగ్ షాట్‌గా కొట్టిన సిక్సర్ ఇంకా క్రికెట్ అభిమానుల మనసులో నిలిచిపోయింది.

Also Read:మోదీ పిలుపు... వరల్డ్ కప్ కి ఇంకా సమయం ఉందన్న రోహిత్, ట్వీట్ వైరల్

ఆ మ్యాచ్‌కు సంబంధించిన కొన్ని విషయాలను అప్పటి టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిమానులతో పంచుకున్నాడు. ప్రధానంగా యువరాజ్ సింగ్ కంటే ధోనిని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపడం సంచలనం కలిగించింది.

అయితే అప్పటికి ధోని కంటే యువరాజ్ మంచి ఫామ్‌లో ఉండటంతో ఈ నిర్ణయంపై అభిమానులు, విశ్లేషకులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ నిర్ణయం వెనుక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడని వీరూ తెలిపాడు.

Also Read:మోదీ పిలుపు... దీపాల వెలుగులో విరుష్క జోడి

ఈ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సచిన్ తెలుపగా, అది నిజమేనని సెహ్వాగ్ స్పష్టం చేశాడు. ఆ సమయంలో తాను సచిన్ పక్కనే కూర్చొని ఉన్నానని సెహ్వాగ్, లెఫ్ట్ హ్యాండ్- రైట్ హ్యాండ్ కాంబినేషన్‌లను కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే ఈ విషయాన్నిన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ దృష్టికి తీసుకెళ్లాడని వీరేంద్రుడు చెప్పాడు.

దానికి గ్యారీ కూడా ఒప్పుకోవడంతో ధోని బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి వచ్చాడని సెహ్వాగ్ తెలిపాడు. వెంటనే ఈ విషయాన్ని ధోనికి చెప్పగా, డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి సిద్ధమయ్యాడని నాటి సంగతులను వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios