Yashasvi Jaiswal: 22 ఏళ్ల యశస్వి జైస్వాల్ టెస్టుల్లో బ్యాక్ టు బ్యాక్ డబుల్ సెంచరీలు సాధించిన మూడో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అలాగే, ఇంగ్లాండ్ పై టెస్టుల్లో రెండు 200+ స్కోర్లు సాధించిన మొదటి ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు.
Yashasvi Jaiswal: రాజ్ కోట్ వేదికగా జరిగిన భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ 319 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ 153 పరుగులతో జట్టులో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరఫున బుమ్రా అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. 126 పరుగుల ఆధిక్యంతో 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 3వ రోజు ఆట సమయం ముగిసే సమయానికి తన 2వ ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 196 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ 65 పరుగులతో, కుల్దీప్ 3 పరుగులతో ఫీల్డింగ్‌లో ఉన్నారు.
ఇక నాల్గో రోజు అద్భుతం జరిగింది. తిరుగులేని రికార్డుతో సూపర్ ఇన్నింగ్స్ ను ఆడింది. సెంచరీ చేస్తాడని భావించిన గిల్ అనూహ్యంగా 91 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత రిటైర్డ్ హర్ట్ అవుటైన జైస్వాల్ రంగంలోకి దిగాడు. మరోవైపు కుల్దీప్ యాదవ్ 27 పరుగుల వద్ద ఔటయ్యాడు. తర్వాత జైస్వాల్ సర్బరాజ్ ఖాన్‌తో జతకట్టారు. ఇద్దరూ నిలకడగా ఉండి పరుగుల వరద పారించాడు. జైస్వాల్ ఇంగ్లాండ్ పై తన విశ్వరూపం చూపించాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ తను ఉతికిపారేశాడు. అద్భుతమైన షాట్స్ కొడుతూ డబుల్ సెంచరీ కొట్టాడు. జైస్వాల్ 231 బంతుల్లో (14 ఫోర్లు, 10 సిక్సర్లు) డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో భారత జట్టు 98 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 445 పరుగులు చేసి 556 పరుగుల ఆధిక్యంలో ఉండగా డిక్లేర్ చేసింది.
India vs England : టీమిండియా గెలుపులో ఆరుగురు హీరోలు.. !
ఆ తర్వాత భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 122 పరుగులకే ఆలౌట్ అయింది. 400లకు పైగా పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇందులో యంగ్ ప్లేయర్ జైస్వాల్ కీలక పాత్ర పోషించాడు. డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ ఉంచి భయపెట్టాడు. జైస్వాల్ తన ధనాధన్ ఇన్నింగ్స్, అద్భుతమైన షాట్స్ తో భారత మాజీ ప్లేయర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను గుర్తుచేశాడు. ఇంగ్లాండ్ పై వరుస డబుల్ సెంచరీలతో చరిత్ర సృష్టించాడు. టీమిండియాకు మరో న్యూ వెర్షన్ సెహ్వాగ్ లా కనిపించాడు. ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ సైతం ఇదే విషయాన్నిచెబుతూ జైస్వాల్ పై ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లాండ్ పై రెండు డబుల్ సెంచరీలు సాధించిన జైస్వాల్ పై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ ప్రశంసలు కురిపించాడు. తన ఎక్స్ పోస్టులో భారత్‌కు కొత్త సెహ్వాగ్ దొరికాడనీ, సెహ్వాగ్ మాదిరిగానే జైస్వాల్ కూడా అన్ని ఫార్మాట్లలో స్మాష్ హిట్టర్ గా నిలిచాడని ప్రశంసించాడు.
ఫ్యామిలీ ఎమర్జెన్సీ.. ఆ 48 గంటల్లో చాలా జరిగాయి.. అశ్విన్ భార్య ప్రీతి ఎమోషనల్ పోస్టు.. !
జడ్డూ భాయ్ భార్యకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు.. ! ఎమోషనల్ కామెంట్స్ !
