w w w w w.. ప్లవర్ అనుకొంటివా ఫైర్.. ఆస్ట్రేలియాను చీల్చిచెండాడిన బుమ్రా
IND vs AUS Jasprit Bumrah : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ లో భాగంగా భారత్-ఆస్ట్రేలియాలు తలపడుతున్నాయి. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో విఫలమైన భారత్.. బౌలింగ్ లో అదరగొట్టింది. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు.
IND vs AUS Jasprit Bumrah : ఆస్ట్రేలియాతో జరుగుతున్న పెర్త్ టెస్టులో బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైన భారత జట్టు.. బౌలింగ్ లో మాత్రం ఆసీస్ కు చుక్కలు చూపించింది. మరీ ముఖ్యంగా తక్కువ స్కోర్ ను కాపాడు కోవడం కోసం బుమ్రా.. పుష్ప మాదిరి "ప్లవర్ అనుకొంటివా వైల్డ్ ఫైర్" అనే విధంగా అగ్గిపుట్టించాడు. తన నిప్పులు చెరిగే బౌలింగ్ తో ఆస్ట్రేలియాను దెబ్బకొట్టాడు. దీంతో ఆసీస్ 96 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది.
Jasprit Bumrah
జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ విధ్వంసం
టీమిండియా తాత్కాలిక కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో కంగారూ బ్యాట్స్‌మెన్‌ను చిత్తు చేశాడు. పెర్త్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు.
బుమ్రా బౌలింగ్ చేయడానికి పిచ్‌పైకి వచ్చినప్పుడు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను లను సింహంలా వేటాడతాడనే విషయం తెలిసిందే. విధ్వంసానికి మరో పేరు అయిన ఈ బౌలర్.. మరోసారి ఆస్ట్రేలియాపై అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. తన కిల్లర్ బౌలింగ్‌తో మ్యాచ్‌ని మలుపు తిప్పాడు. చాలా సందర్భాల్లో భారత్ కు అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడిన బుమ్రా.. పెర్త్ టెస్టులో కూడా మాయచేశాడు.
పెర్త్ టెస్టులో 5 వికెట్లతో జస్ప్రీత్ బుమ్రా ఫైర్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న పెర్త్ టెస్టులో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి విధ్వంసం సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీయడం ఇది 11వ సారి. ప్రపంచ క్రికెట్‌లో చాలా ప్రసిద్ధి చెందిన ఈ స్టార్ బౌలర్.. సిరీస్ విన్నింగ్ బౌలర్ గా కూడా గుర్తింపు పొందాడు. ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా ఇప్పటి వరకు 13 ఓవర్లు బౌలింగ్ చేసి 23 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు ఫ్లాప్ షో చూపించారు. తొలి రోజు మ్యాచ్‌లో భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ లేకపోవడంతో అతను జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 150 పరుగులకే ఆలౌట్ అయింది. రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి మినహా ఎవరు చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు.