T20 World Cup 2024 లో భారత్-బంగ్లాదేశ్ ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఉచితంగా ఎక్కడ చూడాలి?
IND vs BAN : టీ20 ప్రపంచ కప్ 2024 లో భారత్ తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఆడనుంది. అయితే, అంతకు ముందు భారత్ జూన్ 1న బంగ్లాదేశ్‌తో ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఆడుతుంది. ఈ మ్యాచ్ సమయం, వేదిక, ఫ్రీగా ఎక్కడ చూడాలి? అనే విషయాలు మీకోసం..
T20 World Cup 2024 IND vs BAN : టీ20 ప్రపంచ కప్ 2024 కు సర్వం సిద్దమైంది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగనున్న ఈ ప్రపంచ కప్ టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. అయితే, ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు భారత ఆటగాళ్లు తీవ్రంగా శిక్షణ తీసుకుంటున్నారు. బీసీసీఐ ఈ ఫొటోలు, వీడియోలను పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ తన తొలి మ్యాచ్‌ని జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్ కు ముందు జూన్ 1న బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కూడా ఆడనున్నాడు. అయితే, ఈ మ్యాచ్ ఏ టైమ్ కు జరగనుంది? ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడవచ్చు?
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ప్రత్యక్ష ప్రసారాన్ని ఎలా చూడాలి?
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 లైవ్ స్ట్రీమింగ్ Disney+ Hotstar యాప్, దాని వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్ ఎక్కడ చూడాలి?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ మొత్తం టీ20 ప్రపంచ కప్ 2024 ప్రసార హక్కులను కలిగి ఉంది. ఇది మ్యాచ్ లను టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అలాగే, ప్రత్యక్ష ప్రసారం డిస్నీ+హాట్‌స్టార్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.
టీ20 వరల్డ్ కప్ 2024 లో ఈ ఐదుగురు భారత ప్లేయర్లపైనే అందరికన్ను.. !
భారత్-బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్‌ను ఉచితంగా చూడటం ఎలా?
భారత్ లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 మ్యాచ్‌ల ఉచిత ప్రత్యక్ష ప్రసారం డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌లో చూడవచ్చు. ఈ యాప్ ద్వారా భారత్-బంగ్లాదేశ్ మధ్య వార్మప్ మ్యాచ్‌ను కూడా ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. అయితే, వెబ్‌సైట్‌లో చూడాలనుకుంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా తొలి మ్యాచ్ ఎప్పుడు?
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ తన తొలి మ్యాచ్‌ను బుధవారం (జూన్ 5) ఐర్లాండ్‌తో ఆడనుంది.
భారత్ vs బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది?
భారత్-బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.
T20 World Cup 2024 వార్మప్ మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధ్వంసం..
ప్రపంచకప్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
రిజర్వ్: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.
ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు:
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తస్కిన్ అహ్మద్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, తంజీద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తౌహీద్ హృదయ, మహమూద్ ఉల్లా రియాద్, జకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షాక్ మహేదీ హసన్, రిషాద్ హుస్సేన్, ముస్తాఫ్ ఇస్లాం, ముస్తాఫ్ ఇస్లాం , తంజీమ్ హసన్ సాకిబ్.
రిజర్వ్: అఫీఫ్ హుస్సేన్, హసన్ మహమూద్.
టెన్షన్ పెంచుతున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. టీ20 వరల్డ్ కప్ 2024కు ఉగ్రముప్పు