ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ... భారతదేశం ఇటలీ, అమెరికాలకు పట్టిన గతి చూసి చాలా త్వరగా మేలుకుందని చెప్పాలి. ఏప్రిల్ 14 వరకు దేశంలో 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. అంతకు ముందు నుంచి కూడా తెలంగాణలో లాక్ డౌన్ నడుస్తున్న విషయం తెలిసిందే! 

ఇలా ఒక్కసారిగా వారం రోజులుగా ఉన్న లాక్ డౌన్ ను మరో 14 రోజులపాటు పొడిగించడంతో చిక్కుబడ్డ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర సరిహద్దులు మూసేయడంతో ఏం చేయాలో అర్థం కాక పక్క రాష్ట్రాల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. 

ఇక ముఖ్యంగా హైదరాబాద్ కి వచ్చి ఉద్యోగాల కోసం వెదుక్కుంటున్న  పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పోలీసులు హాస్టళ్లు ఖాళీ కూడా చేపిస్తుండడంతో వారంతా ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. 

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వారు మంత్రి కేటీఆర్ కి తమ గోడును వెళ్లబోసుకున్నారు. సోషల్ మీడియాలో సహజంగానే యాక్టీవ్ గా ఉండే కేటీఆర్ ఆయనకు పదుల సంఖ్యలో వచ్చిన రిక్వెస్టులకు ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. అందరికీ సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. 

ప్రకాశం  చెల్లి దయనీయ స్థితి... కరుణించిన అన్న కేటీఆర్ 

ప్రకాశం జిల్లాకు చెందిన ఒక యువతీ, ఉద్యోగ ప్రయత్నాల నిమిత్తం హైదరాబాద్ కు వచ్చింది. హైదరాబాద్ లోని హాస్టల్ లో ఉంటుంది. లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు హాస్టల్ ని ఖాళీ చేయమనడంతో తినడానికి తిండి కూడా లేని దుస్థితి.  ఆమె చివరి ప్రయత్నంగా హైదరాబాద్ లో నిలువనీడ లేదని, తనను తన సొంతూరికి పంపించాలని కోరింది. స్పందించిన కేటీఆర్ తన కార్యాలయం ఆ పనులను చూసుకుంటుందని అభయమిచ్చారు. 

నిండు గర్భిణీని, నన్ను మా పుట్టింటిటికి వెళ్లనివ్వరూ.... 

శివరంజని అనే 9 నెలల గర్భిణీ కేటీఆర్ ని ట్విట్టర్ వేదికగా తన సొంతఊరు చీరాల వెళ్లనివ్వాలని కోరింది. వెంటనే స్పందించిన కేటీఆర్ మీరు ఖచ్చితంగా వెళ్తారు మదం అంటూ తన ఆఫీస్ సిబ్బందిని ఈ పనిని చూసుకోవాలిసిందిగా పురమాయించారు. 

కాలు విరిగింది... ఆసుపత్రికి వెళ్ళాలి 

మరొక వ్యక్తి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాడు. కాలు విరిగిందని, సొంత ఊరు మక్తల్ లో ఉన్నానని, మార్చ్ 28న హైదరాబాద్ లో హాస్పిటల్ లో అపాయింట్మెంట్ ఉందని కోరడంతో... అందుకు కూడా కేటీఆర్ అంగీకరించి తన సిబ్బందిని ఈ పనులు చేయవలిసిందిగా ఆదేశించారు. 

హైదరాబాద్ లో ఆసుపత్రికి రావాలని బెంగళూరు వాసి వేడుకోలు... 

బెంగళూరుకు చెందిన నాగభూషణ్ అనే వ్యక్తి, తన అంకుల్ కి బ్రెయిన్ లో క్లోస్ ఉందని, హైదరాబాద్ లోని ఆసుపత్రిలో సాధ్యమైనంత త్వరగా చూపెట్టుకోవాలని ఆసుపత్రి లేఖను జతచేసాడు. దీనిపై కూడా కేటీఆర్ కావలిసిన ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. 

తిండి పరిస్థితి ఏమిటి...?....ప్రభుత్వం చూసుకుంటుంది!

అమ్మానాన్న ట్రస్టులో మతి స్థిమితం లేనివారు ఉంటారని, వారం రోజుల లాక్ డౌన్ అంటే కొందరు సహాయం చేసారని, ఇప్పుడు మరొక రెండు వారాలంటే... వారికి తిండి దొరకదని, ఇప్పటికే కరోనా కారణంగా వారికి తిండి దొరకడం లేదని ఆ ట్రస్టు వారు వాపోయారు. ఎం టెన్షన్ అవసరం లేదని జిల్లా యంత్రంగం అందుకు కావలిసిన అన్ని అవసరాలను