Asianet News Telugu

కేంద్ర బడ్జెట్ 2019: ముఖ్యాంశాలు

ప్రధాని నరేంద్రమోడీ సర్కార్ చివరి బడ్జెట్‌ను మరికొద్దిసేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌‌ను తాత్కాలిక ఆర్ధిక మంత్రి పీయూష్ గోయల్ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సూట్‌కేసుతో గోయల్ పార్లమెంట్‌కు చేరుకున్నారు. 

Incharge Finance Minister Piyush Goyal arrives at the Parliament
Author
New Delhi, First Published Feb 1, 2019, 10:04 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కేంద్ర బడ్జెట్ --2019ని కేంద్ర తాత్కాలిక ఆర్ధిక మంత్రి పీయూష్ గోయెల్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్ధిక మంత్రి హోదాలో ఆయన తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అరుణ్ జైట్లీ త్వరగా కోలుకోవాలంటూ ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.* దేశ ఆర్ధిక వ్యవస్థ క్రమంగా గాడినపడుతోంది

* బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్లపై రూ. 50 వేల వరకూ వడ్డీకి పన్ను మినహాయింపు

* ఇంటి అద్దె రూపంలో వచ్చే ఆదాయానికి రూ. 2.4 లక్షల వరకూ పన్ను మినహాయింపు

* 10 లక్షల పైన ఎంతైనా 30 శాతం పన్ను

* గతంలో రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.12,500 రూపాయల పన్ను

* సేవింగ్స్‌పై రూ. 40 వేల వరకు పన్ను మినహాయింపు

* టీడీఎస్ పరిమితి రూ.40 వేల నుంచి రూ.50 వేలకు పెంపు

* ఆదాయపు పన్ను పరిమితి రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంపు

* స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలకు పెంపు

* ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే రూ.6.5 లోపు ఆదాయపు పన్ను మినహాయింపు

* దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి

* వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా భారత్

* భారత్‌లో ఎలక్ట్రానిక్ వాహన వినియోగం పెరిగింది

* 2030 కల్ల ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగంలో భారత్‌దే అగ్రస్థానం

* అంతర్గత జలరవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తాం

* 2030 నాటికి డిజిటల్ ఇండియాలోకి భారతీయులు

* 2022 నాటికి అంతరిక్షంలో భారతీయ వ్యోమగాములు

* రానున్న 8 ఏళ్లలో 10 ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్ధిక వ్యవస్థ

* నల్ల ధనాన్ని అరికట్టేందుకు చేసిన దాడుల్లో 50 వేల కోట్ల రూపాయలు సీజ్ చేశాం

* రూ.6900 కోట్ల బినామీ ఆస్తుల స్వాధీనం

* 24 గంటల్లోనే ఐటీఆర్ ప్రాసెస్, రిఫండ్

*  గతేడాది దాఖలైన రిటర్న్స్‌లో 94 శాతం యథాతథంగా ఆమోదించారు

*  ఇల్లు కొనే వాళ్లపై జీఎస్టీ భారం తగ్గిస్తాం

* నల్లధనం నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం

* సినిమా నిర్మాణానికి సింగిల్ విండో అనుమతులు

* సినిమా థియేటర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు

* ఇళ్ల కొనుగోలుదారులపై జీఎస్టీ మినహాయింపుపై త్వరలో నిర్ణయం

* ఎలక్ట్రానిక్ వాహనాలకు దేశంలోనే బ్యాటరీల తయారీ.. దీని వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది

* మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం

* ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.15,166 కోట్లు కేటాయింపు

* ఐదేళ్లలో 34 కోట్ల జన్‌ధన్ ఖాతాలు ప్రారంభం

* ప్రత్యక్ష పన్నుల ద్వారా ఆదాయం రూ.12 లక్షల కోట్లు

* 80 శాతం పెరిగిన ట్యాక్స్‌పేయర్లు

* పన్ను మినహాయింపు నూ. 50 వేలు పెంపు

* ఆదాయపు పన్ను పరిమితి రూ. 3 లక్షలకు పెంపు

* త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం

* టెలికాం రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు

* ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో మొబైల్ డేటా, వాయిస్ కాల్స్

* సోలార్ విద్యుదుత్పత్తిలో 10 రెట్ల వృద్ధి

* ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రహదారులు నిర్మించాం

* ప్రతి రోజూ 27 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం

* ప్రధాన మంత్రి శ్రమ యోగి బంధన్ పేరుతో పింఛన్ పథకం

* రైల్వే రంగానికి రూ. 64,587 కోట్లు

* ఆవుల సంరక్షణకు కమిషన్ ఏర్పాటు

* రైల్వేల చరిత్రలో ఇది ప్రమాదాలు తక్కువగా ఉన్న ఏడాది

* బ్రాడ్‌గేజ్‌లో కాపలా లేని గేట్లను తొలగించాం

* సాగర్‌మాల కింద పోర్టుల ద్వారా సరకు రవాణా

* బ్రహ్మపుత్ర ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరకు రవాణా  

* రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్లు

*  వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం ఇప్పటికే రూ.35 వేల కోట్లు చెల్లించాం

* పీఎం కౌషల్ వికాస్ యోజన కింద కోటిమంది యువతకు శిక్షణ

* దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లు

* సైనికులకు ప్రత్యేక అలవెన్సులు

* అంగన్‌వాడీ సిబ్బంది వేతనం 50 శాతం పెంపు

* ప్రకృతి విపత్తు వల్ల పంట నష్టపోయిన వారి రుణాల రీషెడ్యూలింగ్ 

* రీ షెడ్యూల్ చేసిన రుణాలపై 2 శాతం వడ్డీ తగ్గింపు

* ఆవుల సంరక్షణకు ప్రత్యేక పథకం

* కిసాన్ క్రెడిట్ కార్డు కింద రుణాలు

* రుణాలు సకాలంలో చెల్లించిన వారికి రాయితీలు

* గ్రామీణులకు కొత్తగా 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు

* కార్మిక ప్రమాద బీమా రూ.లక్షన్నర నుంచి రూ. 6 లక్షలకు పెంపు

* గ్రాట్యుటీ పరిధి రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంపు

* ముద్ర స్కీం కింద రుణాలకు రూ. 7 లక్షల కోట్లు

* 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగం కార్మికులకు నెలకు రూ.3 వేల పెన్షన్

* అసంఘటిత కార్మికులు పెన్షన్ కోసం రూ.60 జమ చేయాల్సి ఉంటుంది

* ఈఎస్‌ఐ లిమిట్‌ను రూ.15 వేల నుంచి 21 వేలకు పెంపు

* రూ.15 వేల నెల జీతం వుండే వేతన జీవులకు కొత్త పథకం

* ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పేరుతో కొత్త స్కీమ్

* నెలకు రూ. 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది

* ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి రూ.75 వేల కోట్లు

* పాడి, మత్స్య రైతులకు 2 శాతం వడ్డీకే రుణం

* కొత్త పెన్షన్ విధానాన్ని సరళీకరిస్తాం

* పెన్షన్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు

* 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి

* 2018 డిసెంబర్ నుంచి ఈ కార్యక్రమం అమలు

* గోకుల్ మిషన్‌కి రూ. 750 కోట్లు

* గో ఉత్పాదకత పెంచడం కోసం రాష్ట్రీయ కామ్‌ధేన్ అయోగ్

* 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు రూ. 6 వేలు సాయం

* ప్రతి ఏడాది రూ. 6000 పెట్టుబడి సాయం

* చిన్న రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బు వెళుతుంది. మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల ద్వారా డబ్బు అందుతుంది

* ఎఫ్‌డీఐ విధానాన్ని పూర్తిగా సరళీకరించాం

* బ్యాంకుల విలీనాన్ని చేపట్టాం

* రాష్ట్రాలకిచ్చే వాటాను పెంచాం

* గ్రామాల్లో 95 శాతం పారిశుద్ధ్యం

* బొగ్గు, స్పెక్ట్రం వేలంలో పారదర్శకతకు ప్రాధాన్యం

* ఆయుష్మాన్ భారత్‌తో పేద, మధ్య తరగతికి రూ. 3 వేల కోట్లు ఆదా

* కొత్తగా 7 ఎయిమ్స్ ఆస్పత్రులు తీసుకొచ్చాం

* హర్యానాలో కొత్త ఎయిమ్స్ రాబోతోంది.

* 22 రకాల పంటలకు మద్ధతు ధర పెంచాం

* అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాం

* ఉపాధి హామీ రూ.60 వేల కోట్లు 

* గ్రామ సడక్ యోజనకు రూ. 19 వేల కోట్లు

* నాలుగేళ్లలో 1.53 కోట్ల ఇళ్లు నిర్మించాం

* మార్చి వరకు దేశంలో అన్ని ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు

* ఎల్‌ఈడీ బల్బులతో దేశంలో రూ. 50 వేల కోట్లు ఆదా చేశాం

* రూ. 3 లక్షల కోట్ల మొండి బకాయిలను రికవరీ చేశాం

* బ్యాంకులకు రూ. 2.6 లక్షల కోట్ల మూలధన సాయం అందించాం

* ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఇబ్బందులను అధిగమిస్తున్నాయి

* అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం

* స్వచ్ఛభారత్‌ను విజయవంతం చేసినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు

* అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాం

* ఆరో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించాం

* 2018-19కి ద్రవ్యలోటు అంచనా 3.4 శాతం

* కరెంట్ అకౌంట్ లోటును 5.6 నుంచి 2.5 శాతానికి తగ్గించాం

* మా ప్రభుత్వంలో ధరల నడ్డి విరిచాం

* మా  హయాంలో ద్రవ్యోల్బణం దిగివచ్చింది

* జీడీపీ వృద్ధి రేటులో గణనీయమైన పురోగతి

* మా ప్రభుత్వం ప్రతీ పథకాన్ని నిజాయితీగా అమలు చేస్తోంది

* గడిచిన ఐదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించాం

* మోడీ సారథ్యంలో సుస్థిర పాలన అందించాం.

* 2020లోగా నవభారతాన్ని చూడబోతున్నారు

* విధాన నిర్ణయాల్లో వేగం పెంచాం

* దేశ ఆర్ధిక వ్యవస్థ క్రమంగా గాడినపడుతోంది.

* రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్నదే మా లక్ష్యం

* అందరికీ ఇల్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించడమే లక్ష్యం

కేంద్ర బడ్జెట్ 2019-20కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన పార్లమెంట్ హాల్‌లో జరిగిన భేటీలో మంత్రిమండలి బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించింది.

ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టనున్న తాత్కాలిక బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 

ప్రధాని నరేంద్రమోడీ సర్కార్ చివరి బడ్జెట్‌ను మరికొద్దిసేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌‌ను తాత్కాలిక ఆర్ధిక మంత్రి పీయూష్ గోయల్ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సూట్‌కేసుతో గోయల్ పార్లమెంట్‌కు చేరుకున్నారు.

బడ్జెట్ ప్రతులను ఎంపీలకు అందజేసేందుక వీలుగా ఇప్పటికే సైన్యానికి చెందిన వాహనాలు పార్లమెంట్‌కు చేరుకున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రప్రభుత్వం రూపొందించనుండటంతో ఓటర్లను ఆకర్షించేందుకు పలు రాయితీలు, పథకాలకు బడ్జెట్‌లో చోటు కల్పించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలిగించే ప్రకటనలు ఉండవచ్చని సమాచారం.

 

Follow Us:
Download App:
  • android
  • ios