కరోనా వైరస్ ధాటికి ప్రపంచం అంతా స్తంభించిపోయింది. దాదాపు అన్ని దేశాల్లోనూ లాక్ డౌన్ తరహా పరిస్థితులుండడంతో ఉత్పత్తి ఆగిపోయి, ప్రభుత్వాలకు రాబడి ఆగిపోయింది. అభివృద్ధి చెందిన దేశాలు ఒకింత ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండనప్పటికీ... అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రం పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా నే ఉన్నాయి. 

ఈ కరోనా వైరస్ ఇంతలా విలుయతాండవం చేస్తూ, దేశాలన్నింటినీ స్థంభించిపోయేలా చేసిన తరుణంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్ష్ప్రెస్స్ షోయబ్ అక్తర్ భారత్, పాకిస్తాన్ ల మధ్య కరోనా సహాయానిధికోసం మూడు మ్యాచుల సిరీస్ ఆడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. 

ఈ మ్యాచుల్లో ఎవరు గెలిచారు అనేదానిపై ఇరు దేశాల ప్రజలు పట్టించుకోరని, వచ్చిన డబ్బును భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలు చెరిసగం తీసుకుంటాయని అక్తర్ అభిప్రాయపడ్డాడు. 

భారత్ 2007 నుంచి పాకిస్తాన్ తో ఒక్క పూర్తి సిరీస్ ని కూడా ఆడలేదు. కేవలం, ఐసీసీ ఈవెంట్లయిన వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియ కప్ లలో మాత్రమే తలపడుతుంది. తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ తో క్రికెట్ సంబంధాలను కొనసాగించదలుచుకోలేదు. 

ప్రపంచం అంతా లాక్ డౌన్ లో ఉండడం, ఎటువంటి క్రికెట్ మ్యాచులు కూడా లేకపోవడంతో ఈ సమయంలో గనుక మ్యాచులు నిర్వహిస్తే భారత్, పాక్ అభిమానులతోపాటు క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచులను వీక్షిస్తారని షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. 

ఎక్కడైనా ఏదైనా షార్జా లాంటి తటస్థ విదేశీ వేదికలపై మ్యాచులు ఆడుదామని అన్నాడు. కాకపోతే... ఈ లాక్ డౌన్ సమయంలో అంత భారీ స్థాయిలో ఏర్పాట్లు ఎలా చేయగలుగుత్ర్హమనే విషయాన్నీ మాత్రం షోయబ్ అక్తర్ మాత్రం చెప్పలేదు. 

ఈ ప్రస్థులంతా తరుణంలో మ్యాచ్ నిర్వహించాలంటే సాధ్యమయ్యే పని కాదు. అన్ని దేశాలు దాదాపుగా బార్దార్లను మూసివేశాయి. విదేశీ సంబంధాలను కొనసాగించడం లేదు. ఇలాంటి తరుణంలో ప్లేయర్లను అందునా వారి ప్రాణాలను రిస్కుతో పెట్టి మ్యాచ్ ఆడించడం అనేది చాలా కష్టమైన పనిలా కనబడుతుంది.