ఫ్యామిలీ ఎమర్జెన్సీ.. ఆ 48 గంటల్లో చాలా జరిగాయి.. అశ్విన్ భార్య ప్రీతి ఎమోషనల్ పోస్టు.. !
Ravichandran Ashwin's wife Prithi : టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి నారాయణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అశ్విన్ 500 టెస్ట్ వికెట్లు సాధించిన అద్భుతమైన మైలురాయిపై స్పందించారు. 500 వికెట్ తీసుకోవడానికి ముందు, ఆ తర్వాత ఫ్యామిలీ ఎమర్జెన్సీ వరకు 48 గంటల ప్రయాణం గురించి భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను పంచుకున్నారు.
Ashwin's wife Prithi Narayan's emotional post: భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్ లో చరిత్ర సృష్టించారు. రాజ్ కోట్ టెస్టులో ఒక వికెట్ తీసుకోవడంతో టెస్టు క్రికెట్ లో 500 వికెట్లు తీసుకున్న బౌలర్ గా రికార్డు నెలకోల్పాడు. ఈ ఘనత సాధించిన భారత రెండో బౌలర్ గానూ.. అంతర్జాతీయ క్రికెట్ లో 9వ ప్లేయర్ నిలిచాడు. అలాగే, టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 500 వికెట్లు తీసిన రెండో బౌలర్ గానూ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో సంచలన బౌలర్ గా ముందుకు సాగుతూ.. టెస్టు క్రికెట్ లో 500 వికెట్లు తీసిన అశ్విన్ ప్రయాణం గురించి ప్రస్తావిస్తూ ఆయన భార్య ప్రీతి నారాయణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లో భావోద్వేగ పోస్టు చేశారు.
ఆ పోస్టులో అశ్విన్ 500 వికెట్ తీసుకోవడం నుంచి 501 వికెట్ వరకు, అలాగే, అతని ఫ్యామిలీ ఎమర్జెన్సీ గురించిన వివరాలను ప్రీతి పంచుకున్నారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి రాజ్‌కోట్ టెస్టు తర్వాత అతని 500-501వ టెస్ట్ వికెట్ మధ్య సుదీర్ఘమైన 48 గంటల సమయం గడిపానని చెబుతూ భావోద్వేగా పోస్టును పంచుకున్నారు. టెస్టుల్లో తన 500వ వికెట్‌ను తీసుకున్న తర్వాత, అశ్విన్ కుటుంబ అత్యవసర పరిస్థితికి హాజరయ్యేందుకు రాజ్‌కోట్ టెస్టు నుంచి మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది. అశ్విన్ 3వ రోజు అందుబాటులో ఉండడని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
India vs England : టీమిండియా గెలుపులో ఆరుగురు హీరోలు.. !
మూడవ సెషన్ ప్రారంభంలో అశ్విన్ తిరిగి మైదానంలోకి వచ్చాడు, ఇంగ్లండ్ 557 పరుగుల ఛేజింగ్‌లో 18/2తో ఉంది. 4వ రోజు భారత్‌కు సానుకూల వార్తలతో ప్రారంభమైంది. అశ్విన్ తిరిగి జట్టులోకి వస్తున్నాడని బీసీసీఐ చెప్పింది. ఒక రోజంతా మైదానం వెలుపల గడిపినప్పటికీ అశ్విన్ జట్టులోకి వచ్చిన వెంటనే బౌలింగ్ చేయడానికి అందుబాటులో ఉన్నాడు. ఈ ఇన్నింగ్స్ లో ఆరు ఓవర్లలో ఒక వికెట్ తీసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
అశ్విన్ భార్య ప్రీతి ఇన్‌స్టాగ్రామ్‌లో.. అశ్విన్ గురించి ప్రస్తావిస్తూ 500 వికెట్లు తీయడం గురించి, ఈ సమయంలో వారు గడిపిన క్షణాలను గురించి ప్రస్తావించారు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన టెస్టులోనే అశ్విన్ 500 వికెట్ తీస్తాడని అనుకున్నామనీ, అక్కడ సాధ్యం కాలేదు. అయితే, వైజాగ్ లో జరిగిన రెండో టెస్టులో దీనిని సాధిస్తాడని అనుకున్నామని చెప్పారు. అయితే, ఇక్కడ కూడా అది సాధ్యం కాకపవడంతో 499వ వికెట్ సమయంలో తెచ్చిన స్వీట్లను అందరికీ పంచిపెట్టినట్టు ప్రీతి చెప్పారు. టెస్టు క్రికెట్ లో 500 వికెట్లు తీయడం ఎంతో గొప్ప విషయమనీ, అశ్విన్ గొప్ప వ్యక్తి, అతన్ని చూసి చాలా గర్వంగా ఉందని ప్రితీ తెలిపారు. చూస్తుండగానే 500వ వికెట్ వచ్చింది అయితే, 500 నుంచి 501 మద్య సుదీర్ఘమైన 48 గంటల సమయంలో చాలా జరిగాయని తెలిపారు.
జడ్డూ భాయ్ భార్యకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు.. ! ఎమోషనల్ కామెంట్స్ !
అశ్విన్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ పై రోహిత్ శర్మ స్పందిస్తూ.. ఒక టెస్ట్ మ్యాచ్ మధ్యలో అత్యంత అనుభవజ్ఞుడైన బౌలర్‌ను కోల్పోవడం అంత తేలికైన విషయం కాదనీ, కానీ, అలాంటి సమయంలో కుటుంబం ముందు వరుసలో ఉంటుందని చెప్పాడు. అందుకే అశ్విన్ నిర్ణయం పట్ల తమకు ఇంకో ఆలోచన లేదని తెలిపాడు. "అతను కుటుంబంతో ఉండాలని కోరుకున్నాడు, ఇది ఖచ్చితంగా సరైన పని. ఇది అతనికి మంచిది.." అని తెలిపాడు.
పిల్లలు బరువు పెరగడం లేదా..? ఈ ఫుడ్స్ పెట్టండి..!
- Ashwin emotional post
- Ashwin wife
- ENG
- Family Emergency
- IND
- IND vs ENG
- IND vs ENG Test Records
- India vs England
- India vs England Cricket
- India vs England Match
- India vs England Test Series
- India-England Test Cricket
- Jaddu
- Jadeja
- Jaiswal century
- Kuldeep Yadav
- Prithi Narayanan
- Ravichandran Ashwin
- Ravindra Jadeja
- Ravindra Jadeja All-Round Show
- Ravindra Jadeja Super Show
- Rohit Sharma
- Rohit Sharma Game Plan
- Sarfaraz Khan
- Shubman Gill
- Six heroes in India's victory in Rajkot Test
- Yashasvi Jaiswal
- rajkot