Asianet News TeluguAsianet News Telugu

రూ.5లక్షలు కాదు.. రూ.6.5లక్షల వరకు పన్ను మినహాయింపు


కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉద్యోగులకు, రైతులకు భారీ వరాలే కురిపించారు. 

Budget 2019: No Income Tax for Income up to 6.5 Lakhs
Author
Hyderabad, First Published Feb 1, 2019, 1:29 PM IST

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉద్యోగులకు, రైతులకు భారీ వరాలే కురిపించారు. ముఖ్యంగా ఉద్యోగులకు ఇది మంచి శుభవార్త. సంవత్సర ఆదాయం రూ.5లక్షల వరకు ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఈ బడ్జెట్ లో పేర్కొన్నారు. మరో 1.5లక్షల వరకు నిర్దేశిత రీతిలో పెట్టుబడులు పెట్టినవారికి కూడా పన్ను మినహాయింపు వస్తుందని తెలిపారు.

అంటే.. సంవత్సర ఆదాయం రూ.6.5 అనుకుంటే వాళ్లు రూ.1.5లక్షలను ప్రావిడెంట్ ఫండ్స్, లేదా నిర్దేశిత ఈక్విటీలలో  పెట్టుబడులు పెట్టాలి. అలా పెట్టుబడి పెడితే వారికి పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే మొత్తం రూ.6,50,000 వరకు పన్ను చెల్లించవలసిన అవసరం లేదన్నారు. సంవత్సరానికి రూ.5 లక్షల వరకు జీతం సంపాదించేవారికి ఎటువంటి పన్ను ఉండదని గోయల్ ప్రకటించారు. దీంతో దాదాపు 3 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.
 
ఇంటి అద్దెపై కూడా వెసులుబాటు ప్రకటించారు. సంవత్సరానికి రూ.2,40,000 వరకు టీడీఎస్ లేదని చెప్పారు. స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.40 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. బ్యాంకు, పోస్టాఫీస్ డిపాజిట్లపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను వసూలు పరిమితిని రూ.10 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios