హాస్టల్స్ బాధితులకు ఊరట: సొంతూళ్లకు వెళ్లేందుకు పోలీసుల అనుమతి
లాక్‌డౌన్ దెబ్బకు హైదరాబాద్‌లో బ్యాచిలర్స్‌కు కొత్త కష్టాలు వచ్చాయి. విద్య, ఉపాధి అవసరాల నేపథ్యంలో వేలాది మంది యువత హైదరాబాద్‌లోని హాస్టల్స్‌లో ఉంటున్నాయి. లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో హాస్టల్స్ యాజమాన్యాలు వాటిని మూసివేస్తున్నాయి.
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. జనాలు రోడ్ల మీదకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. సాయంత్రం ఏడు నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.
మొదటి రెండు రోజులు రోడ్ల మీదకు వచ్చిన జనం.. పోలీసుల దెబ్బకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే లాక్‌డౌన్ దెబ్బకు హైదరాబాద్‌లో బ్యాచిలర్స్‌కు కొత్త కష్టాలు వచ్చాయి. విద్య, ఉపాధి అవసరాల నేపథ్యంలో వేలాది మంది యువత హైదరాబాద్‌లోని హాస్టల్స్‌లో ఉంటున్నాయి.
Also Read:తెలంగాణలో మరో మూడు కాంటాక్ట్ కేసులు: 39కి చేరిన కరోనా సంఖ్య
లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో హాస్టల్స్ యాజమాన్యాలు వాటిని మూసివేస్తున్నాయి. దీంతో యువతి, యువకులకు ఇబ్బందులు వచ్చి పడ్డాయి. హాస్టల్స్‌లో ఉండే వీలు లేక.. ఇటు సొంత ఊళ్లకు వెళ్లలేక యువత నడిరోడ్డుపై నిలబడ్డారు.
దిక్కుతోచని పరిస్ధితుల్లో దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లకు క్యూ కట్టారు. తాము సొంత ఊళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ఎస్సార్ నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఇదే పరిస్ధితి కనిపించింది.
Also Read:లాఠీ దెబ్బ సురక్షితం: శానిటైజర్లు పూసి మరీ దంచుతున్న పోలీసులు, వీడియో వైరల్
విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు.. ఎట్టకేలకు యువత వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించారు. 24 గంటల్లో వీరంతా సొంతూళ్లకు చేరుకోవాలని పోలీసులు ఆదేశించారు.