ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చేనెల ఒకటో తేదీన 2020-21 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో టాక్స్ అడ్వైజర్స్, నిపుణులతో కేంద్ర ఆర్థికశాఖ అధికారులు, మంత్రులు నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాగూర్ సంప్రదింపులు జరిపారు. 

ప్రత్యేకించి దీర్ఘ కాల పెట్టుబడి లాభాల (ఎల్టీసీజీ)పై పన్ను తొలగించడంతో తలెత్తే ప్రతికూల పరిణామాలపై నిపుణులతో సంప్రదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలు మర్పించినప్పుడు ప్రవేశపెట్టిన ఎల్టీసీజీ పన్నుపై విమర్శలు వెల్లువెత్తాయి. 

also read Budget 2020: నిర్మలా సీతారామన్ బడ్జెట్.... పలు కీలక ప్రకటనలు...

లిస్టెడ్ ఈక్విటీలపై ఎల్టీసీజీ టాక్స్ ప్రతిపాదనకు దూరంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు, టాక్స్ అడ్వైజర్లు అభిప్రాయ పడుతున్నారు. దీర్ఘ కాల విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలంటే ఎల్టీసీజీ ట్యాక్స్ ప్రతిపాదన పక్కన బెట్టాలని సూచించారు. కనీసం రెండేళ్లపాటు ఎల్టీసీజీ టాక్స్ ప్రతిపాదనను వాయిదా వేయాలని భావిస్తున్నారు. 

గతేడాది సెప్టెంబర్ నెలలో న్యూయార్క్‌లో ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన స్పీచ్‌కు అనుగుణంగా ఎల్టీసీజీ టాక్స్ ప్రతిపాదనను తొలగించాలని ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తున్నది. సెప్టెంబర్ నెలలో న్యూయార్క్‌లో జరిగిన సభలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్లపై పన్ను అమలు చేస్తామని విదేశీ ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. పలు దేశాలు ఎల్టీసీజీ టాక్స్ అమలు చేయడం లేదని ఆర్థిక వేత్తలు గుర్తు చేస్తున్నారు. 

వ్యూహాత్మక పెట్టుబడిదారుడికి, స్వల్ప కాలిక ఇన్వెస్టర్‌కు మధ్య తేడాను గుర్తించాలని కేంద్రం భావిస్తున్నదని ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. కనీసం రెండేళ్ల పాటు ఎల్టీసీజీ విధానాన్ని నిలిపేయాలని విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్లు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను అభ్యర్థించారు. 

అంతర్జాతీయంగా అత్యంత అభివ్రుద్ది చెందిన మార్కెట్లలో ఎల్టీసీజీ ట్యాక్స్ అమలు కావడం లేదు. ఇన్వెస్టర్ ఫోరమ్‌ల వేదికలపై ఎల్టీసీజీ ట్యాక్స్ అమలు కావడం లేదన్న సంగతి ప్రభుత్వం ద్రుష్టికి వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. తొలుత ఎల్టీసీజీ ట్యాక్స్ పేరిట రూ.40 వేల కోట్ల రెవెన్యూ సంపాదించాలని ప్రభుత్వం ఆశలు పెట్టుకున్నది. కానీ దాన్ని ప్రస్తుతం దాన్ని రద్దు చేయడంతో ఆ ఊసే ఎవరూ ఎత్తడం లేదు. 

also read నిరుద్యోగులకు గుడ్ న్యూస్...కొత్త ఏడాదిలో లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలు

12 నెలలకు పైగా పెట్టుబడులు కొనసాగించిన వారినే దీర్ఘ కాలిక ఇన్వెస్టర్ భావించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఎల్టీసీజీ పన్ను రద్దు చేయడంతో గత ఏడాది నవంబర్ నాటికే ప్రభుత్వం రూ.8.07 లక్షల కోట్ల ద్రవ్యలోటును అధిగమించేందుకు కసరత్తు చేస్తోంది.

ఏడాది మొత్తం అంచనాలతో పోలిస్తే ఇది 13 శాతానికి ఎక్కువ అని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అక్కౌంట్స్ పేర్కొన్నారు. పన్ను వసూళ్లు కూడా అంచనాల కంటే తక్కువగానే ఉన్నాయి. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ ఇంటర్నల్ టార్గెట్ ప్రకారం 16 శాతం తక్కువ అని సమాచారం.