అండర్-19 వరల్డ్ కప్ జట్టులో తెలంగాణ క్రికెటర్ కు చోటు..

తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన  అవనీష్ రావు (Avanish Rao) ఇండియా అండర్-19 వరల్డ్ కప్ (Under-19 ICC World Cup) పురుషుల జట్టులో చోటు దక్కించుకున్నారు. దీంతో ఆయనను మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో అభినందించారు.

A place for Telangana cricketer in Under-19 World Cup team..ISR

Avanish Rao : తెలంగాణకు చెందిన క్రికెటర్ కు గొప్ప అవకాశం లభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన 18 ఏళ్ల వికెట్ కీపర్ అవనీష్ రావు కు ఇండియా అండర్-19 వరల్డ్ కప్ పురుషుల జట్టులో చోటు దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాలో ముక్కోణపు సిరీస్, 2024లో ఐసీసీ పురుషుల అండర్-19 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ ప్రకటన చేసింది.

ఆకాశంలో అద్భుతం.. నేటి నుంచి ఐదు రోజుల పాటు ఉల్కాపాతాలు.. ఎలా చూడాలంటే ?

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) 15 మంది సభ్యుల అండర్-19 జట్టులో వికెట్ కీపర్-బ్యాట్స్ మన్ గా అవనీశ్ రావు ఎంపికయ్యారు. డిసెంబర్ 29 నుంచి జనవరి 10 వరకు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ జరగనుంది. 2024లో దక్షిణాఫ్రికాలో జరగనున్న ఐసీసీ పురుషుల అండర్-19 ప్రపంచకప్ లో ఆయన ఆడనున్నారు. 

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీఆర్ఎస్ కే అత్యధిక నిధులు..

అండర్-19 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడం పట్ల తెలంగాణ మాజీ ఐటీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. సోషల్ మీడియా ద్వారా అవనీష్ కు అభినందనలు తెలిపారు. ఈ ఫ్యూచర్ స్టార్ సిరిసిల్ల నియోజకవర్గం పోతుగల్ గ్రామానికి చెందినవాడని ట్వీట్ చేశారు.

అవనీష్ సాధించిన ఈ విజయం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో పాటు జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లా క్రికెట్ అసోసియేషన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ క్రీడా సంఘాలు ఆయనకు అభినందనలు తెలిపాయి. క్రికెట్ లో అవనీష్ నిరంతరం విజయం సాధించాలని ఆకాంక్షించాయి. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios