బుమ్రాను వెన‌క్కినెట్టి.. ప్ర‌పంచ నెంబ‌ర్.1 బౌల‌ర్ గా అశ్విన్.. !

World No.1 Bowler: ఇటీవ‌ల ముగిసిన భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న త‌ర్వాత టీమిండియా స్టార్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఐసీసీ ర్యాకింగ్స్ లో అగ్ర‌స్థానంలోకి చేరాడు. త‌న కెరీర్ లో 100 టెస్టులు పూర్తి చేసుకున్న అశ్విన్ 500+ వికెట్లు తీసిన రెండో భార‌త ప్లేయ‌ర్ గా ఘ‌న‌త సాధించాడు. 
 

Bumrah has been pushed back..  Ravichandran Ashwin is the world's No.1 bowler RMA

Ravichandran Ashwin: గత వారం ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరిగిన తన 100వ టెస్టులో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దుమ్మురేపుతూ ఇంగ్లాండ్ ఆట‌గాళ్ల‌ను చెడుగుడు ఆడుకున్నాడు. 5వ టెస్టు మ్యాచ్ లో ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టి 4-1 తేడాతో భార‌త్ సిరీస్ గెలుచుకోవ‌డంతో కీల‌క పాత్ర పోషించాడు. అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో నలుగురు బ్యాటర్లను అవుట్ చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. మొత్తంగా ధర్మశాల టెస్టులో 128 పరుగులు ఇచ్చి 9 వికెట్లు ప‌డ‌గొట్టాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉన్న జస్ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టి కొత్త ప్రపంచ నంబర్ 1 టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు.

ప్ర‌స్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో అశ్విన్ ప్ర‌పంచ నెంబ‌ర్.1 టెస్టు బౌల‌ర్ గా ఉన్నాడు. అతనికి 870 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. బుమ్రా, ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరికీ 847 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన‌ ఐదో టెస్టులో కుల్దీప్ యాదవ్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడంతో ఇప్పుడు 15 స్థానాలు ఎగబాకి ప్రపంచ నం.16 టెస్టు బౌలర్‌గా నిలిచాడు. 686 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక బ్యాటర్స్ జాబితాలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు స్థానాలు ఎగబాకి 6వ స్థానంలోకి చేరాడు. తర్వాత 740 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానంలో యశస్వి జైస్వాల్,  737 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారు.

TEAM INDIA: సెనా దేశాల్లో అత్యధికంగా 5 వికెట్లు సాధించిన భారత బౌలర్లు

ఐదో టెస్టులో, శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున సెంచరీ సాధించి, టెస్టు ర్యాంకింగ్స్‌లో 11 స్థానాలు ఎగబాకి 20వ స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ మాజీ టెస్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల్లో బ్యాటింగ్‌తో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు ప్ర‌స్తుతం అత‌ను నెంబ‌ర్.1 టెస్టు బ్యాట్స్ మ‌న్ గా ఉన్నాడు.

 

IPL చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన టాప్-5 జ‌ట్లు ఇవే 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios