టీ20 వరల్డ్ క‌ప్ 2024 లో భార‌త్ ట్రంప్ కార్డు అత‌నే.. ఈ ఇద్దరు ప్లేయర్లు తుది జట్టులో ఉండాల్సిదే

T20 World Cup 2024 : గత 11 ఏళ్లుగా భారత్ ఒక్క ఐసీసీ టోర్నమెంట్ లో ఛాంపియ‌న్ గా నిల‌వ‌లేక‌పోయింది. ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 2024 టీ20 ప్రపంచకప్ గెలవాలని చూస్తోంది. 
 

Indias trump card for T20 World Cup 2024  Shivam Dube, Yashasvi Jaiswal should be in the final squad: Suresh Raina RMA

T20 World Cup 2024 : రోహిత్ శర్మ సార‌థ్యంలోని టీమిండియా టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 కోసం అమెరికాకు చేరుకుంది. న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జూన్ 5న ఐర్లాండ్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. జ‌ట్టులోని స‌భ్యులపై ప‌లువురు మాజీ ప్లేయ‌ర్లు చేస్తున్న కామెంట్స్ వైర‌ల్ గా మారుతున్నాయి. ఈ క్ర‌మంలోనే టీమిండియా మాజీ స్టార్ ప్లేయ‌ర్ సురేష్ రైనా చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. భార‌త్ మెగా టోర్నీ ట్రోఫీ గెలవాలంటే నిర్భయంగా బ్యాటింగ్ చేసే  ఆవశ్యకతను నొక్కి చెప్పాడు.

అలాంటి బ్యాటింగ్ తీరును చూడాలంటే తుది జ‌ట్టులో యంగ్ ప్లేయ‌ర్లు యశస్వి జైస్వాల్, శివమ్ దూబేలకు తుది జ‌ట్టులో చోటు కల్పించాలని సురేష్ రైనా చెప్పాడు. శివమ్ దూబేని టీమిండియా ట్రంప్ కార్డుగా అభివర్ణించారు. ఐపీఎల్ 2024లో శివమ్ దూబే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు, దాని ఆధారంగా అతనికి ప్రపంచ కప్ జట్టులో అవకాశం లభించింది.

సురేష్ రైనా ఏం చెప్పాడంటే?

సురేశ్ రైనా మాట్లాడుతూ.. "పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌ని చూస్తున్నాను. ఇందులో ఇంగ్లాండ్ జట్టు ఎలాంటి భయం లేకుండా క్రికెట్ ఆడుతోంది. ఈ ఫార్మాట్‌లో ఏదైనా సాధ్యమే. భయం లేకుండా ఆడటానికి ఇది ఒక ఫార్మాట్. భయం లేకుండా ఆడేవాడే గెలుస్తాడని" పేర్కొన్నాడు. అలాగే, "అమెరికాలో కాలానికి అనుగుణంగా ఉండటమే అతిపెద్ద సవాలు. ఉదయం 10 గంటల నుంచి మ్యాచ్‌లు ఆడాలి కాబట్టి తెల్లవారుజామున తెల్లటి బంతితో ఆడడం అలవాటు లేదు. ఇది కాస్త ఛాలెంజింగ్‌గా ఉంటుంది. అక్కడి పిచ్‌లు కూడా స్లోగా ఉంటాయని" చెప్పాడు.

ఈ ఆట‌గాళ్లు తుదిజ‌ట్టులో ఉండాల్సిందే.. 

య‌శ‌స్వి జైస్వాల్, శివ‌మ్ దూబే ఇద్దరూ ప్లేయింగ్-11లో ఉండాల్సిందేన‌ని సురేష్ రైనా పేర్కొన్నాడు. దీని కోసం కెప్టెన్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని చెప్పాడు. "జైస్వాల్ జట్టులో ఉండాలని కోరుకుంటున్నాను. విరాట్ మూడో స్థానంలో ఆడాలి. అక్కడ పిచ్‌లు స్లోగా ఉంటాయి, కాబట్టి మీరు పరుగులిచ్చి పరుగులు తీయగల బ్యాట్స్‌మెన్ కావాలి. విరాట్‌ను కోహ్లీ 'రన్ మెషిన్', 'ఛేజ్ మాస్టర్' అని పిలుచుకుంటారు. చివరి ఓవర్లలో రిషబ్ పంత్, శివమ్ దూబే వంటి భారీ షాట్లు ఆడే బ్యాట్స్‌మెన్‌లు జట్టులో ఉన్నారని" చెప్పాడు.

యంగ్ ప్లేయ‌ర్ యశస్వి జైస్వాల్‌ బ్యాటింగ్‌ తీరు చాలా బాగుటుంద‌నీ, అతను నిర్భయంగా క్రికెట్‌ ఆడుతాడని చెప్పాడు. అలాగే, శివ‌మ్ దూబే కూడా ప్ర‌త్యేకంగా ఆడ‌తాడ‌నీ, అత‌నిలా నిలబడి సిక్సర్లు కొట్టే సామర్థ్యం చాలా తక్కువ మంది ఆటగాళ్లకు ఉంటుందన్నాడు. గ‌తంలో యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ నుంచి ఇలాంటి షాట్ల‌ను చూశామ‌ని అన్నాడు. శివమ్ దూబేని తన ట్రంప్ కార్డ్ అని పిలిచాడు.

6 ప్రపంచకప్‌లు.. కానీ ఒక్క సెంచరీ కూడా లేదు.. విరాట్ కోహ్లీ ఈసారి సాధిస్తాడా?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios