వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కానున్న సంపన్నులు...దాదాపు 219 కోట్లు...

వచ్చే ఐదేళ్లలో భారతదేశంలో సంపన్నుల జనాభా 73 శాతం పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. సంపన్నులు అత్యధికంగా రియాల్టీ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారని తెలిపింది.

India's UHNWI Population To Grow By 73% In Five Years: Knight Frank

న్యూఢిల్లీ: భారతదేశంలో అత్యంత కుబేరుల సంఖ్య వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కానున్నది. 30 మిలియనీర్ల డాలర్లు (దాదాపు రూ.219 కోట్లు), అంతకంటే ఎక్కువ సంపద ఉన్న వారిని అల్ట్రావెల్తీ పీపుల్‌‌‌‌గా పిలుస్తారు. 2024 వరకు వీరి సంఖ్య 73 శాతం పెరిగి 10,354కు చేరుకోనున్నదని ప్రముఖ రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ కన్సల్టెన్సీ ‘నైట్‌‌‌‌ఫ్రాంక్‌‌‌‌’  వెల్లడించింది. 

2022 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు ఏడుశాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీనివల్ల సంపన్నుల సంఖ్య పెరుగుతుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్‌‌‌‌లో ఇండియా జీడీపీ కేవలం 4.7 శాతం మాత్రమే రికార్డు అయిన సంగతి తెలిసిందే. 

ఈ ఏడాది జీడీపీ రేటు ఐదు శాతం ఉంటుందని అంచనా. ఈ దశాబ్దంలో ఇదే అతి తక్కువ రేటు. ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు, డిమాండ్‌‌‌‌ పడిపోవడం, తయారీరంగం దెబ్బతినడం ఇందుకు కారణాలు. ఎకానమీ స్లోడౌన్‌‌‌‌ను అడ్డుకోవడానికి చాలా చర్యలు తీసుకుంటామని బడ్జెట్‌‌‌‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

also read యెస్ బ్యాంక్ దివాళా...? ఖాతాదారుల ఆందోళన....

మనదేశంలో స్థిరాస్తుల రంగం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా ఇండియాలో కుబేరులు మాత్రం ఈ సెక్టార్లోకి ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను గుమ్మరిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది రియల్టీలో పెట్టుబడులు పెట్టడానికి చాలా  మంది కుబేరులు రెడీ అవుతున్నారు. 

కమర్షియల్‌‌‌‌ ప్రాపర్టీలు కొంటామని 26 శాతం మంది కుబేరులు వెల్లడించారు. ఇంగ్లండ్‌‌‌‌, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌‌‌‌, యూఏఐ దేశాల్లో ప్రాపర్టీలు కొంటామని 15 శాతం మంది ప్రకటించారు. క్వాలిటీ లైఫ్‌‌‌‌ ఉండే ప్రాంతాల్లో ఆస్తుల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. 

రియల్టీలో అన్నింటికంటే ఆఫీస్ సెక్టార్‌‌‌‌ మేలని ప్రైవేటు క్యాపిటల్ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌, ఎడ్యుకేషన్‌‌‌‌ రంగాల్లోనూ ఇన్వెస్ట్‌‌‌‌ చేస్తామని చెప్పారు. ఈ రంగాల్లో లాభాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

ఇండియాలోని కుబేరుల్లో 29 శాతం మంది గత ఏడాది ఈక్విటీలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. 21 శాతం మంది బాండ్లవైపు  మొగ్గుచూపారు. 20 శాతం మంది ప్రాపర్టీల్లో పెట్టుబడి పెట్టారు.

ప్రైవేట్‌‌‌‌ ఈక్విటీల్లో పెట్టుబడులు 2018లో ఏడుశాతం ఉండగా, 2019లో ఇవి ఏడు శాతానికి పెరిగాయి. ఇక నుంచి కూడా ప్రైవేటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను కొనసాగిస్తామని 85 శాతం మంది యూహెచ్‌‌‌‌ఎన్‌‌‌‌డబ్ల్యూఐలు ప్రకటించారు.

మనదేశంలోని సంపన్నుల్లో 67 శాతం మంది గత ఏడాది దానధర్మాలకు ఖర్చును పెంచారు. అన్నింటికంటే విద్యాభివృద్ధికి ఎక్కువ విరాళాలు ఇస్తామని తెలిపారు. ఇక, ‘సిటీ వెల్త్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌’లో ముంబై, ఢిల్లీ, బెంగళూరులో వరుసగా 44, 58, 89 స్థానాల్లో నిలిచాయి.

also read ప్రజల అకాంక్షలు...హామీలే ప్రధానం: 8న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

రాబోయే ఐదేళ్లలో సంపద విషయంలో యూరప్‌‌‌‌ను ఆసియా మించిపోతుంది. ఆసియా దేశాల్లోని సంపన్నుల సంపద 44 శాతం పెరుగుతుంది. జీడీపీ రేటు 2024 నాటికి 7 శాతానికి  చేరుతుంది. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది కొత్తగా 31 వేల మంది సంపన్నులుగా మారారు. ప్రస్తుతం వీరి సంఖ్య 5.13 లక్షలకు చేరింది. 

ఇండియాలో 2024 నాటికి సంపన్నుల సంఖ్య 10,354కు చేరుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం‌‌‌తో ఆందోళన చెందుతున్నామని ఇండియాలో ఎక్కువ మంది సంపన్నులు తెలిపారు. ట్రేడ్‌‌‌‌వార్లు, రాజకీయ పరిస్థితులు, అవినీతి తమకు ఇబ్బందిగా పరిణమించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

మనదేశంలో గత ఏడాది బిలియనీర్ల సంఖ్య 104 మంది కాగా, 2024 నాటికి వీరి సంఖ్య 113కు చేరుతుందని అంచనా. 200 దేశాలకు చెందిన 620 మంది ప్రైవేటు బ్యాంకర్లు, వెల్త్‌‌‌‌అడ్వైజర్ల అభిప్రాయాలతో ‘వెల్త్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌ 2019’ను తయారు చేసినట్టు నైట్‌‌‌‌ఫ్రాంక్‌‌‌‌ ప్రకటించింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios