Asianet News TeluguAsianet News Telugu

మరో పాక్ క్రికెటర్‌పై కేసు... న్యూడ్ ఫోటోలు లీక్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ షాదబ్ ఖాన్‌పై...

పాక్ ఆల్‌రౌండర్ షాదబ్ ఖాన్, తనను బ్లాక్ మెయిల్ చేస్తూ, బెదిరిస్తున్నాడంటూ దుబాయ్‌కి చెందిన ఓ మహిళ ఫిర్యాదు... చాలామంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడంటూ ఆరోపణలు...

Blackmailing and threating allegations on Pakistan Cricketer Shadab Khan, Dubai based Woman
Author
India, First Published Jan 4, 2022, 11:39 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

క్రికెటర్లయందు పాక్ క్రికెటర్లు వేరయ్యా... అనాల్సిందే. ఎందుకంటే పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌లో అరడజను మందికి పైగా ప్లేయర్లు (కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో‌ సహా) పోలీసు కేసులతో, వివిధ రకాల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. తాజాగా ఈ లిస్టులోకి షాదబ్ ఖాన్ కూడా వచ్చాడు..

పాక్ ఆల్‌రౌండర్ షాదబ్ ఖాన్, తనను బ్లాక్ మెయిల్ చేస్తూ, బెదిరిస్తున్నాడంటూ దుబాయ్‌కి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. షాదబ్ ఖాన్‌పై ఇలాంటి బ్లాక్ మెయిల్, బెదిరింపుల ఆరోపణలు కొత్తేమీ కాదు. ఇంతకుముందు చాలా మంది అమ్మాయిలు, షాదబ్‌పై ఇలాంటి ఆరోపణలు చేశారు...

తాజాగా దుబాయ్‌కి చెందిన ఆస్రీనా అనే మహిళ, షాదబ్ ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘షాదబ్ ఖాన్‌కి నాకు 2019లో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అయితే అతని ప్రవర్తన సరిగా లేదని నేను, షాదబ్ అకౌంట్‌ను బ్లాక్ చేశాను. అయితే అతను చాలా ఫేక్ అకౌంట్స్, ఫ్యాన్ పేజీల ద్వారా నన్ను పదే పదే విసిగిస్తూ, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈ అకౌంట్ల ద్వారా చాలామంది అమ్మాయలను లోబరుచుకుని, తన పలుకుబడి, పాపులారిటీతో వారి జీవితాలను నాశనం చేస్తున్నాడు...

2019 వన్డే వరల్డ్‌ కప్ సమయంలో నన్ను ఇంగ్లాండ్‌కి రమ్మని పిలిచాడు షాదబ్, నేను వెళ్లాను. వరల్డ్ కప్ టోర్నీలో పాక్ క్రికెట్ టీమ్‌ నన్ను సాదరంగా ఆహ్వానించింది. వరల్డ్ కప్ జట్టులో ఉన్న చాలా మంది పాక్ ప్లేయర్లను నేను కలిశాను. అలా పరిచయం పెరిగిన తర్వాత షాదబ్, నేను కలిసి కొన్ని డిన్నర్ డేట్స్‌కి కూడా వెళ్లాం...

అలా మా మధ్య పరిచయం పెరిగి, డేటింగ్ కూడా చేశాం. కొన్ని నెలల తర్వాత అతని ప్రవర్తన క్రూరంగా మారింది. అతనికి చాలామంది అమ్మాయిలతో అతనికి ఎఫైర్స్ ఉన్నాయని తెలిసింది, చాలా సోషల్ మీడియా ఫేక్ అకౌంట్ల ద్వారా వారిని లోబర్చుకుంటున్నాడు షాదబ్. దీని వల్లే అతనికి, నాకు పెద్ద గొడవ అయ్యింది...

అతను నన్ను వదలకుండా బ్లాక్ మెయిల్ చేస్తుండడంతో ఈ విషయాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకున్నా. కరోనా సమయంలోనూ షాదబ్ నన్ను కలిశాడు, క్షమాపణలు చెప్పి, తాను మారిపోయానని అన్నాడు. దాంతో అతన్ని నమ్మి, నేను మళ్లీ అతనితో డేటింగ్ చేశాను....

అయితే కరోనా బ్రేక్ తర్వాత అతను మళ్లీ పాత దారిలోనే అమ్మాయిలతో ఛాట్ చేస్తూ, వారితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. అతని మాయలో పడి చాలామంది అమ్మాయిల జీవితాలు నాశనమయ్యాయి.ఇప్పుడు నా నగ్న చిత్రాలు భయపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నాకు సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టా ద్వారా నాకు ఆదాయం కూడా వస్తోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూఎన్సర్‌గా ఉన్న నా ఇమేజ్‌ని డామేజ్ చేస్తున్నాడు. నా అకౌంట్‌ను డిలీట్ కూడా చేయించాడు...’ అంటూ ఆరోపించాడు ఆశ్రీనా...

నెల రోజుల వ్యవధిలో పాక్ జట్టులో ప్లేయర్లపై పోలీసు కేసు నమోదు కావడం ఇది రెండోసారి. కొన్నిరోజుల కిందటే పాక్ సీనియర్ స్పిన్నర్ యాసిర్ షాపై రేప్ కేసు నమోదైంది. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికపై యాసిర్ షా, అతని స్నేహితులు ఫర్షాన్... లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కేసు నమోదైంది...


యాసిర్ షా స్నేహితుడు ఫర్షాన్ తనని కిడ్నాప్ చేశాడని, ఆ తర్వాత తనకు తుపాకీ గురి పెట్టి పలు మార్లు అత్యాచారం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది బాలిక. అంతేకాకుండా అత్యాచారానికి సంబంధించిన దృశ్యాలను ఫోన్‌లో వీడియో తీసి, వాటిని చూపించి బెదిరించి... పలు మార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలిపింది...

ఫర్షాన్‌కి యాసిర్ షా సాయం చేశాడని, తనకు ఫోన్ చేసి అతనిపై కేసు పెట్టినా, ఈ విషయాన్ని ఎవ్వరికైనా చెప్పినా ఆ వీడియోలను నెట్‌లో పెడతానని బెదిరింపులకు పాల్పడినట్టు తన ఫిర్యాదులో తెలియచేసింది ఆ బాలిక...
 

Follow Us:
Download App:
  • android
  • ios