కరోనా వైరస్ ని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. కొందరు ఆకతాయిలు లాక్ డౌన్ ఉల్లంఘించి బయట తిరగడం లాంటివి చేస్తున్నారు. అలాంటి వారిని పట్టుకునేందుకు కేరళ ప్రభుత్వం ఓ వినూత్న ప్రయోగం చేపట్టింది. డ్రోన్ కెమేరాలతో లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిని పట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read మోనోపోలీ, తన హృదయ విజేతను ప్రకటించిన అనుష్క...

డ్రోన్‌ కెమెరాలతో వారిపై నిఘా ఉంచి లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇలా పలు చోట్ల చిత్రీకరించిన వీడియోలను ఎడిట్‌ చేసి సోషల్‌  మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనికి గతంలో ప్రస్తుత టీమిండియా కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి కామెంటరీ చెబుతున్నసమయంలో ట్రేసర్‌ బుల్లెట్‌ పదాన్ని ప్రయోగించిన ఆడియోను జత చేశారు.

 

కాగా.. ప్రస్తుతం ఆ వీడియో, రవిశాస్త్రి బులెట్ ఆడియో వైరల్ అయ్యాయి. రవిశాస్త్రి గతంలో కామెంటేటర్‌గా  ఉండగా ఒక షాట్‌కు ట్రేసర్‌ బుల్లెట్‌ పదాన్ని ఉపయోగించేవాడు.  పలు మార్లు తన సహచర కామెంటేటర్లకు సైతం దానిని ఛాలెంజ్ గా విసిరాడు. దానికి హుందాగా స్వీకరించిన సునీల్‌ గావస్కర్‌, సంజయ్‌ మంజ్రేకర్‌ తదితరులు తమ వ్యాఖ్యానంలో ట్రేసర్‌ బుల్లెట్‌ పదాన్ని ఉపయోగించారు.

దీన్ని ఇప్పుడు కేరళ పోలీసులు ఉపయోగించుకున్నారు.  లాక్‌డౌన్‌ను నిబంధనల్ని ఉల్లంఘించిన వారిని చెదరగొట్టే క్రమంలో తీసిన డ్రోన్‌ కెమెరా వీడియోకు రవిశాస్త్రి ట్రేసర్‌ బుల్లెట్‌ కామెంటరీని జోడించి ట్వీటర్‌లో పెట్టారు. ఈ  వీడియో నవ్వులు పూయిస్తుండటంతో పోస్ట్‌ చేసిన కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారింది. రవిశాస్త్రి కామెంటరీలో ఎంత వేగం ఉంటుందో అంతే వేగంగా ఇది వైరల్‌ అయ్యింది.