టీమిండియా వైస్ కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు సురేశ్ రైనా. మాజీ కెప్టెన్ ధోని తర్వాత అంతటి నాయకత్వ లక్షణాలను తాను హిట్‌మ్యాన్‌లో చూశానని చెప్పాడు
టీమిండియా వైస్ కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు సురేశ్ రైనా. మాజీ కెప్టెన్ ధోని తర్వాత అంతటి నాయకత్వ లక్షణాలను తాను హిట్‌మ్యాన్‌లో చూశానని చెప్పాడు.
కెప్టెన్‌గా ఉన్నప్పటికీ ప్రతి ఆటగాడి సూచనలు, సలహాలకు రోహిత్ విలువనిస్తూ.. అందరినీ గౌరవిస్తాడని రైనా కొనియాడాడు. తన కెప్టెన్సీలో ఆడటం తనకు ఎల్లప్పుడూ సంతోషాన్నిస్తుందని చెప్పాడు.
Also Read:ఆగష్టు1న సమావేశం, అధికారికంగా ఐపీఎల్ షెడ్యూల్ ఖరారు..!
సూపర్ ఓవర్ పోడ్‌కాస్ట్ తాజా ఎపిసోడ్‌లో భాగంగా దక్షిణాఫ్రికా క్రికెటర్ జేపీ డుమినితో మాట్లాడిన సురేశ్ రైనా తన కెరీర్‌లోని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. రోహిత్ చాలా సైలంట్‌గా ఉంటాడని, ఎదుటివాళ్లు చెప్పేది ఓపికగా వింటాడని రైనా ప్రశంసించాడు.
తోటి క్రికెటర్లలో ఆత్మవిశ్వాసం నింపుతాడని.. కెప్టెన్‌గా ఉంటూనే డ్రెస్సింగ్ రూమ్‌లో అందరినీ గౌరవిస్తాడని చెప్పాడు. రోహిత్ కెప్టెన్సీలో తాను ఆసియా కప్ ఆడానని.. ఆ సమయంలో అతనిని మరింత దగ్గరగా గమనించానని రైనా గుర్తుచేసుకున్నాడు.
Also Read:కరోనా క్రికెట్: ఫ్యాన్స్ ఖుష్, కానీ ఆటగాళ్లే కెరీర్ కి గుడ్ బై చెప్పేలా ఉన్నారు!
శార్దూల్, వాషింగ్టన్ సుందర్ లాంటి యువ ఆటగాళ్లను హిట్ మ్యాన్ ప్రోత్సహించిన తీరు అమోఘమన్నాడు. ధోనీలాగే రోహిత్ కూడా ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటాడని.. అతనిలాగే ఐపీఎల్‌లో ముంబైకి టైటిళ్లు గెలిపించాడని రైనా అన్నాడు.
కెప్టెన్లుగా వాళ్లిద్దరిలో ఎన్నో పోలికలను చూశానని.. అందుకే తన పుస్తకంలో వారిద్దరిని అద్భుతమైన వ్యక్తులుగా అభివర్ణించానని రైనా చెప్పుకొచ్చాడు. కాగా ధోనీ కెప్టెన్సీలో టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ తరపున సురేశ్ ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. అలాగే రోహిత్ కెప్టెన్సీలో నిదహాస్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
