కరోనా వైరస్‌పై పోరు నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు యావత్ దేశం ఒక్కటైంది. జాతి సమైక్యతను చాటుతూ సరిగ్గా రాత్రి 9 గంటల నుంచి 9.09 నిమిషాల వరకు దేశ ప్రజలు ఇళ్లలో లైట్లు ఆపేసి కొవ్వొత్తులు, దీపాలు, టార్చి లైట్లు వెలిగించారు.గో కరోనా.. గో కరోనా అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు సైతం పాల్గొన్నారు.

Also Read మోదీ పిలుపు... దీపాల వెలుగులో విరుష్క జోడి...

కాగా.. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దీనికి మద్దతు తెలిపారు. కరోనా వైరస్ ప్రభావాన్ని క్రికెట్ తో పోల్చి మరీ అభిమానులకు రోహిత్ సందేశం ఇవ్వడం గమనార్హం. క‌రోనాపై పోరాటాన్ని మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డంతో పోల్చిన రోహిత్‌.. ఈ పోరాటంలో అంద‌రూ క‌లిసి రావాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని సూచించాడు. ద గ్రేట్ టీమిండియా హ‌డిల్‌కు సంఘీభావం తెల‌పాల‌ని రోహిత్ తెలిపాడు.

 

ఇదిలా ఉండగా...  తన భార్య రితిక తో కలిసి దీపాలు వెలగించిన రోహిత్ శర్మ... అభిమానులను ఉద్దేశించి మరో ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కూడా ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

‘‘అందరూ ఇళ్లల్లోనే ఉండండి. బయటకు వెళ్లి సంబరాలు చేసుకోకండి.. వరల్డ్ కప్ ఇంకా సమయం ఉంది’’ అంటూ ట్వీట్ చేశాడు. దీపాలు వెలిగించమన్నారు కదా అని జనాలు వాటిని పట్టుకొని బయటకు పరుగులు తీస్తారేమో అనే ఉద్దేశంతో రోహిత్ ముందు చూపుగా చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది.