Asianet News TeluguAsianet News Telugu

సామ్‌సంగ్ మొబైల్ నూతన మార్కెటింగ్ చీఫ్‌గా రోతే మూన్‌

ఎగ్జిక్యూటివ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా టెక్ దిగ్గజం సామ్‌సంగ్  ఎలక్ట్రానిక్స్ గురువారం మొబైల్ మార్కెటింగ్ చీఫ్‌గా రోతే మూన్‌ ను ప్రకటించింది.

samsung elects roh tae moon name as new mobile marketing chief
Author
Hyderabad, First Published Jan 20, 2020, 12:25 PM IST

కొరియన్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ ఆపరేషన్స్‌ కోసం నూతన హెడ్‌ను నియమించింది. లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సామ్‌సంగ్  వైస్ చైర్మన్‌ను అరెస్టు చేసిన తరువాత చాలా కాలం పాటు ఎగ్జిక్యూటివ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా టెక్ దిగ్గజం సామ్‌సంగ్  ఎలక్ట్రానిక్స్ గురువారం మొబైల్ మార్కెటింగ్ చీఫ్‌గా రోతే మూన్‌ ను ప్రకటించింది.

also read హువావే చీఫ్ ఆఫీసర్ విడుదలపై సంచలన తీర్పు...


ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చోయి క్యుంగ్-సిక్ మొబైల్ డివిజన్  స్ట్రటేజిక్ మార్కెటింగ్ ఆఫీస్ హెడ్ గా పదోన్నతి పొందారని సామ్‌సంగ్ తెలిపింది. ఇంతకు ముందు ఉన్న లీ సాంగ్-చుల్ సంస్థ  సౌత్ ఈస్ట్ ఆసియన్ ఆపేరేషన్స్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి అతనిని తిరిగి నియమించారు.

samsung elects roh tae moon name as new mobile marketing chief

కోహ్ డాంగ్-జిన్ సామ్‌సంగ్ సంస్థ  ప్రతినిధి స్మార్ట్ ఫోన్ బిజినెస్ అధిపతిగా కొనసాగుతున్నారు.దక్షిణ కొరియా సంస్థ క్వాన్ కై-హ్యూన్‌ను చైనా స్మార్ట్ ఫోన్ వ్యాపారానికి అధిపతిగా పేర్కొంది. చైనాలో సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలకు  ప్రత్యర్థులైన హువావే, ఒప్పో ఇంకా వివోల మధ్య పోటీ ఊపందుకోకున్నాయి.

also read ఆన్‌లైన్ ఆఫర్ల సునామీ: ఫ్లిప్ కార్ట్ వర్సెస్ అమెజాన్ ఒకేసారి


ప్రపంచంలోని అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్‌లు, మెమరీ చిప్‌లు ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో లాభం చేకూరుస్తుందని భావిస్తున్నారు. అయితే సామ్‌సంగ్ గ్రూప్ లీడర్ జై వై లీ అరెస్ట్ తరువాత సామ్‌సంగ్ భవిష్యత్, వ్యూహలపై సందేహాలను రేకెతిస్తుంది.మాజీ అధ్యక్షుడు పార్క్ జియున్-హేను బ్యాన్ చేసి అరెస్టు చేయడానికి దారితీసిన కుంభకోణంలో భాగంగా జై వై లీ(48) ఫిబ్రవరి నుండి నిర్బంధంలో ఉన్నారు. ఈ విషయంలో అతను ఎటువంటి తప్పు చేయలేదని తివ్రంగా  ఖండించాడు.

గత ఏడాది చివరి నుండి పెండింగ్‌లో ఉన్న సిబ్బంది మార్పులకు మరింత ఆలస్యం కావొచ్చని ఇంకా అమ్మకాలో పోటీ చేసే సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని సామ్‌సంగ్  తెలిపింది. స్మార్ట్ ఫోన్ వ్యాపార మార్కెట్ లో తమకు ప్రధాన ఛాలెంజర్ ఆపిల్ అని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios