కోవిడ్-19 సెకండ్ వేవ్ లో ఇండియన్ నేవీ ముందంజ.. జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కీలక పాత్ర..

గత రెండు నెలలకు పైగా కరోనా సెకండ్ వేవ్ ని అధిగమించడానికి జాతీయ ప్రయత్నంలో సహాయపడటానికి నేవీ ఆపరేషన్ సముద్ర సేతు-2ను చేపట్టింది. 

Silent Service - The indian Navy is at the forefront of combat even in the second wave of Covid.

భారతదేశ నావికాదళం 'సైలెంట్ సర్వీస్' అనే పేరును  సంపాదించింది, ఎందుకంటే భారతదేశాన్ని రక్షించడానికి వారు చేస్తున్న కృషి చాలావరకు ప్రజల దృష్టికి దూరంగా సముద్రంలో జరుగుతుంది. గత రెండు నెలలకు పైగా కరోనా సెకండ్ వేవ్ ని అధిగమించడానికి జాతీయ ప్రయత్నంలో సహాయపడటానికి నేవీ ఆపరేషన్ సముద్ర సేతు-2ను చేపట్టింది. 

ఈ  జాతీయ సంక్షోభాన్ని నివారించేందు  కోసం ఆవిష్కరణ, మెరుగుదల అవసరం. ఇందుకు భారత నావికాదళం మరోసారి ముందుకు వచ్చింది.భారతదేశంలో మెడికల్ ఆక్సిజన్‌ కోసం డిమాండ్ పెరుగుతుండటంతో ఇండో-పసిఫిక్‌లోని వివిధ దేశాల నుండి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, ఖాళీ సిలిండర్ల రవాణాను పెంచాలని భారత నావికాదళానికి పిలుపునిచ్చారు. 

ఆపరేషన్ సముద్ర సేతు-2లో భాగంగా సముద్రంపై ఏ సవాలునైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న యుద్ధ నౌకలను హిందూ మహాసముద్రం విస్తీర్ణంలో  ఉన్నపెర్షియన్ గల్ఫ్ నుండి ఆగ్నేయాసియా వరకు ఉన్న విదేశీ దేశాలకు  పంపించారు. 'మనం సాధించగలం' అనే వైఖరి ఎల్లప్పుడూ భారతీయ నావికా దళాన్ని వర్ణిస్తుంది. ఈ మొత్తం ఆపరేషన్ సమయంలో ఈ వైఖరి మరోసారి హైలైట్ అయ్యింది.
 
నావికాదళం  ఆదేశాల మేరకు డిస్ట్రాయర్లు, యుద్ధనౌకలు, అంఫీబియస్ నౌకలతో సహా పది యుద్ధనౌకలు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కన్సెంట్రేటర్స్, పిపిఇ, కోవిడ్ టెస్ట్ కిట్లు, వెంటిలేటర్లు, ఇతర  మెడికల్ ఎక్విప్మెంట్ తో నిండిన కంటైనర్లను తీసురవడానికి పశ్చిమ, ఆగ్నేయాసియాలోని దేశాలకు వెంటనే చేరుకున్నాయి. 

మే 5న బహ్రెయిన్ నుండి 54 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌తో ఐఎన్ఎస్ తల్వార్ మంగళూరుకు చేరుకుంది. కర్ణాటకలో కోవిడ్-19 వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ సహాయక చర్య జరిగింది, అలాగే ఎన్నో ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది.  మిషన్ ఆదేశించిన వెంటనే ఐఎన్ఎస్ తల్వార్ సముద్రంలోకి ప్రవేశించింది. ఎందుకంటే వ్యాపార నౌకలకు భద్రత కల్పించడానికి దీనిని పశ్చిమ అరేబియా సముద్రంలో నియమించారు. 

ఈ నౌక  కొత్త అవసరాలకు అనుగుణంగా, విజయవంతంగా మిషన్‌ను వెంటనే చేపట్టగలిగింది.  ఇది నేవీ స్వాభావిక వశ్యతకు నిదర్శనం,'హర్ కామ్ దేశ్ కే నామ్'  చేయాలనే దృఢమైన నిశ్చయం.
 
ఐఎన్ఎస్ తల్వార్‌లోని ఒక యువ నావికుడు సముద్రంలో ప్రమాదకరమైన రోజులను వివరించాడు. నౌక ఆక్సిజన్‌ను అందించడానికి కఠినమైన వాతావరణంలో దేశం వైపు వస్తుంది. "నౌక పెద్ద పెద్ద అలలను అధిగమిస్తున్నపుడు కూడా కంటేనర్లను నిరంతరం తనిఖీ చేస్తు, బైండింగ్లను మళ్లీ మళ్ళీ సరిగ్గా ఉన్నాయా లేదో చెక్ చేస్తు ఎందుకంటే ఏ ఒక్కటి కూడా విరిగిపోకుండా నిర్ధారించుకోవాలి. బలమైన గాలులు, భారీ అలల మధ్య తనిఖీ చేయడానికి ఒక సపోర్ట్ ధరించి, కంటైనర్‌పైకి ఎక్కడం నాకు ఇంకా గుర్తుంది.  ఎందుకంటే ఇది ఒక చాలెంజింగ్ పని, కానీ మన దేశానికి దీని అవసరం ఎంత ముఖ్యమో నాకు తెలుసు కాబట్టి, నేను ఎప్పుడూ భయపడలేదు." అని చెప్పారు.
 
తరువాత కొద్ది రోజులకే మరో నాలుగు నౌకలు 9 కంటైనర్లలో 250 టన్నులకు పైగా వైద్య ఆక్సిజన్‌, దాదాపు 2000 ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర మెడికల్ సామగ్రితో  ఖతార్, కువైట్ నుండి ముంబై ఇంకా న్యూ మంగళూరుకు చేరుకున్నాయి.  తూర్పు సముద్ర తీరంలో ఐ‌ఎన్ షిప్స్ బ్రూనై, సింగపూర్, వియత్నాం నుండి  వైద్య సహాయాన్ని  రవాణా చేస్తున్నాయి. వీటిని చెన్నై, విశాఖపట్నాలకు ఉత్తమ వేగంతో తీసుకువచ్చారు. 

మొత్తం మీద సముద్ర సేతు-2 కోసం మోహరించిన నౌకలు 14 ట్రీప్పులకు పైగా, కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న జాతీయ పోరాటానికి అవసరమైన సహాయాన్ని తీసుకురావడానికి దాదాపు 90,000 కి.మీ ప్రయాణించాయి. ఏడు వారాలుగా కొనసాగిన ఈ ఆపరేషన్ క్లిష్టమైన వైద్య సహాయంతో పాటు 1050 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, 13,800 ఆక్సిజన్ సిలిండర్లను  దేశానికి తీసుకువచ్చాయి.

కార్వార్ అండ్ కొచ్చి వద్ద ఉన్న నావికా స్థావరాల నుండి నౌకలు లక్షద్వీప్, మినికోయ్ దీవులకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను ఏర్పాటు చేశాయి. స్థానిక జనాభాకు సహాయపడటానికి ఆక్సిజన్‌తో సహా వైద్య సహాయం క్రమం తప్పకుండా దీవులకు రవాణా చేస్తుంది.తౌక్తా తుఫాను ఈ ప్రాంతంలో  చెలరేగినపుడు కూడా స్థానిక అడ్మినిస్ట్రేషన్ కి అవసరమైన సహాయ సామాగ్రిని అందుకునేలా చూడటానికి  ఏ ఒక్క ప్రయత్నంని కూడా వాదులుకోలేదు.
 
ప్రతి మిషన్ కరోనావైరస్  కింద చేపట్టబడింది. నావికాదళ సిబ్బంది తమను సురక్షితంగా ఉంచుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు వదులుకొలేదు. వీరిలో కొందరు పురుషులు, మహిళలకు  కుటుంబం  కూడా ఉంది, వారిలో కొందరు వైరస్ బారిన పడ్డారు, అయిన కూడా వారు పూర్తి నిబద్ధతతో తమ కర్తవ్యాన్ని సముద్రంలో కొనసాగించారు. నేవీ పని బలం అలాంటిది, వారి వ్యక్తిగత పరిస్థితులతో సంబంధం లేకుండా  నేవీ సిబ్బందిలో ఒకరు కూడా విధి పిలుపు నుండి వెనక్కి తగ్గలేదు.
 
భారత నావికాదళం గర్వంగా 'సైలెంట్ సర్వీస్' అనే పేరును స్వీకరించింది. దేశానికి ఎలాంటి సమయంలోనైనా సహాయాన్ని చేస్తూనే ఉంటుంది. ఈ ఆపరేషన్ నేవీ దేశంలో ఏ సవాలునైనా  అధిగమించడంలో సహాయపడుతుంది అనేదానికి మరొక ఉదాహరణ. సముద్రా సేతు-2' కింద నావికాదళం 'సముద్రానికి వంతెన', భారతదేశాన్ని  ప్రాంతీయ దేశలతో అర్ధవంతమైన, స్థిరమైన పద్ధతిలో అనుసంధానించడానికి దూరాన్ని ఎలా అధిగమించగలదో వివరిస్తుంది. 

భారత నావికాదళం ఇప్పటికే సాధారణ మిషన్ల కోసం ఆపరేషన్లో పాల్గొన్న అన్ని నౌకలను తిరిగి మోహరించింది, తదుపరి మిషన్ కోసం కాపలా తీసుకుంది.  ఎప్పటిలాగే నావికాదళంలోని స్త్రీ, పురుషులు ఉత్తమమైన పనినే చేస్తుంటారు, వారు మంచి పని చేశారని, ప్రజల ప్రాణాలను కాపాడారని తెలుసు - ఎందుకంటే అందరూ దేశ సేవలోనే ఉన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios