Asianet News TeluguAsianet News Telugu

జగ్గయ్యపేట వద్ద భారీగా ట్రాఫిక్ జాం: ఏపీలోకి అనుమతించని పోలీసులు

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దుల వద్ద పోలీసులు చెక్‌పోస్టులను మూసివేశారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 

heavy traffic jam in vijayawada-Hyderabad National High way
Author
Hyderabad, First Published Mar 25, 2020, 7:56 PM IST

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దుల వద్ద పోలీసులు చెక్‌పోస్టులను మూసివేశారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని సొంత వూళ్లకు వెళ్లేందుకు బుధవారం ఉదయం నుంచి  కార్లు, బైకులపై భారీగా జనం రోడ్లపైకి వచ్చారు. అయితే ఏపీ పోలీసులు వారిని రాష్ట్రంలోకి అనుమతించకపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

దీంతో ప్రయాణీకులు దిక్కుతోచని పరిస్ధితుల్లో అక్కడే పడిగాపులు పడతున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు ముఖ్యమంత్రులు అంతా ప్రజలు బయటకు వెళ్లొద్దని ఎక్కడ వున్న వారు అక్కడే వుండాలని చెబుతున్నారు.

Also Read:కరోనా లాక్ డౌన్: పిలిస్తే పలుకుతా... అంటూ కష్టాలు తీరుస్తున్న కేటీఆర్

అయినప్పటికీ జనం మాత్రం వినలేకపోతున్నారు. హైదరాబాద్‌లో హాస్టల్స్‌ ఖాళీ చేస్తుండటంతో ఎక్కడ ఉండాలో తెలియక దిక్కుతోచని పరిస్ధితుల్లో యువత కూరుకుపోయింది. ఈ క్రమంలో బుధవారం నగరంలోని పోలీస్ స్టేషన్లకు చేరుకున్న యువత ఎన్‌వోసీ సర్టిఫికెట్లు తీసుకుని బైకులపై బయల్దేరారు. 

మొదటి రెండు రోజులు రోడ్ల మీదకు వచ్చిన జనం.. పోలీసుల దెబ్బకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే లాక్‌డౌన్  దెబ్బకు హైదరాబాద్‌లో బ్యాచిలర్స్‌కు కొత్త కష్టాలు వచ్చాయి. విద్య, ఉపాధి అవసరాల  నేపథ్యంలో వేలాది మంది యువత హైదరాబాద్‌లోని హాస్టల్స్‌లో ఉంటున్నాయి.

లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో హాస్టల్స్ యాజమాన్యాలు వాటిని మూసివేస్తున్నాయి. దీంతో యువతి, యువకులకు ఇబ్బందులు వచ్చి పడ్డాయి. హాస్టల్స్‌లో ఉండే వీలు లేక.. ఇటు సొంత ఊళ్లకు వెళ్లలేక  యువత నడిరోడ్డుపై నిలబడ్డారు. దిక్కుతోచని పరిస్ధితుల్లో దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లకు క్యూ కట్టారు.

Also Read:హాస్టల్స్ బాధితులకు ఊరట: సొంతూళ్లకు వెళ్లేందుకు పోలీసుల అనుమతి

తాము సొంత ఊళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ఎస్సార్ నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఇదే పరిస్ధితి కనిపించింది.

విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు.. ఎట్టకేలకు యువత వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించారు. 24 గంటల్లో వీరంతా సొంతూళ్లకు చేరుకోవాలని పోలీసులు ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios