బెంగళూరు: డేటా సైన్స్ లో ఈ ఏడాది భారతదేశంలో 1.5 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 62% పెరుగుదల అని ఎడ్టెక్ సంస్థ తయారుచేసిన ఒక నివేదికలో తెలిపింది.ఈ ఉద్యోగాల్లో ఎక్కువ భాగం ఐదేళ్ల లోపు అనుభవం ఉన్న నిపుణులకే అవకాశం కల్పించనున్నారు.

also read సామ్‌సంగ్ మొబైల్ నూతన మార్కెటింగ్ చీఫ్‌గా రోతే మూన్‌

గ్రేట్ లెర్నింగ్ డేటా సైన్స్ పనిచేసే నిపుణుల మధ్య సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అధికారులు, నిర్వాహకులు ఇంకా  సీనియర్ మేనేజర్లు ఉన్నారు.2019లో సంస్థ అధ్యయనం ప్రకారం అర్హతగల ప్రతిభావంతుల కొరత కారణంగా అనలీటిక్స్, డేటాకు సంబంధించి 97,000 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

ఈ విధంగా ప్రతిభవంతులకు సంభంధించి అగ్ర రంగాలు బిఎఫ్‌ఎస్‌ఐ, ఎనర్జీ, ఫార్మా మరియు హెల్త్‌కేర్  ఇకామర్స్ మరికొన్నింటిలో నియమకాలను నియమించుకుంటాయి.గత కొన్ని సంవత్సరాలలో పెరుగుతున్న డిజిటల్ ఎకానమీతో డేటా సైన్స్ ప్రాముఖ్యతను సంతరించుకుంది ఎందుకంటే ఎంగేజిమెంట్, సేల్స్ మెరుగుపరచడానికి వినియోగదారులని బాగా అర్థం చేసుకోవడానికి కంపెనీలు అనుమతిస్తుంది.

also read Budget 2020: కార్పొరేట్ ట్యాక్స్...15%గా నిర్ణయించి..ఏప్రిల్‌ నాటికి అమలు చేయాలీ...

విస్తృతంగా డేటా అందుబాటులోకి రావడంతో వ్యాపారాభివృద్ధికి డేటా సైన్స్‌ విభాగం కీలకంగా మారిందని గ్రేట్‌లెర్నింగ్‌ కో ఫౌండర్‌ హరి కృష్ణన్‌ నాయర్‌ పేర్కొన్నారు. డేటా సైన్స్ డొమైన్‌ గణితం, గణాంకాలు, ఐటి అలాగే కంప్యూటర్ సైన్స్ సహా విభాగాలలో ఎక్స్పిరియన్స్ అవసరం.అధ్యయనం ప్రకారం ఎంట్రీ ఉద్యోగాలు సాధారణంగా డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్ మంచి డిమాండ్  ఉండనుంది.