చిన్న తప్పుకు నరకం అనుభవించా: డోపింగ్ టెస్టులో పట్టుబడటంపై పృథ్వీషా ఆవేదన
రంజీల్లో సత్తా చాటి అత్యంత చిన్న వయసులోనే టీమిండియా జెర్సీ ధరించే అవకాశం కలిగింది. రికార్డులు బద్ధలు కొడుతూ ముందుకు సాగతున్న పృథ్వీషా గతేడాది జరిగిన డోపింగ్ టెస్టులో విఫలమై ఎనిమిది నెలల నిషేధం ఎదుర్కొన్నాడు
రంజీల్లో సత్తా చాటి అత్యంత చిన్న వయసులోనే టీమిండియా జెర్సీ ధరించే అవకాశం కలిగింది. రికార్డులు బద్ధలు కొడుతూ ముందుకు సాగతున్న పృథ్వీషా గతేడాది జరిగిన డోపింగ్ టెస్టులో విఫలమై ఎనిమిది నెలల నిషేధం ఎదుర్కొన్నాడు.
ఈ సమయంలో తాను నరకం అనుభవించానని చెప్పాడు పృథ్వీషా. ఓ చిన్న పొరపాటుకు డోపింగ్ టెస్టులో పట్టుబడటంతో పాటు కొందరు చేసిన విమర్శలు ఇంకా బాధించాయని ష ఆవేదన వ్యక్తం చేశాడు.
క్లిష్ట పరిస్ధితులను ఓర్పుగా భరించానని, ఆ విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలనుకున్నానని షా తెలిపాడు. తాను డోపింగ్ టెస్టులై విఫలమై క్రికెట్‌కు దూరమైన సమయంలో ఒక విషయం మాత్రం తనకు బాగా అర్థమైందని అతను చెప్పాడు.
Also Read:వాళ్ల వీడియోకి రవిశాస్త్రి ట్రేసర్ బులెట్ ఆడియో.. నెట్టింట వైరల్
తాను వంద శాతం ప్రజల్ని సంతృప్తి పరచలేనని తెలిసిందన్నా పృథ్వీ షా... తాను ఇంటి దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితుల్లో ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నానని అన్నాడు. తన కెరీర్‌లో అండర్ 19 వరల్డ్ కప్ ఒక మరచిపోలేని జ్ఞాపకమైతే, అరంగేట్రం టెస్టులోనే సెంచరీ చేయడం అద్భుతమైన జ్ఞాపకమన్నాడు.
ఇక డోపింగ్ కంట్రోల్ అనేది తన చేతుల్లోనే ఉంటుందని.. గాయాలు అనేవి మన చేతుల్లో ఉండవని పృథ్వీ షా స్పష్టం చేశాడు. విమర్శలు జీవితంలో ఒక భాగమేనని, విమర్శలు చేసేటప్పుడు అది మంచి విమర్శగా ఉండాలని షా తెలిపాడు.
అది మనకు ఉపయోగపడాలని.. నిజంగా 2019 సంవత్సరం తనకు చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిపోయిందని పృథ్వీ షా చెప్పాడు. ప్రతి విమర్శను మనం డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదని, సమయం వచ్చినప్పుడు బ్యాట్‌తోనే వాటికి సమాధానం చెబుతానని షా తేల్చి చెప్పాడు.
గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో ముంబై తరపున ఆడిన పృథ్వీ షా తీవ్ర జలుబు, దగ్గుతో బాధపడ్డాడు. దాని నుంచి కోలుకోవడం కోసం దగ్గుమందు వాడాడు.
Also Read:కరోనా సహాయనిధి కోసం భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలంటున్న షోయబ్ అక్తర్
ఆ తర్వాత ఆసీస్ టూర్‌లో అయిన కాలిన గాయం నుంచి త్వరగా కోలుకోవాలనే ఆతృతలో కనీస జాగ్రత్తలు పాటించకుండా కాఫ్ సిరప్ విషయంలో ప్రోటోకాల్ పాటించలేదు. బీసీసీఐ డాక్టర్‌ను కాని, వేరే డాక్టర్‌ను కానీ సంప్రదించాల్సి ఉండాల్సిందని షా గుర్తు చేసుకున్నాడు.
తొందర్లో చిన్న మెడిసినే కదా అని ఆ సిరప్ వాడాడు. అది నిషేధిత మెడిసిన్ అనే విషయం తనకు తెలియదని దాంతో ఇబ్బందుల్లో పడ్డానని పృథ్వీషా గుర్తు చేసుకొచ్చాడు. తెలియక చేసిన తప్పుకు నరకం అనుభవించానని షా నాటి రోజులను గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశాడు.