Asianet News TeluguAsianet News Telugu

లీక్ అయిన వీడియోపై స్పందించిన బాబర్ ఆజమ్.. ఏమన్నాడంటే..!

Babar Azam: పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ తన సహచర క్రికెటర్ ప్రేయసితో  సెక్స్ చాట్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తున్నది.  ఈ నేపథ్యంలో  పాక్ కెప్టెన్  స్పందించాడు. 
 

Behind You Skipper: Fans Support Pakistan Skipper Babar Azam After alleged personal video Leaked
Author
First Published Jan 17, 2023, 3:40 PM IST

వరుస వైఫల్యాలతో  కెప్టెన్సీకి ఎసరు వస్తుందన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో  పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ కు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, ప్రైవేట్  చాట్ లీక్ అయింది. తన జట్టుకే చెందిన  ఓ క్రికెటర్ ప్రేయసితో బాబర్  సెక్స్ చాట్ చేశాడని, లైంగిక సందేశాలు పంపాడన్న వీడియోలు పాకిస్తాన్ క్రికెట్ ను ఊపేస్తున్నాయి. బాబర్ హనీ ట్రాప్ లో చిక్కుకున్నాడని కొంతమంది అంటుండగా..  ఇది  అతడిని కెప్టెన్సీ నుంచి పంపించడానికి వేసిన ఎత్తుగడ అని  మరికొంతమంది చెబుతున్నారు. 

సోషల్ మీడియాలో లీకైన వీడియోలో  బాబర్.. ‘నువ్వు  (సహచర క్రికెటర్ ప్రేయసి) నాతో ఇలాగే సెక్స్ చాట్ చేస్తే   నీ ప్రియుడు టీమ్ నుంచి బయటకు వెళ్లడు..’అని అనడం వీడియోలో ఉంది. అయితే ఈ వీడియోలు, ఫోటోలు, వాట్సాప్ చాట్ లు  సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో బాబర్ స్పందించాడు. 

ట్విటర్ వేదికగా బాబర్.. తాను ఓ బ్రిడ్జి దగ్గర నవ్వుతూ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘దీని గురించి మరీ అంతగా బాధపడాల్సిందేమీ లేదు. హ్యాపీగా ఉండండి..’అని ట్వీటాడు. 

 

మరోవైపు బాబర్ ఫ్యాన్స్ కూడా అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.  స్వదేశంలో వరుస సిరీస్ ఓటములతో అతడిని  సారథిగా తప్పించాలని చూస్తున్న పీసీబీ చేస్తున్న కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందని వాపోతున్నారు.  వీడియోలు మార్ఫింగ్ అని..  ఈ వీడియోలను అందరికంటే ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన  అకౌంట్ ఇప్పుడు కనబడకుండా పోవడమే దీనికి నిదర్శనమని  అంటున్నారు. 

 

గతేడాది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లలో దారుణ ఓటముల తర్వాత  అతడి కెప్టెన్సీ కూడా ఊడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.   నాలుగైదు రోజుల క్రితం న్యూజిలాండ్ తో కూడా వన్డే సిరీస్ ను కోల్పోయిన పాకిస్తాన్ కు త్వరలోనే షాన్ మసూద్ ను టెస్టులు, వన్డేలకు సారథిగా నియమిస్తారని   ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో బాబర్ ఇమేజీని డ్యామేజ్ చేయడానికే ఇలాంటివి చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారనే  వాదనలూ ఉన్నాయి. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios