India vs England : టీమిండియా గెలుపులో ఆరుగురు హీరోలు.. !
India vs England : రాజ్‌కోట్ టెస్టులో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేయగా, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు సెంచరీలు కొట్టారు. అలాగే, శుభ్ మన్ గిల్ 9 పరుగుల దూరంలో సెంచరీ కోల్పోగా, సర్ఫరాజ్ ఖాన్ రెండో ఇన్నింగ్స్ లలో అద్భుతమైన ఆటతో అదరగొట్టాడు.
Ravindra Jadeja, Rohit Sharma, Yashasvi Jaiswal
India vs England : భారత్ vs ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా చరిత్ర సృష్టిస్తూ ఘన విజయం సాధించింది. మూడో టెస్టులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 434 పరుగుల తేడాతో బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లిష్ జట్టును చిత్తుచేసింది. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. రాజ్‌కోట్ టెస్టులో భారత్‌ను గెలిపించడంలో ప్రతిఒక్క ప్లేయర్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. ముఖ్యంగా ఐదుగురు ప్లేయర్ల ప్రదర్శన ఇంగ్లాండ్ ను ఓడించడంలో కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాప్-5 హీరోలను గమనిస్తే..
1. రవీంద్ర జడేజా
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రాజ్ కోట్ టెస్టులో భారత్ పై చేయి సాధించడంలో చేసిన కృషి చాలా గొప్పది. బ్యాట్, బాల్ తో ఇంగ్లాండ్ ను దెబ్బతీసి భారత్ విజయంలో ముఖ్యమైన కీరోల్ పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా మొత్తం 5 వికెట్లు తీసి, నాలుగో రోజే మ్యాచ్ ఫలితం వచ్చేలా చేశాడు. ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫాక్స్, మార్క్ వుడ్‌లను జడేజా తన బౌలింగ్ తో బోల్తా కొట్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 2 వికెట్లు తీశాడు. జడేజా కూడా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో సెంచరీ కొట్టాడు. మొత్తం ఏడు వికెట్లు తీసుకోవడంతో పాటు సెంచరీ కూడా బాదాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
2. యశస్వి జైస్వాల్
మూడో టెస్టులో టీమిండియా హీరోల జాబితాలో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ పేరు మొదటి స్థానంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ పెద్దగా రాణించలేకపోయినా.. రెండో ఇన్నింగ్స్‌లో తన బ్యాట్ పవర్ ను చూపించాడు. ధనాధన్ ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఉతికిపారేశాడు. ఈ సిరీస్ లో రెండో డబుల్ సెంచరీ కొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో 236 బంతుల్లో 214 పరుగులు చేశాడు. భారత్ భారీ అధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
Rohit Sharma, Siraj
3. రోహిత్ శర్మ
భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టాడు. ప్రారంభంలోనే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయిన క్రమంలో రవీంద్ర జడేజాతో కలిసి భారత ఇన్నింగ్స్ ను సరిదిద్దాడు. అలాగే, అద్భుతమైన గేమ్ ప్లాన్ తో ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టాడు.
Shubman Gill
4. శుభ్‌మన్ గిల్
మూడో టెస్టులో భారత్‌కు విజయాన్ని అందించడంలో శుభ్‌మన్ గిల్ కూడా చాలా కృషి చేశాడు.రాజ్‌కోట్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గిల్ 91 పరుగులు చేశాడు. 151 బంతుల్లో 91 పరుగులు చేసి సెంచరీకి 9 పరుగుల దూరంలో ఔటయ్యాడు. తన ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ ఉంచడంలో గిల్ ఇన్నింగ్స్ కీలకంగా మారింది.
Sarfaraz Khan
5. సర్ఫరాజ్ ఖాన్
భారత్-ఇంగ్లాండ్ మూటో టెస్టు ద్వారా సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. రెండు ఇన్నింగ్స్ లలో అద్భుతమైన ఆటతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ కొట్టాడు. అతని ఆట చూస్తుంటే సెంచరీ కొట్టేలా కనిపించాడు కానీ, అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో కూడా హాఫ్ సెంచరీ కొట్టాడు. అరంటేగ్రం మ్యాచ్ లోనే రెండు ఇన్నింగ్స్ లలో హాష్ సెంచరీలు సాధించాడు.
kuldeep yadav
6. కుల్దీప్ యాదవ్
భారత్ తరఫున తొలి, రెండో ఇన్నింగ్స్‌లో 2,2 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు . తొలి ఇన్నింగ్స్‌లో జానీ, బెన్‌లను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కుల్దీప్ రెండు వికెట్లు తీశాడు. అలాగే, బ్యాటింగ్ లో కూడా రాణించాడు.