భారత్ కు బిగ్ షాక్.. ఉత్కంఠ పోరులో 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి..

India vs England: హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ 28 పరుగుల తేడాతో ఓడిపోయింది.
 

Big shock for India. They lost to England by 28 runs in a thrilling match IND v ENG  RMA

India vs England: ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టుల్ భార‌త్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఉత్కంఠ‌గా సాగిన ఈ మ్యాచ్ లో చివ‌ర‌కు భార‌త్ 28 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్.. ఇంగ్లాండ్ స్పిన్న‌ర్ల దెబ్బ‌కు భార‌త బ్యాట‌ర్స్ వ‌రుసగా పెవిలియ‌న్ కు క్యూక‌ట్టారు. 231 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ లు మంచి ఓపెనింగ్ ను అందించారు. జైస్వాల్ 15 పరుగులు చేసి ఔట్ కాగా, రోహిత్ శర్మ 39 పరుగులు చేసి టామ్ హార్టీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

అయితే, ఆ త‌ర్వాత వ‌చ్చిన ప్లేయ‌ర్లు ఏవ‌రూ కూడా పెద్ద స్కోర్ చేయ‌కుండానే పెవిలియ‌న్ కు క్యూ క‌ట్టారు. మరోసారి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా శుభ్ మన్ గిల్ ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ గా వెనుదిరిగాడు. ఇక అక్షర్ పటేల్ 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నిలకడగా ఇన్నింగ్స్ ను ప్రారంబి 22 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ను రూట్ దెబ్బకొట్టాడు. దీంతో భారత్ 32.4 ఓవర్లలో 107 పరుగులు చేసి 5వ వికెట్ ను కోల్పోయింది. ఆ త‌ర్వాత బ్యాటింగ్ కు దిగిన ర‌వీంద్ర జ‌డేజా 119 ప‌రుగుల వ‌ద్ద ర‌నౌట్ అయ్యాడు.  చివ‌ర‌ల్లో అశ్విన్, భ‌ర‌త్ జ‌ట్టును గెలిపించే ప్ర‌యత్నం ఫ‌లించ‌లేదు.

టెస్టు క్రికెట్ కెరీర్ లో రవీంద్ర జడేజాకు ఇదే తొలిసారి.. !

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 246 ప‌రుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్ లో 420 ప‌రుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భార‌త బౌల‌ర్ల‌లో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు, ర‌విచంద్ర‌న్ అశ్విన్ 3, ర‌వీంద్ర జ‌డేజా 2 వికెట్లు తీసుకున్నారు. భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో 436 ప‌రుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో 202 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో టామ్ హార్ట్లీ 7 విక‌ట్లు తీసుకుని భార‌త్ ను దెబ్బ‌కొట్టాడు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios