ఆకాశంలో అద్భుతం.. నేటి నుంచి ఐదు రోజుల పాటు ఉల్కాపాతాలు.. ఎలా చూడాలంటే ?

నేటి నుంచి ఐదు రోజుల పాటు ఆకాశంలో అద్భుత దృష్యం ఆవిష్కృతం కానుంది. పాథియాన్‌ (Patheon) అనే గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తున్నది. దీని వల్ల ఉల్కాపాతాలు (Meteor showers)సంభవించనున్నాయి. పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ దీనిని చూడవచ్చు.

Miracle in the sky.. Meteor showers for five days from today.. How to see?..ISR

ఆకాశంలో అద్భుతం జరగనుంది. నేటి నుంచి ఐదు రోజుల పాటు ఉల్కాపాతాలు సంభవించనున్నాయి. వీటి వల్ల వినీలాకాశంలో అద్భుత దృష్యాలు ఆవిష్కృతం కానున్నాయి. డిసెంబర్ 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉల్కలు నేల వైపు దూసుకొస్తాయి. అయితే వీటి వల్ల ఎలాంటి ప్రమాదమూ జరిగే అవకాశం లేదు. 

CM Revanth Reddy: నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం

కాగా.. నేటి రాత్రి 9 గంటల నుంచి తెల్లవారే వరకు వేరు వేరు సమయాల్లో ఈ ఉల్కాపాతాలు సంభవిస్తాయి. వీటిని చూసేందుకు ప్రత్యేకంగా ఎలాంటి పరికరాలు అవసరం లేదు. నేరుగా చూడవచ్చు. ఇవి ప్రకాశవతంగా భూమిపైకి దూసుకొస్తాయి. వీటిని ప్రజలు తమ సెల్ ఫోన్ లో బంధించవచ్చు. ఆ వీడియోలను అంతర్జాతీయ ఉల్కాపాత (IMO) సంస్థ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసేందుకు అవకాశం ఇచ్చింది. 

Ram Mandhir: ‘మోడీ పాలన తర్వాత రామ మందిరాన్ని కూల్చిపారేస్తాం’.. వృద్ధుడి వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్ల ఫైర్

ఈ అద్భుత దృష్యాలు ఆవిష్కృతం కావడానికి కారణం పాథియాన్‌ అనే గ్రహశకలం. ఈ గ్రహ శకలం సాధారణంగా మన సౌర కుటుంబంలో సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే అనుకోకుండా అది కొన్ని నెలల కిందట భూకక్ష్యలోకి ప్రవేశించింది. అయితే అది ఇప్పుడు భూ వాతావరణంలోకి ప్రవేశించబోతోంది. ఈ క్రమంలో ఆ గ్రహ శకలం కొన్ని పదార్థాలతో కలవడం వల్ల రాపిడికి గురి కానుంది. దీని వల్ల ఆ శకలం చిన్న చిన్న ముక్కలుగా మారిపోనుంది. 

లోక్ సభలో భద్రతా ఉల్లంఘన.. ప్రధాన సూత్రధారి లలిత్ ఝా అరెస్టు..

ఇలా మారిన ముక్కలు నేలవైపు దూసుకొస్తూ మండుతాయి. ఇవి గంటకు 150 కాంతి పుంజాలను వెదజల్లే అవకాశం ఉందని ఐఎంవో తెలిపింది. దీంతో అవి ప్రకాశవంతంగా కనిపించనున్నాయి. ఈ దృష్యాలను పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ కనిపించనున్నాయి. ఈ ఉల్కాపాతాలు దాదాపు ఐదు రోజుల పాటు కనివిందు చేయనున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios