ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్’’లో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై వరాల జల్లు కురిపించడంతో పాటు వేతన జీవులకు ఆదాయ పరిమితి భారీగా పెంచింది. దీంతో స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి.

ఇవాళ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. పీయుష్ గోయెల్ బడ్జెట్ ప్రసంగం తర్వాత భారీ లాభాల దిశగా దూసుకెళ్తున్నాయి. మధ్యాహ్నం వరకు సెన్సెక్స్ 477 పాయింట్లు ఎగబాకి 36,733 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 127 పాయింట్ల లాభంతో 10,957 వద్ద కొనసాగుతోంది. 

కేంద్ర బడ్జెట్ 2019: ముఖ్యాంశాలు

సామాన్యులకు వరాలు: గోయల్ ఎన్నికల బడ్జెట్

రూ.5లక్షలు కాదు.. రూ.6.5లక్షల వరకు పన్ను మినహాయింపు