Asianet News TeluguAsianet News Telugu

Budget 2020: కార్పొరేట్ ట్యాక్స్...15%గా నిర్ణయించి..ఏప్రిల్‌ నాటికి అమలు చేయాలీ...

అసమానతలకు తావులేకుండా కార్పొరేట్ ట్యాక్స్ ను హేతుబద్ధీకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఐఐ కోరింది. దాన్ని 15 శాతంగా నిర్ణయించాలని, తద్వారా మదుపర్లలో సెంటిమెంట్ బలోపేతం అవుతుందని సీఐఐ చైర్మన్ విక్రం కిర్లోస్కర్ తెలిపారు. 

Budget 2020: CII seeks announcement of corporate tax rate merger to 15%
Author
Hyderabad, First Published Jan 20, 2020, 10:57 AM IST

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ పన్ను శ్లాబ్ తేడాలు వద్దని, అన్నింటినీ 15 శాతంగా నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)  కోరింది. రాబోయే బడ్జెట్‌లో ఈ మేరకు ఓ ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేసిన సీఐఐ.. 2023 ఏప్రిల్‌ ఒకటో తేదీ నాటికి ఎటువంటి మినహాయింపులు, ప్రోత్సాహకాలు లేకుండా అమలు చేయాలని సూచించింది. 

ఒకే కార్పొరేట్ పన్ను వల్ల మదుపర్ల సెంటిమెంట్ బలోపేతం
మినహాయింపులు, తేడాలేకుండా ఒకే కార్పొరేట్ పన్ను విధానాన్ని అమలులోకి తేవడం వల్ల మదుపర్ల సెంటిమెంట్‌ బలపరిచినట్లవుతుందని, పెట్టుబడులకూ ఊతమిచ్చినట్లువుతుందని సీఐఐ అధ్యక్షుడు విక్రమ్‌ కిర్లోస్కర్‌ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే.

also read బ్యాంకుల ఏటీఎంలతో అందే సేవలివే.. టైం కూడా ఆదా

కార్పొరేట్ పన్నులో తేడాతో అసమానతలు
కార్పొరేట్‌ పన్ను రేట్ల వ్యత్యాసాలతో తయారీ, సేవా రంగాల్లో అసమానతలు ఏర్పడుతున్నాయని, ఇది భపరిణామం కాదని కిర్లోస్కర్‌ వ్యాఖ్యానించారు. పన్ను రేట్లు తక్కువగా ఉంటే పెట్టుబడి భారం తగ్గుతుందని, ప్రోత్సాహం పెరిగి పెట్టుబడులు ఆకర్షణీయంగా మారుతాయని విక్రమ్ కిర్లోస్కర్ పేర్కొన్నారు. కాగా, 2023కల్లా ఒకే కార్పొరేట్‌ పన్నును అమల్లోకి తెస్తామన్న ప్రకటన ఈ బడ్జెట్‌లోనే వస్తే మదుపరులు పెద్ద ఎత్తున పెట్టుబడులతో ముందుకు వచ్చే వీలుంటుందని చెప్పారు. 

అక్టోబర్ నెలలో 22 శాతానికి తగ్గిన కార్పొరేట్ టాక్స్
గతేడాది కార్పొరేట్‌ పన్ను రేట్లను కేంద్రం 22 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలను సంస్థలు పొందకుండా చేసింది. అయినా నిరుడు అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి 2023 మార్చి 31 లోగా ఏర్పాటై ఉత్పత్తిని ప్రారంభించే సంస్థలకు కార్పొరేట్‌ పన్ను 15 శాతమేనని మోదీ సర్కార్ స్పష్టం చేసింది. దీనికి సర్‌చార్జీ, సెస్సు అదనం. 1991-92లో 45 శాతంగా ఉన్న కార్పొరేట్‌ పన్ను.. 2019-20లో 22 శాతానికి దిగొచ్చింది.

ఏటీఎఫ్ నిర్దిష్ట పన్నుపై కేంద్రం నజర్
విమానయాన ఇంధనం (ఏటీఎఫ్‌)పై నిర్దిష్ట ఎక్సైజ్‌ సుంకాన్ని వేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. సమీప భవిష్యత్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో ఏటీఎఫ్‌ను కలిపే అవకాశాలు లేనందున ఈ నిర్దిష్ట ఎక్సైజ్‌ సుంకం విధించే అంశాన్ని మోదీ సర్కార్ ఆలోచిస్తున్నది. ప్రస్తుతం ఉన్న పన్ను ఉత్పాదక వ్యయం ఆధారిత పన్ను కావడంతో దీనితో సంబంధం లేకుండా నిర్దిష్ట పన్నుకు ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి.

Budget 2020: CII seeks announcement of corporate tax rate merger to 15%

నిర్దిష్ట పన్నుతో విమానయానికి మేలవుతుందని అంచనా
ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌పై ఈ నిర్దిష్ట ఎక్సైజ్‌ సుంకాలు అమల్లో ఉన్నాయి. పెట్రోల్‌పై రూ.21.16, డీజిల్‌పై రూ.15,83గా వసూలు చేస్తున్నారు. నిర్దిష్ట పన్నుతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విమానయాన పరిశ్రమకూ మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. 

పొదుపు చర్యలిలా.. ఒక లీటర్​ మద్యం, ఒక సిగరెట్​ డబ్బా
ప్రస్తుతం భారత్​లో పర్యటిస్తున్న (ఇన్​బౌండ్) విదేశీ ప్రయాణికులు టాక్స్​ ఫ్రీ దుకాణాల నుంచి రెండు లీటర్ల మద్యం, ఒక సిగరెట్ డబ్బా కొనడానికి అనుమతి ఉంది. అయితే పలు దేశాలు విదేశీ ప్రయాణికులకు కేవలం ఒక లీటర్ మద్యం మాత్రమే కొనడానికి అనుమతిస్తున్నాయి. ఇప్పుడు దీనినే భారత్​లోనూ అమలు చేయాలని వాణిజ్యమంత్రిత్వశాఖ సిఫారసు చేసింది.

వాణిజ్యలోటు తగ్గింపునకు వాణిజ్య మంత్రిత్వశాఖ చర్యలు
వాణిజ్యలోటును తగ్గించేందుకు.. అనవసర వస్తువుల దిగుమతిని తగ్గించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం వివిధ మార్గాలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో వాణిజ్యమంత్రిత్వశాఖ సిఫార్సులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 
డ్యూటీ ఫ్రీ విధానంలో భాగంగా భారత్​లో పర్యటిస్తున్న విదేశీ ప్రయాణికులు దిగుమతి సుంకం చెల్లించకుండానే సుమారు రూ.50వేల విలువైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

also read బడ్జెట్ 2020: చిన్న పరిశ్రమలకు ‘ఫండ్స్ ఆఫ్ ఫండ్స్’: సిన్హా కమిటీ సిఫారసులకు ఓకే

ముడి ఇనుముపై దిగుమతి సుంకాలను ఎత్తివేయండి
ఫెర్రో-నికెల్‌, స్టీల్‌ తుక్కు వంటి ముడి ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని ఎత్తివేయాలని స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పరిశ్రమ కోరుతున్నది. వచ్చే బడ్జెట్‌లో ఈ మేరకు ఓ నిర్ణయాన్ని తీసుకుని, తమను ఆదుకోవాలని భారతీయ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఎస్‌డీఏ) విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఓ విజ్ఞాపన పత్రాన్ని అందజేశామని అసోసియేషన్‌ వెల్లడించింది. 

సోదాహరణంగా వివరాలు తెలిపిన స్టీల్ డెవలప్మెంట్ అసోసియేషన్
చైనా, కొరియా, జపాన్‌, ఈయూ, అమెరికా దేశాల్లో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ తుక్కుపై దిగుమతి సుంకాలు లేవని అసోసియేషన్‌ అధ్యక్షుడు కేకే పహుజా గుర్తుచేశారు. సుంకాల ఎత్తివేత పరిశ్రమలో ఉద్యోగావకాశాలనూ పెంచగలదన్నారు. మరోవైపు కోకింగ్‌ కోల్‌, పెట్‌ కోక్‌, లైమ్‌స్టోన్‌, డోలమైట్‌ వంటి ముడి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ కేంద్రాన్ని కోరింది.

Follow Us:
Download App:
  • android
  • ios