బుమ్రా vs కాన్‌స్టాస్: సిడ్నీలో మాటల యుద్ధం.. బుమ్రా దెబ్బకు ఎగిరిపడ్డ వికెట్

IND vs AUS 2024-25: సిడ్నీ టెస్ట్ మొదటి రోజు ఆఖరి సెషన్‌లో జస్ప్రీత్ బుమ్రా, సామ్ కాన్‌స్టాస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇది మ్యాచ్ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.

 

Bumrah Konstas Clash Sydney Test Day 1 Heated Exchange Video RMA

జస్ప్రీత్ బుమ్రా vs సామ్ కాన్‌స్టాస్: భారత్, ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను ఆడుతన్నాయి. సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి, ఐదో మ్యాచ్ లో తొలి రోజు అద్భుతమైన సినిమా తరహా ఘటనలు జరిగాయి. రెండు జట్ల ఆటగాళ్ల ఆగ్రెషన్ మైదానంలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియన్ మీడియా గురించి ఇప్పుడు మర్చిపోయేలా.. బుమ్రా గ్రౌండ్ లో హీట్ ను పెంచాడు.  ఐదో టెస్ట్‌లో జస్ప్రీత్ బుమ్రా, సామ్ కాన్‌స్టాస్ మధ్య కొత్త పోటీ ఆసక్తిని పెంచింది. బ్యాట్, బాల్‌తో పాటు మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది.

మెల్‌బోర్న్ టెస్ట్ నుంచే ఇది మొదలైంది. అక్కడ 19 ఏళ్ల ఆసీస్ బ్యాట్స్‌మన్ బుమ్రా 2 ఓవర్లలో 32 పరుగులు చేశాడు. ఆ తర్వాత బుమ్రా కూడా తన బౌలింగ్ తో ఆసీస్ కు సమాధానమిచ్చాడు. ఇప్పుడు సిడ్నీ టెస్ట్ మొదటి రోజు ఆఖరి ఓవర్‌లో మైదానంలో అద్భుతమైన డ్రామా జరిగింది. బుమ్రా బౌలింగ్‌కి సిద్ధమవుతుంటే ఉస్మాన్ ఖవాజా ఆపమన్నాడు. అయితే, అప్పటికే బాత్ లో పరుగెత్తడానికి సిద్ధంగా ఉన్న బుమ్రాను ఖవాజా ఆపమనడంతో పేసర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నాన్ స్ట్రైక్‌లో ఉన్న కాన్‌స్టాస్ బుమ్రాను అటపట్టించే ప్రయత్నం చేశాడు. కానీ, బుమ్రా వెనక్కి తగ్గలేదు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

 

 

తనను గెలికినందుకు ఆసీస్ కు గట్టిగానే ఇచ్చిపడేసిన బుమ్రా

 

కాన్‌స్టాస్ బుమ్రాను చికాకు పెట్టేసరికి బుమ్రా కోపం కట్టలు తెంచుకుంది. ఇద్దరి మధ్య వాదన మొదలైంది. అంపైర్ జోక్యం చేసుకుని వివాదం సద్దుమణిగేలా చేశాడు. కాన్‌స్టాస్ కూడా కోపంగా కనిపించాడు. బుమ్రాను రెచ్చగొట్టడం వల్ల వచ్చిన ఫలితం తర్వాతి బంతిలోనే కనిపించింది. రౌండ్ ది వికెట్ నుంచి అద్భుతమైన లైన్‌లో బంతి వేసి బుమ్రా ఖవాజాను క్యాచ్  రూపంలో ఔట్ చేశాడు.

మొదటి రోజుతో పాటు ఖవాజా మొదటి ఇన్నింగ్స్ కూడా ముగిసింది. ఆసీస్ యంగ్ ప్లేయర్ బుమ్రాతో పెట్టుకోవడం ఆ జట్టుకు పెద్ద నష్టాన్నే కలిగించింది. వికెట్ పడిపోయాక టీమ్ ఇండియా ఆటగాళ్లంతా కాన్‌స్టాస్ లాగే పరుగెత్తుకుంటూ వెళ్లి సంబరాలు చేసుకున్నారు. అభిమానులు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. Xలో ఆసీస్ బ్యాట్స్‌మన్‌ని ఆడుకుంటున్నారు. "జస్ప్రీత్ బుమ్రాను చికాకు పెడితే సమాధానం ఇలానే ఉంటుందంటూ కామెంట్స్" చేస్తున్నారు. 

 

 

Bumrah Konstas Clash Sydney Test Day 1 Heated Exchange Video RMA

 

మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తోనూ బుమ్రా దూకుడు

 

ఐదో టెస్ట్‌కి టీమ్ ఇండియాకి కెప్టెన్‌గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో కూడా దూకుడు చూపించాడు. 148 పరుగులకి 8 వికెట్లు పడిన తర్వాత బుమ్రా బ్యాటింగ్‌కి వచ్చాడు. 17 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 22 పరుగులు చేశాడు. దీంతో జట్టు స్కోరు 185కి చేరింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 9 పరుగులకి ఆస్ట్రేలియా 1 వికెట్ కోల్పోయింది. ఖవాజా వికెట్ బుమ్రా ఖాతాలోనే పడింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ కు మంచి శుభారంభం లభించలేదు. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. 

యశస్వి జైస్వాల్ 10 పరుగులు, కేఎల్ రాహుల్ 4 పరుగులు, శుభ్ మన్ గిల్ 20 పరుగులు  చేశారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా నిరాశపరిచాడు. 17 పరుగులు చేసి కోహ్లీ పెవిలియన్ కు చేరాడు. రిషబ్ పంత్ 40 పరుగులు, జడేజా 26 పరుగులు, బుమ్రా 22 పరుగులు చేయడంతో భారత్ స్కోరు 185 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, పాట్ కమ్మిన్స్ 2, బోలాండ్ 4, లియాన్ 1 వికెట్ తీసుకున్నారు.

 

Bumrah Konstas Clash Sydney Test Day 1 Heated Exchange Video RMA

 

టీమ్ నుంచి రోహిత్ శర్మ ఔట్ 

 

గత కొన్ని టెస్టుల నుంచి రోహిత్ శర్మ ఈ ఫార్మాట్ లో పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సింగిల్ డిజిట్ ఇన్నింగ్స్ లకే పరిమితం అయ్యాడు. దీంతో కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. రోహిత్ స్థానంలో శుభ్ మన్ గిల్ జట్టులోకి వచ్చాడు. అలాగే, కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా భారత జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. అయితే, ఇప్పుడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకోబోతున్నారనే చర్చ మొదలైంది.

ఇదే క్రమంలో సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. రెడ్ బాల్ క్రికెట్‌లో రోహిత్ శర్మకు మెల్‌బోర్న్ టెస్టు ఆఖరి మ్యాచ్ అని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. సిడ్నీ టెస్టు తొలి రోజు సందర్భంగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, 'భారత్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించకపోతే, మెల్‌బోర్న్ టెస్టు రోహిత్ శర్మకు చివరి టెస్టు అవుతుంది' అని అన్నాడు.
 

ఇవి కూడా చదవండి:

విరాట్ కోహ్లీ టార్గెట్.. సిడ్నీ టెస్ట్‌లో క్రికెట్ ల‌వ‌ర్స్ ర‌చ్చ.. వీడియో వైర‌ల్ 

మను భాకర్, డి గుకేష్ స‌హా న‌లుగురికి ఖేల్ ర‌త్న‌.. 32 మంది ఆటగాళ్లకు అర్జున అవార్డు

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios